S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/31/2016 - 18:13

సిడ్ని : ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ-ట్వంటీ క్రికెట్ మ్యాచ్‌లో బారత్ విజయబావుటా ఎగరేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీ చివరి బంతికి భారత్ విజయాన్ని సాధించింది. తొలి రెండు పోటీల్లో నెగ్గిన భారత్ చివరి మ్యాచ్‌లోనూ ప్రతిభచూపింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 198 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది.

01/31/2016 - 07:34

ఈ రోజు కోసం నేను చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. ఇది నా జీవితకాల స్వప్నం. ఇకపై నేను కూడా గ్రాండ్ శ్లామ్ విజేతనని గుర్వంగా చెప్పుకోగలుగుతాను. మాజీ చాంపియన్ స్ట్ఫె గ్రాఫ్‌ను ఆదర్శంగా తీసుకొని నేను చాలా కష్టపడ్డాను. ఇన్నాళ్లకు నా కల ఫలించింది. నా కెరీర్‌లో ఈ రెండు వారాలు అత్యుత్తమమైనవి. ఈ విజయం నాకు చిరస్మరణీయమైనది.
- ఏంజెలిక్ కెర్బర్

01/31/2016 - 07:32

విశాఖపట్నం (స్పోర్ట్స్), జనవరి 30: విశాఖలోని పోర్టు స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ప్రోకబడ్డీ టోర్నమెంట్ తొలిమ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టుపై యు ముంబా జట్టు ఘన విజయాన్ని సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ చివరి వరకూ పోరాడి ఓటమిని చవిచూసింది. ఆట సగభాగం పూర్తయ్యే సమయానికి తెలుగు టైటాన్స్ ఎనిమిది పాయింట్లతో, ముంబా జట్టు 18 పాయింట్లతో నిలిచాయి.

01/31/2016 - 07:31

మెల్బోర్న్, జనవరి 30: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ పురుషుల ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌ను ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నానని బ్రిటిష్ ఆటగాడు, రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే స్పష్టం చేశాడు. గతంలో ఎదుర్కొన్న పరాజయాలుగానీ, గణాంకాలుగానీ ముఖ్యంకాదని, ఎవరికైనా ప్రతి మ్యాచ్ కొత్త పోరాటమేనని అన్నాడు.

01/31/2016 - 07:30

సిడ్నీ, జనవరి 30: భారత్‌తో ఆదివారం జరిగే చివరి, మూడో టి-20 మ్యాచ్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ నాయకత్వం వహిస్తాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయపడడంతో, అతని స్థానంలో వాట్సన్‌కు బాధ్యతలు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) నిర్ణయించింది. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు ఫించ్ కండరాలు బెణకడంతో ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్నాడు.

01/31/2016 - 07:29

లక్నో, జనవరి 30: సయ్యద్ మోదీ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీ ఫైనల్‌లో అతను బూన్సాక్ పొన్సానాను 21-14, 21-7 తేడాతో ఓడించాడు. ఈ టోర్నీలో మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్న అతను సెమీస్‌లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో హువాంగ్ యూజియాంగ్‌ను ఢీకొనేందుకు సిద్ధమవుతున్నాడు.

01/31/2016 - 07:28

సిడ్నీ, జనవరి 30: ఆస్ట్రేలియాపై మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా ఆదివారం నాటి మ్యాచ్‌కి మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా సిద్ధమైంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లను గెల్చుకొని, సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ ఇక చివరి మ్యాచ్‌లోనూ విజయభేరి మోగించి ఆసీస్‌కు వైట్‌వాష్ వేయడంపై కనే్నసింది.

01/30/2016 - 06:37

మెల్బోర్న్, జనవరి 29: ఆస్ట్రేలియాలో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది.

01/30/2016 - 06:26

మెల్బోర్న్, జనవరి 29: అంతర్జాతీయ ఈవెంట్లలో అప్రతిహతంగా దూసుకెళ్తున్న టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) గ్రాండ్‌శ్లామ్ పోటీల్లో ‘హ్యాట్రిక్’ టైటిల్ కైవసం చేసుకుని మరోసారి సత్తా చాటుకున్నారు.

01/30/2016 - 06:24

మెల్బోర్న్, జనవరి 29: కంగారూలతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజి)లో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 27 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించి మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Pages