S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/28/2016 - 08:13

మెల్బోర్న్, జనవరి 27: ఇటీవల వెల్లువెత్తిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ప్రపంచ టెన్నిస్ అధికారులు నిర్ణయించారు. ఎటిపి, డబ్ల్యుటిఎ, ఐటిఎఫ్‌తోపాటు నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీల కీలక అధికారులు బుధవారం ఇక్కడ సమావేశమై మ్యాచ్ ఫిక్సింగ్‌పై కొరడా ఝళిపించాల్సిన అవసరం ఉందని, దర్యాప్తు జరిపించిన తర్వాత దోషులపై కఠినంగా వ్యవహరించాలని తీర్మానించారు.

01/28/2016 - 08:12

న్యూఢిల్లీ, జనవరి 27: రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్‌కు భారత ఏస్ షూటర్ హీనా సిద్ధు క్వాలిఫై అయంది. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అర్హత సంపాదించేందుకు భారత షూటర్లు చివరి ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం నుంచి ఇక్కడ ప్రారంభమైన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ పోటీల్లో రాణించిన వారు రియోకు క్వాలిఫై అవుతారు. పురుషులు, మహిళల ట్రాప్, స్కీట్ విభాగాల్లో నాలుగేసి స్థానాలు రియోకు అందుబాటులో ఉంటాయి.

01/28/2016 - 08:12

జీబ్రాల్టర్, జనవరి 27: ప్రపంచ మాజీ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు ఇక్కడ ఆరంభమైన జీబ్రాల్టర్ చెస్ టోర్నమెంట్ మాస్టర్స్ విభాగం తొలి రౌండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. 23 సంవత్సరాల తర్వాత మొదటిసా ఒక ఓపెన్ ఈవెంట్‌లో పాల్గొంటున్న అతను హంగెరీకి చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ జిడొనియా లజార్నే చేతిలో ఓటమిపాలయ్యాడు.

01/27/2016 - 05:31

మెల్బోర్న్, జనవరి 26: ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ చేతిలో రష్యాబ్యూటీ మరియా షరపోవా మరోసారి పరాజయాన్ని ఎదుర్కొంది. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సెరెనా క్వార్టర్ ఫైనల్స్‌లో షరపోవాను 6-4, 6-1 తేడాతో చిత్తుచేసింది. సెరెనాకు షరపోవాపై ఇది వరుసగా 18వ విజయం కావడం గమనార్హం.

01/27/2016 - 05:27

అడెలైడ్, జనవరి 26: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ మరో మూడూ బంతులు మిగిలి ఉండగా, 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా ముందు 188 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా ఆతర్వాత ప్రత్యర్థిని 19.3 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ చేసింది. సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

01/27/2016 - 05:26

మెల్బోర్న్, జనవరి 26: ‘సాన్‌టినా’గా పేరుపొందిన సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో వీరు అనా లెనా గ్రొన్‌ఫెల్డ్, కొకొ వాండెవెగ్ జోడీని 6-2, 4-6, 6-1 తేడాతో ఓడించారు. వీరికి ఇది వరుసగా 34వ విజయం.

01/27/2016 - 05:26

మెల్బోర్న్, జనవరి 26: ఆస్ట్రేలియా ఓపెన్‌లో పోటీదారులంతా ఉష్ణతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఈ విషయం చాలా స్పష్టంగా తెలిసింది. సెరెనాతో తలపడిన షరపోవా బ్రేక్ లభించిన ప్రతిసారీ పరుగుపరుగున వెళ్లి ఐస్ టవల్స్ తలపై వేసుకొని సేదతీరింది. కోర్టులోకి అడుగుపెట్టినప్పుడు వేడిని భరించలేక తీవ్ర అసహనానికి గురైంది. ఆటపై దృష్టిని కేంద్రీకరించలేకపోయింది.

01/27/2016 - 05:25

లక్నో, జనవరి 26: పద్మ భూషణ్ అవార్డును అందుకోనున్న ప్రపంచ రెండో ర్యాంక్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మంగళవారం ఇక్కడ ప్రారంభమైన సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి చివరి క్షణాల్లో వైదొలగింది. కాలి గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె ప్రకటించింది.

01/26/2016 - 03:12

బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా... ఇద్దరూ వేరువేరు ప్రాంతాల్లో జన్మించినా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇద్దరూ హైదరాబాద్ కీరిత్రపతిష్ఠలను ఇనుమడింప చేస్తున్నారు. సోమవారం కేంద్రం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డు వీరికి దక్కడంతో హైదరాబాదీలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

01/26/2016 - 03:09

మెల్బోర్న్, జనవరి 25: బ్రిటిష్ క్రీడాకారిణి జొహన్నా కొన్టా ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో సోమవారం సంచలన విజయాన్ని నమోదు చేసింది. మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో ఆమె 4-6, 6-4, 8-6 ఆధిక్యంతో 21వ సీడ్ ఎకతరిన మకరోవాను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. 32 ఏళ్ల తర్వాత ఒక గ్రాండ్ శ్లామ్‌లో క్వార్టర్స్ చేరిన తొలి బ్రిటిష్ మహిళగా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించింది.

Pages