S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/03/2016 - 05:39

అఫ్గానిస్థాన్‌తో శాఫ్ కప్ ఫైనల్ నేడు

01/03/2016 - 05:37

నెల్సన్ (న్యూజిలాండ్), జనవరి 2: శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం జరగాల్సిన నాలుగో వన్డే వర్షం కారణంగా రద్దయింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో మైదానం బురదమయంకాగా, ఆట ఆలస్యంగా ఆరంభమైంది. దీనితో దీనిని 24 ఓవర్ల మ్యాచ్‌గా కుదించారు. అయితే, ఆటలో కేవలం తొమ్మిది ఓవర్లు మాత్రమే బౌల్‌కాగా, ఆతర్వాత భారీ వర్షం కురిసింది. దీనితో ఆటను నిలిపివేశారు.

01/02/2016 - 03:13

కరాచీ, జనవరి 1: కళంకిత పేస్ బౌలర్ ముహమ్మద్ అమీర్ (23)కు పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టులో మళ్లీ చోటు లభించింది. పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు త్వరలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లబోతున్న పాక్ జట్టులో శుక్రవారం అమీర్‌కు స్థానం కల్పించారు. దీంతో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో దోషిగా తేలి తీవ్రమైన అపఖ్యాతిని మూటగట్టుకున్న అమీర్ అన్ని అవరోధాలను అధిగమించి ‘నూతన సంవత్సర కానుక’ అందుకున్నట్లయంది.

01/02/2016 - 03:10

కొలంబో, జవరి 1: శ్రీలంక క్రికెటర్లు కుశాల్ జనిత్ పెరీరా, రంగన్ హెరత్‌లను ఒక బుకీ సప్రదించాడంటూ వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో ఒక ప్రాక్టీస్ నెట్‌బౌలర్ అనుమానితుడుగా ఉన్నట్లు శ్రీలంక క్రీడల శాఖ మంత్రి దయాసిరి జయశేకర శుక్రవారం చెప్పాడు. అతనిపై ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం(ఎఫ్‌సిడిఐ) వద్ద తాము ఫిర్యాదు చేయనున్నట్లు జయశేకర విలేఖరులకు చెప్పాడు.

01/02/2016 - 03:08

ముంబయి, జనవరి 1: రెండేళ్ల విరామం తర్వాత శనివారం ఇక్కడ తిరిగి ప్రారంభం కానున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పిబిఎల్) తొలి పోటీలో పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న ముంబయి రాకెట్స్ జట్టు, సైనా నెహ్వాల్ నేతృత్వంలోని అవధే వారియర్స్‌తో తలపడనుంది. కాగా, ఒక పోటీలో చివరి దాకా ఆసక్తిని కొనసాగించే ఉద్దేశంతో ఈ లీగ్ టోర్నమెంట్‌లో ‘ట్రంప్‌మ్యాచ్’ అనే కొత్త ప్రయోగం చేయనున్నారు.

01/02/2016 - 03:07

న్యూఢిల్లీ, జనవరి 1: ప్రతిష్టాత్మకమైన సయ్యద్ ముస్తాక్ అలీ నేషనల్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. దేశంలోని నాలుగు వేర్వేరు నగరాల్లో జరిగే ఈ టోర్నీ త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే ట్వంటీ-20 సిరీస్‌లో పాల్గొనబోతున్న యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు చక్కటి అవకాశాన్ని కల్పించనుంది.

01/02/2016 - 03:07

న్యూఢిల్లీ, జనవరి 1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నమెంటులో ఆయా జట్లు కొనసాగిస్తున్న ఆటగాళ్లలో దక్కాల్సిన వేతనానికన్నా ఎక్కువ అందుకున్న కొద్ది మంది ఆటగాళ్లలో భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) శుక్రవారం ప్రకటించిన జాబితాలో ఈ వివరాలు తెలిసాయి.

01/01/2016 - 05:29

తిరువనంతపురం, డిసెంబర్ 31: భారత జట్టు శాఫ్ కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఈ జట్టు మాల్దీవ్స్‌ను 3-2 తేడాతో ఓడించింది. జేజె లాల్పెక్లువా అత్యంత కీలకమైన రెండు గోల్స్ చేసి భారత్‌ను గెలిపించాడు. మ్యాచ్ 25వ నిమిషంలో కెప్టెన్ సునీల్ చత్రీ ద్వారా భారత్‌కు తొలి గోల్ లభించింది. 34వ నిమిషంలో జేజె చేసిన గోల్‌తో భారత్ 2-0 ఆధిక్యాన్ని అందుకుంది.

01/01/2016 - 05:28

మూడో వన్డేలో న్యూజిలాండ్‌పై గెలుపు

01/01/2016 - 05:27

మాడ్రిడ్, డిసెంబర్ 31: అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ బార్సిలోనా తరఫున 500వ మ్యాచ్ ఆడిన క్రీడాకారుడిగా అరుదైన గుర్తింపు సంపాదించాడు. లా లిగాలో భాగంగా రియల్ బెటిస్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా 4-0 తేడాతో విజయభేరి మోగించగా మెస్సీ ఒక గోల్ చేశాడు. సౌరెజ్ రెండు గోల్స్‌తో రాణించాడు. మ్యాచ్ 29వ నిమిషంలో బెటిస్ ఆటగాడు వెస్టర్మన్ ఓన్ గోల్ చేయడంతో బార్సిలోనా గోల్స్ ఖాతా ఆరంభమైంది.

Pages