S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/02/2015 - 06:11

దిండిగల్ (తమళనాడు), డిసెంబర్ 1: రంజీట్రోఫీ టోర్నమెంట్‌లో భాగంగా దుండిగల్‌లోని ఎన్‌పిఆర్ కళాశాల మైదానంలో మంగళవారం ఆతిథ్య తమిళనాడు, పంజాబ్ జట్ల మధ్య ప్రారంభమైన గ్రూప్-బి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఒకే రోజు 21 వికెట్లు కూలాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు జట్టు కేవలం 68 పరుగులకే ఆలౌటై రంజీల్లో రెండవ అత్యల్ప స్కోరును నమోదు చేసింది.

12/02/2015 - 06:11

షార్జా, డిసెంబర్ 1: పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌ను ఇంగ్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో ఇంతకుముందు వరుసగా రెండు మ్యాచ్‌లలో పాకిస్తాన్‌ను మట్టికరిపించిన ఇంగ్లాండ్ జట్టు సోమవారం షార్జాలో ఉత్కంఠ భరితంగా సాగిన చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు సూపర్ ఓవర్ ద్వారా అద్భుత విజయాన్ని అందుకుని పాక్‌కు ‘వైట్‌వాష్’ వేసింది.

12/02/2015 - 06:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: టీమిండియాతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో చేజార్చుకున్న దక్షిణాఫ్రికా జట్టుకు ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ చివరి మ్యాచ్‌లోనూ దూరం కానున్నాడా? ఈ మ్యాచ్‌కి సంబంధించి సఫారీలు మంగళవారం నెట్ ప్రాక్టీస్ చేసినప్పుడు కనిపించిన దృశ్యాలు ఈ ప్రశ్నకు ‘అవును’ అనే సమాధానమిస్తున్నాయి.

12/02/2015 - 06:09

దుబాయ్, డిసెంబర్ 1: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మూడో టెస్టుకు వేదిక అయిన నాగపూర్ పిచ్‌ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నాసిరకమైనదిగా పేర్కొనడం బిసిసిఐకి ఇబ్బందికరంగా మారనుంది. దీంతో ఈ పిచ్ ఎలా ఉందనే దానిపై ఐసిసి పిచ్ మానిటరింగ్ కమిటీ సమీక్ష జరపనుంది.

12/01/2015 - 06:23

మాట మార్చిన టీమిండియా డైరెక్టర్ రవి శాస్ర్తి

12/01/2015 - 06:21

నాగపూర్, నవంబర్ 30: మైదానంలో నువ్వా నేనా అన్న చందంగా పోటీపడే భారత్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు సోమవారం సరదాగా కాసేపు వన్య ప్రాణులను చూస్తూ గడిపారు. ఐదు రోజుల మూడో టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో ఇరు జట్ల క్రికెటర్లకు ఆటవిడుపు లభించింది. దీనితో చాలా మంది క్రికెటర్లు తడోబా అంధేరీ టైగర్ రిజర్వ్ (టిఎటిఆర్), ఉమ్రెద్ కర్హండ్ల వైల్డ్‌లైఫ్ సాంక్చురీ (యుకెడబ్ల్యుఎస్)ను సందర్శించి, ఆనందించారు.

12/01/2015 - 06:21

రాయ్‌పూర, నవంబర్ 30: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) ఫైనల్స్ లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పరాజయా న్ని ఎదుర్కొంది. పూల్ ‘బి’లో జరిగిన ఈ పోరులో నెదర్లాండ్స్ 3-1 తే డాతో గెలిచింది. 36వ నిమిషంలో మిక్ వాన్ డెర్ వీర్డెన్, 43వ నిమిషంలో మిర్కో ప్రజ్‌సెర్ గోల్స్ చేయగా, 47వ నిమిషంలో చింగ్లెన్ సనా సింగ్ గోల్ చేసి నెదర్లాండ్స్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు.

12/01/2015 - 06:20

లండన్, నవంబర్ 30: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిర్న్స్‌కు ఊరట లభించింది. లండన్‌లోని సౌత్‌వార్త్ క్రౌన్ కోర్టు అతనిని నిర్దోషిగా ప్రకటించింది. పది గంటల, 17 నిమిషాలు జరిగిన వాదోపవాదాలను విన్న తర్వాత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది.

12/01/2015 - 06:20

ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్

12/01/2015 - 06:20

79 ఏళ్ల తర్వాత బ్రిటన్‌కు డేవిస్ కప్

Pages