S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/23/2018 - 03:51

న్యూఢిల్లీ/ విజయవాడ, మే 22: కొంతకాలంగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అగ్రిగోల్డ్ కేసులో కీలక నిందితుడు అవ్వా సీతారామారావును సీఐడీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున గుర్గావ్‌లో అరెస్ట్ చేశారు. సీతారామారావు గతంలో అగ్రిగోల్డ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించారు. కంపెనీ లావాదేవీలను తెరవెనుక నుంచి నడిపించేవారు. అగ్రిగోల్డ్‌పై కేసు తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

05/23/2018 - 04:02

*స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసేయాలంటూ ఆందోళన.. విధ్వంసం
*న్యాయమడిగితే చంపేస్తారా?: ఏఐసీసీ చీఫ్ రాహుల్ ఆగ్రహం

05/23/2018 - 02:03

హైదరాబాద్, మే 22: పెట్రోలు, డీజిలు ధరల పెరుగుదలను నిరసిస్తూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలను తోపుడు బండ్లపై పెట్టి నిరసనకు దిగారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు మంగళవారం గాంధీభవన్ నుంచి నాంపల్లి వైపు తోపుడు బండ్లపై ద్విచక్ర వాహనాలతో ఊరేగింపుగా బయలు దేరారు.

05/23/2018 - 01:56

*స్ట్రాంగ్ బీరుపై రూ. 20 పెరుగుదల *ఖజానాకు రూ. 300 కోట్ల ఆదాయం

05/23/2018 - 05:07

హైదరాబాద్, మే 22: కొత్త రిజిస్ట్రేషన్ విధానం జూన్ 2 నుంచి అమలులోకి రానుండటంతో ఆలోగా రైతులు అందరికీ ఎట్టిపరిస్థితుల్లో పట్టాదారు పాసు పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ పూర్తి కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెవిన్యూ, వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఒక్క రైతు కూడా మిగిలిపోకుండా ప్రతీ ఒక్కరికీ కొత్త పాసు పుస్తకం, రైతుబంధు చెక్కులు అందాలన్నారు.

05/23/2018 - 04:00

విశాఖపట్నం, మే 22: వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి విభజన హామీలను నెరవేర్చుతానని చెప్పిన ప్రధాని మోదీ మాట తప్పారని ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. సీమాంధ్ర ప్రజలు ఆమోదించకపోయినా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా చేసినట్టుగానే ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ, ఆ పార్టీకి అండగా ఉన్న పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.

05/23/2018 - 00:45

ఏలూరు, మే 22 : కాకినాడ నుంచి విజయవాడ రాకపోకలు సాగిస్తున్న ఫాస్ట్‌పాసింజర్ సర్వీసును ఈ నెల 25వ తేదీ నుంచి సమయాలు మార్చినట్లు స్థానిక స్టేషన్ మాస్టర్ సత్యనారాయణరావు తెలిపారు. ఈమేరకు ప్రతీ రోజూ కాకినాడ నుంచి విజయవాడ వెళ్లే పాసింజర్ కాకినాడలో 4.15 గంటలకు బయలుదేరి ఏలూరు 7.30 గంటలకు వస్తుందని, విజయవాడకు 9.30 గంటలకు చేరుతుందని తెలిపారు.

05/22/2018 - 22:40

హైదరాబాద్, మే 22: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ప్రజలను వంచిన్నారంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఎన్డీయే పాలనపై 3రణ శంఖారావం2 చేశారు.మోసకారి మోదీ నాలుగేళ్ళ పాలనపై ఈ నెల 26న ఆంధ్ర ప్రదేశ్‌లో వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

05/22/2018 - 04:12

విజయవాడ, మే 21: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి అంశాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూస్తూ తనను ఏ కులం వారు విమర్శిస్తే ఆ కులం వారితోనే తిట్టిస్తూ కాలం వెళ్లదీస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఆలయాల్లో జరిగే అన్యాయాలపై నోరు మాట్లాడే హక్కు అర్చకులకు ఉందన్నారు.

05/22/2018 - 03:15

కాకినాడ, మే 21 చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి రాష్ట్రేతర ప్రాంతాలకు తరలిస్తున్న బీహార్ గ్యాంగ్ మకాంవేసినట్టు జరుగుతున్న ప్రచారంపై తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేగుతోంది. కిడ్నాపర్లు పెద్ద ఎత్తున రాష్టంలోకి దిగారని, తూర్పు గోదావరి జిల్లాలో అధికంగా సంచరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై పోలీసులూ అప్రమత్తమయ్యారు.

Pages