S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/12/2019 - 01:41

కాచిగూడ (హైదరాబాద్), నవంబర్ 11: ఆగివున్న రైలును మరో రైలు ఢీకొట్టిన సంఘటన సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ రెండవ ప్లాట్‌ఫామ్‌పై జరిగింది. ఈ సంఘటన వివరాలను రైల్వే పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడ స్టేషన్‌లో ఆగివున్న కర్నూలు నుంచి వచ్చిన హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

11/11/2019 - 05:53

*చిత్రం...హైదరాబాద్‌లో ఆదివారం విశాఖ శారతా పీఠాధిపతి స్వరూనందేంద్రస్వామికి వినతిపత్రం సమర్పిస్తున్న ఏపీ అర్చక సమాఖ్య ప్రతినిధులు

11/11/2019 - 05:51

రాజమహేంద్రవరం, నవంబర్ 10: వంద గంటల పాటు నిర్విరామంగా శాస్ర్తియ నృత్య ప్రదర్శనకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికైంది. గత నాలుగు రోజులుగా రాజమహేంద్రవరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో అనేక ప్రాచీన నృత్య రీతులతో ‘్భరతీయ సనాతన శాస్ర్తియ నృత్యోత్సవం’ పేరిట దేశ వ్యాప్తంగా వచ్చిన శాస్ర్తియ నృత్య కళాకారులు తమ ప్రదర్శనలతో మంత్రముగ్దులను చేశారు.

11/11/2019 - 05:49

విశాఖపట్నం, నవంబర్ 10: తెలుగు జ్ఞాన్‌పీఠ్ అవార్డుగా భావించే లోక్‌నాయక్ ఫౌండేషన్ ప్రతియేటా ఇచ్చే సాహితీ పురస్కారం ఈసారి వ్యక్తులకు కాకుండా, సాహితీ సేవలు అందిస్తున్న సంస్థకు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఫౌండేషన్ అధ్యక్షుడు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు.

11/11/2019 - 05:46

విశాఖపట్నం, నవంబర్ 10: ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలన్నది తన ఉద్దేశ్యమని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు.

11/11/2019 - 05:43

హైదరాబాద్, నవంబర్ 10: చక్రవర్తి రాఘవాచారి జీవితం నేటి జర్నలిస్టులకు స్ఫూర్తినిస్తుందని, ఆదర్శంగా ఉంటుందని పలువురు సీనియర్ జర్నలిస్టులు పేర్కొన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియూడబ్ల్యుజే) కార్యాలయంలో ఆదివారం రాఘవాచారి సంస్మరణ సభ జరిగింది. టియూడబ్ల్యుజే ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐజేయూ అధ్యక్షుడు కె.

11/11/2019 - 06:09

హైదరాబాద్: నెలల తరబడి వేతన సవరణ సంఘం నివేదిక కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వచ్చే పది నుంచి పనె్నండు రోజుల్లోగా పీఆర్‌సీ కమిషన్ నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పీఆర్‌సీ అంటే వేతన సవరణ సంఘం. ఈ సంఘాన్ని 2018 మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2018 జూలై 1వ తేదీ నుంచి కొత్త వేతనాలు అమలులోకి రావాల్సి ఉంది.

11/11/2019 - 00:56

హైదరాబాద్, నవంబర్ 10: జీవశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి నిలయంగా మారిన జీనోమ్ వ్యాలీకి మహర్దశ పట్టింది. జీనోమ్ వ్యాలీ 2.0కు మాస్టర్ ప్లాన్‌ను రాష్ట్రప్రభుత్వం రూపొందించింది. ఈ వ్యాలీ విస్తరణకు అదనంగా 350 ఎకరాలను సేకరించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల జీవశాస్త్ర రంగంలో పరిశోధనలు ఊపందుకుంటాయి.

11/11/2019 - 00:50

హైదరాబాద్, నవంబర్ 10: గత 37 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించే అవకాశం ఉంది. హైకోర్టు ఏమి చెబుతుందో వేచిచూశాకే తదుపరి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 7వ తేదీన ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో జరిగిన విచారణను 11కు వాయిదా వేస్తూ ఆలోగా మరోసారి కార్మికులతో చర్చలు జరపాల్సిందిగా ఆదేశించింది.

11/10/2019 - 06:15

తిరుపతి: శ్రీవారి ఆలయంలో శనివారం సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం ఘనంగా జరిగింది. ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఉభయనాంచారులతో కలిసి తిరుమాడ వీధుల్లో తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు.

Pages