S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/23/2017 - 02:16

హైదరాబాద్, డిసెంబర్ 22: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల రాష్టస్థ్రాయి క్విజ్ పోటీల్లో ఖమ్మం విద్యార్థులు సత్తా చాటా రు. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి విద్యార్థినీ, విద్యార్థులు హాజరైన ఈ పోటీల్లో ఖమ్మం జిల్లాకు చెందిన సి.హెచ్.గోపీ, పి.స్వాతిలకు ప్రథమ స్థానం దక్కినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

12/23/2017 - 02:01

నల్లగొండ/ రాజాపేట, డిసెంబర్ 22: బతుకుదెరువుకు కోసం వచ్చి అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం చెందిన విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

12/23/2017 - 01:56

హైదరాబాద్, డిసెంబర్ 22: కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం అందిందని సీఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణలో 70 శాతానికి నీళ్లు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు లభించడంతో త్వరలోనే హరిత తెలంగాణను చూడబోతున్నామని సీఎం అన్నారు. బంగారు తెలంగాణ కల సాకారం కాబోతుందన్న ఆనందం వ్యక్తం చేశారు.

12/23/2017 - 01:45

విజయవాడ, డిసెంబర్ 22: హిందూ ధర్మ ప్రచార వ్యాప్తికోసం రాష్ట్రంలోని హిందూ దేవాలయాలన్నింటా ధర్మ ప్రచార పరిషత్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నామని రాష్ట్ర దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. రాష్ట్రంలో టీటీడీ తర్వాత రెండో ప్రధాన దేవస్థానంగా దినదినాభివృద్ధి చెందుతున్న విజయవాడ శ్రీకనకదుర్గా మల్లేశ్వరస్వామివార్ల ఆలయ ప్రాంగణంలో ఎంతో విశాలమైన కళావేదిక నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.

12/23/2017 - 01:43

అమరావతి, డిసెంబర్ 22: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం నియామకం అటకెక్కినట్లేనా? గత ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న టీటీడీ బోర్డు నియామక వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఎందుకు ఆసక్తిచూపించడం లేదు? గత కొద్దిరోజుల నుంచి టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. టీటీడీ బోర్డు పాలకమండలిలో స్థానం కోసం ప్రయత్నిస్తోన్న టీడీపీ సీనియర్లకు నిరాశ ఎదురవుతోంది.

12/23/2017 - 01:40

కాచిగూడ, డిసెంబర్ 22: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు తిప్పేందుకు ఏర్పాట్లు చేశామని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. సంక్రాంతి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలకు 4800 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

12/22/2017 - 03:44

హైదరాబాద్, డిసెంబర్ 21: అసైన్డ్ భూములను ఇతరుల నుంచి కొనుగోలు చేసిన పేదరైతులను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూములను నిరుపేద రైతుల పేరిట క్రమబద్ధీకరణ చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఇందుకు సంబంధించి ఆదేశాలను జారీ చేస్తారు. అసైన్డ్ భూములపై గతంలోనే అసెంబ్లీ సాక్షిగా సీఎం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

12/22/2017 - 04:27

నూజివీడు, డిసెంబర్ 21: కృష్ణాజిల్లా నూజివీడులోని రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న మెఘావత్ గోపీచంద్‌నాయక్ (20) గురువారం మధ్యాహ్నం భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గోపీచంద్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్నాడు.

12/22/2017 - 03:34

విజయవాడ, డిసెంబర్ 21: వచ్చే ఏడాది జనవరి 1 నుండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విజయవాడ కేంద్రంగా పూర్తిస్థాయిలో పనిచేస్తుందని కమిషన్ చైర్మన్ పిన్నమనేని ఉదయ్‌భాస్కర్ వెల్లడించారు.

12/22/2017 - 04:34

కాకినాడ, డిసెంబర్ 21: సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ షో సంగీతాభిమానులను ఉర్రూతలూగించింది. కాకినాడ బీచ్ ఫెస్టివల్‌లో గురువారం రాత్రి రెహమాన్ బృందం ఆలపించిన సినీ గీతాలతో సాగర తీరం పులకించింది. అశేష జన వాహినితో బీచ్ జన సంద్రాన్ని తలపించింది.

Pages