S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/20/2017 - 03:38

ఆదిలాబాద్, డిసెంబర్ 19: ఉత్తరాది నుండి వీస్తున్న చలి గాలులతో ఆదిలాబాద్ జిల్లా గజ గజ వణికిపోతోంది. గత నాలుగేళ్ళ రికార్డును బద్దలుకొడుతూ మంగళవారం అత్యల్పంగా 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

12/20/2017 - 01:39

జాతిపిత మహాత్మాగాంధీ ఆశలు, ఆకాంక్షలకు అద్దంపడుతూ ఆయన ఆలోచనలను మరింత వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో ఏకంగా ఓ డిజిటల్ మ్యూజియం ప్రారంభమైంది.
హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లోగల బాపూ ఘాట్ వద్ద దేశంలోనే మొట్టమొదటిసారిగా మంగళవారం

12/20/2017 - 01:37

కర్నూలు, డిసెంబర్ 19: కర్నూలు స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థి ఎన్నికకు నిర్వహిస్తున్న ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మంగళవారం విడుదల చేశారు. దాంతో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది.

12/20/2017 - 01:37

హైదరాబాద్, డిసెంబర్ 19: ఆహారంలో కల్తీని అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి వచ్చే నెల జనవరి 23వ తేదీలోగా తమకు సమర్పించాలని హైకోర్టు మంగళవారం ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల ప్రభుత్వ కార్యదర్శులను ఆదేశించింది.

12/20/2017 - 01:34

హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ముగింపులో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తెలుగులో మాట్లాడి భాషాభిమానుల హృదయాలను దోచుకున్నారు. ప్రసంగాన్ని ‘సోదర సోదరీమణులారా! నమస్కారం’ అంటూ ప్రారంభించి సభికుల కరతాళధ్వనులు అందుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదను గుర్తు చేస్తూ ‘దేశభాషలందు తెలుగులెస్స’ అనడంతో సభ చప్పట్లతో మార్మోగింది.

12/20/2017 - 01:42

పట్టు పంచె కట్టిన అచ్చ తెనుగు.. ఐదు రోజులపాటు పండుగ చేసుకుంది. అ ఆలను విస్మరించవద్దంటూ ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడి హితోక్తితో మొదలైన భాషా పండుగ.. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తెలుగు నుడికారంతో నిండుతనం సంతరించుకుంది. ఏ గడ్డపై అడుగుపెట్టినా తెలుగు మాట్లాడటం కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లంతా తెలుగు గడ్డపై తల్లి భాషను కీర్తిస్తూ ముచ్చటించుకోవడం అద్భుతం అనిపించింది.

12/20/2017 - 01:09

హైదరాబాద్, డిసెంబర్ 19: అంతర్జాతీయ భాషగా తెలుగుకు గుర్తింపు లభించిందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో మంగళవారం రాత్రి ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో రెండో స్థానంలో నిలిచిన తెలుగు ఖండాంతర ఖ్యాతి పొందిందన్నారు.

12/20/2017 - 01:06

హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ గడ్డమీద చదువుకోవాలంటే తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందులో భాగంగానే ఒకటి నుంచి ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా అమలు చేయబోతున్నమన్నారు. తెలుగు భాషాభివృద్ధికి సభలు, సంబరాలు నిర్వహించి వదిలేయబోమని నిబద్ధతను చాటుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

12/20/2017 - 01:03

హైదరాబాద్, డిసెంబర్ 19: మాతృ భాషా పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు సభలో గవర్నర్ ప్రసంగిస్తూ తెలుగు భాష గొప్ప సంపదన్నారు. తెలుగు భాషాభిమానులతో బమ్మెర పోతన ప్రాంగణం పులకించిందన్నారు. ఈ ఐదు రోజుల పాటు తెలుగు మహాసభలు అత్యంత వైభవోపేతంగా జరిగాయని గవర్నర్ ప్రశంసించారు.

12/20/2017 - 01:02

హైదరాబాద్, డిసెంబర్ 19: భాషను సుసంపన్నం చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జి జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం నాడు తెలుగు యూనివర్శిటీ బిరుదురాజు రామరాజు ప్రాంగణం సామల సదాశివ వేదికపై జరిగిన తెలంగాణలో తెలుగు - భాషా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు ఆచార్య ఎస్ లక్ష్మణ మూర్తి అధ్యక్షత వహించారు.

Pages