S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/18/2017 - 02:57

హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రపంచ అంతర్జాల సదస్సును రెండేళ్లకోసారి నిర్వహించేందుకు ఐటీ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. డిజిటల్ మాధ్యమాలలో తెలుగు వినియోగాన్ని పెంపొందించేందుకు వ్యక్తిగతంగా, సంస్థాగతంగా జరుగుతున్న ప్రయత్నాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా కృషి జరగాలని, అందుకు తమ సహకారం ఉంటుందని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.

12/18/2017 - 02:55

హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా కొనసాగుతుండటంతో దేశం యావత్తూ తెలంగాణవైపే చూస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఎల్‌బి స్టేడియంలో పాల్కురికి సోమనాథ ప్రాంగణంలో ‘వౌఖిక వాజ్ఞయం భాష’ అంశంపై జరిగిన సాహిత్య సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

12/18/2017 - 02:54

హైదరాబాద్, డిసెంబర్ 17: తెలుగు సాహిత్యం ఎంతో గొప్పదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల మూడవ రోజు ఆదివారం ఉదయం ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలోని శ్రీవానమామలై వేదికపై నిర్వహించిన బృహత్ కవి సమ్మేళనం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎంతోమంది గొప్ప కవులున్నారని అన్నారు.

12/18/2017 - 02:52

హైదరాబాద్, డిసెంబర్ 17: అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ప్రపంచానికి తెలియజేసేందుకు తెలంగాణ ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) అభివృద్ధి రాయబారులుగా మారాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు 42 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు సీఎం ప్రగతి భవన్‌లో ఆదివారం రాత్రి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

12/18/2017 - 02:30

హైదరాబాద్, డిసెంబర్ 17: యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల తరహాలో గ్రూప్-1, గ్రూప్-2కు ఒకే పరీక్ష నిర్వహించే విషయమై తెలంగాణ యోచిస్తోంది. దీనికి సంబంధించి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని టిఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

12/18/2017 - 02:28

హైదరాబాద్, డిసెంబర్ 17: పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుకు మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఇప్పటికే పలు జాతీయ అవార్డులు దక్కించుకున్న మంత్రికి ఈసారి లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ మంత్రి కేటీఆర్‌కు ఈ అవార్డు ప్రదానం చేయనుంది. మంత్రిగా నూతన తెలంగాణను దేశ యవనికపై తనదైన శైలిలో నిలిపిన తీరుని సంస్థ ఈ సందర్భంగా అభినందించింది.

12/18/2017 - 04:36

సిద్దిపేట/చేర్యాల, డిసెంబర్ 17: రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రం.. భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతున్న సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కొమురవెళ్లి మల్లన్న క్షేత్రం ఆదివారం జనసంద్రంగా మారింది. మల్లికార్జున స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొమరవెళ్లి మల్లికార్జున స్వామి, గొల్ల కేతకి, బలిజ మేడాలమ్మల కల్యాణం ముక్కోటి దేవతలు, పంచభూతాల సాక్షిగా కన్నుల పండువగా నిర్వహించారు.

12/18/2017 - 02:21

హైదరాబాద్, డిసెంబర్ 17: సంక్రాంతి సంబరాల కోసం ఆంధ్రకు వెళ్లే ప్రయాణికులకు పెద్ద చిక్కొచ్చిపడింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, తెనాలి, నెల్లూరు, తిరుపతి ఎక్కడికివెళ్లాన్నా రైళ్లల్లో బెర్త్‌లు ఖాళీ లేవు. ఆంధ్ర ప్రజలు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లడం పరిపాటి. అందుకు రైళ్లొక్కటే సరైన సౌకర్యం. రైళ్లలో 120 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉంది.

12/18/2017 - 02:20

అనంతపురం, డిసెంబర్ 17: మద్యానికి బానిసైనవారి కోసం ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ఆసుపత్రి పెట్టి డీ అడిక్షన్ ట్రీట్‌మెంట్ ఇస్తామని రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

12/18/2017 - 02:18

హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రపంచ తెలుగు మహాసభలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్‌లో ఆదివారం అవధాని జిఎం రామశర్మ చేసిన శతావధానం సందర్భంగా సిఎం మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు హర్షించేలా సభల చివరిరోజు తీర్మానాలు చేస్తామన్నారు.

Pages