S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/16/2017 - 21:11

విజయవాడ, నవంబర్ 15: పవిత్ర సంగమం వద్ద పడవ ప్రమాద ఘటనకు బాధ్యులైన ఏడుగురిని విధులనుంచి తక్షణం తొలగిస్తున్నట్లు రాష్ట్ర టూరిజం మంత్రి భూమా అఖిల ప్రియ వెల్లడించారు. అనుమతి లేకుండా బోటును నడిపినందుకు, ప్రయాణికుల మృతికి కారణమైనందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

11/16/2017 - 00:46

హైదరాబాద్/ అనంతపురం, నవంబర్ 15: నకిలీ డీడీల కేసులో అనంతపురం జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్‌కు ఐదేళ్ల జైలుశిక్ష పడిం ది. పదేళ్లపాటు విచారణ అనంతరం బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి సిబిఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. 2003లో ఎస్‌బీఐ నకిలీ డీడీల కుంభకోణం వెలుగు చూసింది.

11/16/2017 - 00:44

న్యూఢిల్లీ, నవంబర్ 15: పోలవరం ప్రాజెక్టు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కారాన్ని కనుగొనేందుకు వారంలో కేంద్ర, రాష్ట్ర సీనియర్ అధికారులతో కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుగుదేశం సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. బుధవారం నితిన్ గడ్కరీతో చర్చలు జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

11/16/2017 - 00:42

హైదరాబాద్, నవంబర్ 15: ‘ఎందుకు?’ అని ప్రశ్నించినందుకే ‘రుద్రమదేవి’ చిత్రం నంది అవార్డు అర్హతను కోల్పోయిందా? అంటూ దర్శకుడు గుణశేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి రాయితీ ప్రకటించిన ఏపీ సర్కారు, ‘రుద్రమదేవి’కి ఎందుకు ప్రకటించలేకపోయిందని ప్రశ్నించినందుకే అవార్డుల విషయంలో బ్లాక్ లిస్టులో పెట్టినట్టున్నారంటూ విమర్శలు సంధించారు.

11/16/2017 - 00:41

ఖైరతాబాద్, నవంబర్ 15: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బుధవారం భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 8 గంటల సమయంలో జూబ్లీహిల్స్ పరిసరాల్లో చిన్నపాటి ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు స్థానికులు గుర్తించారు. నెల రోజులుగా రహమత్‌నగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూమి కంపిస్తుందని స్థానికులు చెబుతుండటం తెలిసిందే. అదే తరహాలో భూమి చిన్నగా కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు భయంతో పరుగులు తీశారు.

11/15/2017 - 23:54

ఆళ్లగడ్డ, నవంబర్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాఫియాలకు అడ్డాగా మారిందని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోందన్నారు. ఏక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఇసుక మాఫియా గురించే చర్చ జరుగుతోందన్నారు.

11/15/2017 - 23:51

తిరుపతి, నవంబర్ 15: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన బుధవారం రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య శ్రీనివాసుని హృదయేశ్వరి, సిరుల తల్లి అయిన శ్రీ పద్మావతీదేవి చిన్న శేష వాహనంపై కొలువుదీరి చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 3 నుంచి 3.30 గంటల మధ్య అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపిన అనంతరం సహస్ర నామార్చన, నిత్యార్చన శుద్ధి నిర్వహించారు.

11/15/2017 - 23:49

అరకులోయ, నవంబర్ 15: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌కు వర్షం అడ్డంకిగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న బెలూన్ ఫెస్టివల్ మంగళవారం ప్రారంభం కాగా రెండో రోజు బుధవారం వర్షం కారణంగా నిలిచిపోవలసి వచ్చింది. ప్రపంచంలోని 16 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ ఫెస్టివల్‌లో పాల్గొని తమ తమ దేశాలకు చెందిన

11/15/2017 - 23:25

న్యూఢిల్లీ, నవంబర్ 15: కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలకోసం పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా గోదావరి నీటిని మళ్లించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ రాష్ట్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి న్యాయమూర్తి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు బుధవారం తిరిగి విచారణ ప్రారంభమైంది.

11/15/2017 - 23:23

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తాన్ని ప్రపంచానికి చాటేలా తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సూచించారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి సమీక్షించారు. మహాసభల్లో తెలుగు భాషా ప్రక్రియలన్నింటికి సంబంధించిన ప్రదర్శనలు జరగాలన్నారు.

Pages