S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/15/2017 - 02:56

విజయవాడ, నవంబర్ 14: మూడేళ్లుగా పెండింగ్‌లోవున్న నంది, జాతీయ స్మారక అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2014, 2015 చలనచిత్ర నంది అవార్డులు, ఎన్టీఆర్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి -చక్రపాణి జాతీయ అవార్డులనూ ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో సిఎం చంద్రబాబుకు జ్యూరీ సభ్యులు అవార్డు విజేతల వివరాలు అందించారు.

11/15/2017 - 02:55

విజయవాడ, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా పురస్కారాల నంది అవార్డులను మంగళవారం ప్రకటించింది. 2016వ సంవత్సరానికిగాను చలన చిత్ర ఉత్తమ విమర్శకుడి విభాగంలో ఆంధ్రభూమి చీఫ్ సబ్ ఎడిటర్ వి. విజయ్ ప్రసాద్‌కు ఈ అవార్డును ప్రకటించింది. ఈ పురస్కారం కింద తామ్ర నందితోపాటు 25వేల నగదు, ప్రశంసాపత్రాన్ని ప్రత్యేక కార్యక్రమంలో అందచేస్తారు.

11/13/2017 - 05:14

హైదరాబాద్, నవంబర్ 12: హైదరాబాద్‌కే పరిమితమైన ఐటి రంగం తెలంగాణ జిల్లా కేంద్రాలకూ విస్తరిస్తోంది. ప్రస్తుతం సైబరాబాద్ హైటెక్ సిటీలో కేంద్రీకృతమైవున్న ఐటీ కంపెనీలు, ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లా కేంద్రాల్లోకూ విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఐటీ అంటే మాదాపూర్, మణికొండ, గచ్ఛిబౌలి కలయికతోవున్న సైబరాబాద్ గుర్తుకొస్తుంది.

11/13/2017 - 05:10

హైదరాబాద్, నవంబర్ 12: కేశవ మెమోరియల్ పాఠశాల ప్రిన్సిపాల్, ఉమ్మడి ఎపి విశ్వ హిందూ పరిషత్ కోశాధికారి తాడికొండ లింగమూర్తి (90) శనివారం కన్నుమూశారు. ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. లింగమూర్తి గుంటూరు జిల్లా, ఈమనిలో 1927లో జన్మించారు. 1944 సంవత్సరం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో చురుగ్గా పాల్గొన్నారు.

11/13/2017 - 02:13

హైదరాబాద్, నవంబర్ 12: గుజరాత్ ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణపై దృష్టి సారించనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. అయితే గుజరాత్ ఎన్నికల కారణంగా కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిసింది. కాగా అప్పటి వరకు తెలంగాణలో పార్టీ పరిస్థితి? నేతల పనితీరు? పార్టీ కార్యక్రమాలు? ప్రజలతో మమేకమయ్యే విధానం?

11/13/2017 - 02:12

హైదరాబాద్, నవంబర్ 12: హైదరాబాద్‌కే పరిమితమైన ఐటి రంగం తెలంగాణ జిల్లా కేంద్రాలకూ విస్తరిస్తోంది. ప్రస్తుతం సైబరాబాద్ హైటెక్ సిటీలో కేంద్రీకృతమైవున్న ఐటీ కంపెనీలు, ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లా కేంద్రాల్లోకూ విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఐటీ అంటే మాదాపూర్, మణికొండ, గచ్ఛిబౌలి కలయికతోవున్న సైబరాబాద్ గుర్తుకొస్తుంది.

11/13/2017 - 05:37

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ కొత్త డీజీపీగా మహేందర్‌రెడ్డి ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో అనురాగ్ శర్మ నుంచి చార్జి తీసుకున్న అనంతరం ఆయన విలేఖకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర పోలీస్ శాఖ తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. శాంతి భద్రతలు, నేర నివారణ, మహిళల భద్రత విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

11/13/2017 - 01:21

అమరావతి, నవంబర్ 12: పదవుల పందేరంలో రాయలసీమకు పెద్దపీట వేస్తుండటంతో కోస్తా టీడీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రగులుతోంది. శాసనసభ చీఫ్ విప్‌గా అనంత జిల్లా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, శాసనమండలి చీఫ్ విప్‌గా అదే జిల్లా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు ఇవ్వాలని సిఎం చంద్రబాబు నిర్ణయించారంటూ వస్తున్న వార్తలు కోస్తా ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతున్నాయి.

11/13/2017 - 01:19

దువ్వూరు, నవంబర్ 12: రాష్ట్రంలోని పేదల భూములు లాక్కునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తుంటారని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ పేదల భూములు ఉన్నాయి, వాటిని ఎలా లాక్కోవాలి, బడాబాబులకు ఎలా పంచిపెట్టాలలన్న విషయాలనే మంత్రివర్గ సమావేశాల్లో ఎక్కువగా చర్చిస్తుంటారన్నారు.

11/13/2017 - 05:49

విజయవాడ, నవంబర్ 12: కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో విజయవాడ నగరానికి సమీపంలోని పవిత్ర సంగమం వద్ద నదీహారతి చూడాలని వచ్చిన పర్యాటకులను బోటు రూపంలో మృత్యువు కబళించింది. మరికొద్ది సేపటిలో తీరానికి చేరుతున్నామన్న సమయంలో జరిగిన దుర్ఘటన విహార యాత్రలో తీరని విషాదం మిగిల్చింది. అధికారుల పర్యవేక్షణ లోపం, బోటు నిర్వాహకుని నిర్లక్ష్యం కలిసి 16మంది ఉసురు తీసింది.

Pages