S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/10/2017 - 02:15

హైదరాబాద్, నవంబర్ 9: రాష్ట్రంలోని ముస్లింలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కెసిఆర్) వరాల జల్లు కురిపించారు. మైనారిటీ సంక్షేమంపై శాసనసభలో గురువారం జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ, ఉర్ద్భూషను రెండో అధికార భాషగా మారుస్తామన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, శాసనమండలి, శాసనసభ, సచివాలయం, మంత్రులు, జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో 66 మంది ఉర్దూ ఆఫీసర్లను నియమిస్తామన్నారు.

11/10/2017 - 02:05

వరంగల్, నవంబర్ 9: ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు చుక్క సత్తయ్య అనారోగ్యంతో జనగామ జిల్లా మాణిక్యాపురంలో గురువారం కన్నుమూశారు. 1935 మార్చి 29న జన్మించిన ఆయన తన 14వ ఏటనే ఒగ్గుకథ చెప్పడం ప్రారంభించి సుమారు 4,500 ప్రదర్శనలిచ్చి ఆ కళకు ఖండాంతర ఖ్యాతిని తెచ్చారు. 1977 మలేషియా ఉత్సవ్‌లో, 1987మనీస్‌లాండ్ ఉత్సవాలలో పాల్గొని ఒగ్గుకథకు ప్రాచుర్యం తెచ్చారు.

11/10/2017 - 01:09

నిజామాబాద్, నవంబర్ 9: ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని వంచనకు పాల్పడుతున్న బాలాజీనాయుడు అనే ఘరానా మోసగాడు పన్నిన ఉచ్చులో నిజామాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ ఆకుల లలిత కకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు నమ్మించి, ఆమె నుంచి సదరు మోసగాడు 10 లక్షల రూపాయలను దండుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

11/10/2017 - 01:08

ఎర్రగుంట్ల, నవంబర్ 9: పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సంకల్పయాత్ర నాలుగవరోజు గురువారం కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో జరిగింది.

11/10/2017 - 01:04

న్యూఢిల్లీ, నవంబర్ 9: కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో మరో పీజీ నీట్ పరీక్షా కేంద్రాన్ని కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఐదు పీజీ నీట్ పరీక్షా కేంద్రాలున్నాయి. ఇప్పుడు తిరుపతిలో పిజి నీట్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించటంతో ఆ కేంద్రాల సంఖ్య ఆరుకు చేరుకుంది. తిరుపతి పిజి నీట్ పరీక్షా కేంద్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి పరీక్షలు నిర్వహిస్తారు.

11/10/2017 - 01:04

అమరావతి, నవంబర్ 9: దక్షిణ కొరియాలోని బూసన్ నగరం తరహాలో ఏపీలో కొరియన్ సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఏపీని రెండో రాజధానిగా మార్చుకుని ఇక్కడ పెద్ద సంఖ్యలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే ప్రభుత్వపరంగా అన్ని విధాలా ప్రోత్సాహం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

11/10/2017 - 01:02

విజయవాడ, నవంబర్ 9: రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వెలగపూడి సచివాలయ ఆవరణలోని అసెంబ్లీ భవనంలో శాసన సభ, శాసన మండలి సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ సమావేశాలు, ఉదయం 10.30 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

11/09/2017 - 01:36

హైదరాబాద్, నవంబర్ 8: పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనం కోల్పోయిన వారే ఎక్కువ బాధ పడుతున్నారని, మిగిలిన వారంతా హాపీగా ఉన్నారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎ అనంతకుమార్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు, అంతా పెద్ద నోట్ల రద్దు అంటున్నారని అది నోట్ల రద్దు కాదని, నోట్ల బదిలీ (రీమానిటైజేషన్ ) మాత్రమేనని వ్యాఖ్యానించారు.

11/09/2017 - 01:46

హైదరాబాద్, నవంబర్ 8: హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో బుధవారం 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ ప్రారంభోత్సవం అదిరింది. రెండేళ్ల విరామం తర్వాత ‘ది గోల్డన్ ఎలిఫెంట్’ హైదరాబాద్‌కు తరలి వచ్చింది. బాలబాలికలనే కాకుండా పెద్దలను సైతం ‘బంగారు ఏనుగు’ కనువిందు చేసింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న చలన చిత్రోత్సవానికి తెలంగాణ జిల్లాలతోపాటు, దేశంలోని ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి బాలల ప్రతినిధులు హాజరయ్యారు.

11/08/2017 - 23:52

హైదరాబాద్, నవంబర్ 8: ట్రాఫిక్‌తో అష్టకష్టాలు పడే మహానగరవాసులు చిరకాల స్వప్నమైన మెట్రోరైలు ఈ నెల 28వ తేదీన ప్రదాని నరేంద్రమోది చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో బుధవారం తెలుగురాష్ట్రాల గవర్నర్ నరిసింహాన్, రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలు, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు మెట్రోరైలు పనులను పరిశీలించారు.

Pages