S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/08/2017 - 23:49

న్యూఢిల్లీ, నవంబర్ 8: అమీర్‌పేట భూములకు సంబంధించి మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యపై కె.మోహన్ లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. న్యాయమూర్తి రంజన్ గోయల్‌తో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిన అనంతరం కేసును ఆరు నెలలపాటు వాయిదా వేసింది.

11/08/2017 - 23:47

హైదరాబాద్, నవంబర్ 8: భగవాన్ సత్యసాయి ఆధ్యాత్మిక ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లే ప్రయాణీకుల సౌకర్యార్థం పుట్టపర్తికి నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. ఈ నెల 18న కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుండగా, తిరుగు ప్రయాణంలో 19వ తేదీన సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి బయలుదేరుతుందని రైల్వే తెలిపింది.

11/08/2017 - 23:45

రేపల్లె, నవంబర్ 8: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ సింగం బసవపున్నయ్య (98) బుధవారం తెల్లవారుజామున గుంటూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో మృతి చెందారు. సింగం బసవపున్నయ్య స్వగ్రామం గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

11/08/2017 - 03:57

న్యూఢిల్లీ, నవంబర్ 7: ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా ప్రకటించారు. విజయశాంతి మంగళవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

11/08/2017 - 03:36

హైదరాబాద్, నవంబర్ 7: పరీక్షల సీజన్ మొదలైంది. తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూలును రూపొందించి ప్రభు త్వ అనుమతికి పంపింది. ముసాయిదా షెడ్యూలు ప్రకారం మొదటి ఏడాది పరీక్షలు 2018 మార్చి 1 నుంచి మొదలవుతాయి. రెండో ఏడాది పరీక్షలు మార్చి 3 నుంచి జరుగుతాయి. ఫిబ్రవరి 2 నుంచి 22 వరకూ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

11/08/2017 - 03:35

గద్వాల, నవంబర్ 7: వేరుశనగ రైతు కడుపు మండింది. ఆరుగాలం కష్టపడినా పెట్టుబడులు సైతం గిట్టుబాటు కాకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. వేరుశనగకు మద్దతు ధర కల్పించకుండా దళారులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ రైతును దగా చేస్తున్నారంటూ రెచ్చిపోయారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వేరుశనగ రైతులు తిరుగబాటుకు దిగారు. మంగళవారం వ్యవసాయ మార్కెట్ యార్డుకు వేరుశనగను పంటను రైతులు తీసుకొచ్చారు.

11/08/2017 - 03:33

హైదరాబాద్, నవంబర్ 7: రాష్ట్ర రాజధానిలో బుధవారం నుంచి వారంపాటు సినిమా పండుగ జరగబోతోంది. 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని నేటినుంచి 14 వరకు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 13 థియేటర్లతో పాటు రాష్టవ్య్రాప్తంగా ఉన్న మిగతా 29 జిల్లాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో చిత్రాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

11/08/2017 - 03:31

హైదరాబాద్, నవంబర్ 7: మహానుభావుడు నిజాం అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా మరోసారి పొగడ్తలు కురిపించారు. ప్రపంచంలో ఎవరూ చేయని మంచి పనులు చేశారంటూ పొగిడారు. గతంలోనూ కెసిఆర్ నిజాంను పొగడినపుడు బిజెపి నేతలు, పలు సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. భూముల రికార్డుల ప్రక్షాళన అంశంపై సోమ, మంగళవారం అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.

11/08/2017 - 03:31

హైదరాబాద్, నవంబర్ 7: పాస్‌పోర్టు కంటే పగడ్బందీగా రైతులకు పాస్ పుస్తకాలు అందించనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన శుభారంభం చేస్తామన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనపై సోమ, మంగళవారాల్లో జరిగిన సుదీర్ఘ చర్చకు సిఎం కెసిఆర్ సమాధానమిస్తూ పాస్ పుస్తకాల పంపిణీ రోజున ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులకు పాస్ పుస్తకాలు అందిస్తారన్నారు.

11/08/2017 - 03:13

అమరావతి, నవంబర్ 7: వౌలిక సదుపాయాల అభివృద్ధి, సౌర సాంకేతిక పరిజ్ఞానం, విద్య, మానవ వనరుల సామర్థ్యం పెంపు, ఆతిథ్య, పర్యాటక రంగాల్లో ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ సంస్థలు ఆసక్తి చూపాయ.

Pages