S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/03/2017 - 04:01

కంఠేశ్వర్ (నిజామాబాద్), నవంబర్ 2: నిజామాబాద్ నుండి తిరుపతికి కొత్తగా ప్రవేశపెట్టిన రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు గురువారం ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.05 గంటలకు స్టేషన్ మాస్టర్ బబ్లూమీనా జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్ ఉదయం 10 గంటలకు నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే బిజెపి నాయకు లు స్వాగతం పలికారు.

11/03/2017 - 03:23

హైదరాబాద్, నవంబర్ 2: గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మాతృమూర్తి దివంగత విజయలక్ష్మి ‘శుభ స్వీకారం’ గురువారం రాజ్‌భవన్‌లో జరిగింది. గవర్నర్ మాతృమూర్తి విజయలక్ష్మి ఇటీవల పరమపదించిన విషయం తెలిసిందే.

11/03/2017 - 02:52

హైదరాబాద్, నవంబర్ 2: రాష్ట్ర విభజన సందర్భంగా సచివాలయ సహాయ సెక్షన్ అధికారి, సెక్షన్ అధికారి ఉద్యోగుల విభజనలో ఎపి ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరించిందని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆరోపించింది. విభజన మార్గదర్శకాలు రూపొందించే సమయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల సూచనలను పట్టించుకోలేదని యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు గిరి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్.సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

11/03/2017 - 02:50

హైదరాబాద్, నవంబర్ 2: ఈ నెల 6వ తేదీలోపల మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శ్రీ్ధర్‌బాబుపై నమోదు చేసిన కేసు వివరాలు సమర్పించాలని చిక్కడపల్లి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శ్రీ్ధర్‌బాబు పెట్టుకున్న దరఖాస్తును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ విచారించారు.

11/03/2017 - 02:06

భద్రాచలం టౌన్, నవంబర్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని యటపాక మండలంలో గోదావరి నదిలో ముగ్గురు గల్లంతయ్యారు. భద్రాచలం పట్టణానికి చెందిన బుద్దుల అరుణకుమారి(26), ఆమె సోదరుడు రాంప్రసాద్(22), మడకం రాణి(16), మరో ఐదుగురు దుస్తులు ఉతుక్కునేందుకు గోదావరి నదిలోకి వెళ్లారు.

11/03/2017 - 02:03

హైదరాబాద్, నవంబర్ 2: మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెళ్ల నవంబర్ రెండోవారంలో హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల ఆంగ్లంలో విడుదల చేసిన తన సొంత పుస్తకం ‘హిట్ రిఫ్రెష్’ను తెలుగులో కూడా విడుదల చేస్తారు. హిట్ రిఫ్రెష్ పుస్తక ప్రచారంలో భాగంగా ఆయన భారత్‌కు వస్తున్నారు.

11/03/2017 - 02:02

హైదరాబాద్, నవంబర్ 2: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మచిలీపట్నం-సికిందరాబాద్-మచిలీపట్నం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును బీదర్ వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ఈ రైళ్ల సమయ వేళలు వచ్చే మార్చి 1, 2 తేదీలనుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.

11/03/2017 - 02:01

హైదరాబాద్, నవంబర్ 2: ఈ ఏడాది డిసెంబర్ 14 నుంచి రెండు రోజుల పాటు అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. సైబర్ సొసైటీ ఆఫ్ ఇండియా, సిఐఓ రివ్యూ, బెంగళూరు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇజ్రాయిల్ సహకారంతో ఈ సదస్సును డిసెంబర్ 14న నోవాటెల్ హోటల్‌లో జరుగనుంది.

11/03/2017 - 01:50

హైదరాబాద్, నవంబర్ 2: సంతాన సాఫల్యతా కేంద్రాల్లో ‘అద్దెగర్భం’ అంశంపై సమగ్రమైన చట్టం తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. గురువారం శాసనసభలో జి చిన్నారెడ్డి, నలమడ పద్మావతి రెడ్డి, తాటిపర్తి జీవన్‌రెడ్డి, గీతారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ రాష్ట్రంలో తనిఖీ చేయకుండా పెద్ద సంఖ్యలో సంతాన సాఫల్యతా కేంద్రాలు నిర్వహిస్తున్న మాట నిజం కాదని అన్నారు.

11/03/2017 - 01:49

హైదరాబాద్, నవంబర్ 2: మిడ్‌మానేరు ప్రాజెక్టును సకాలంలో 2018 మార్చి నాటికి పూర్తి చేస్తామని సాగునీటి మంత్రి టి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించారని, 25 ఏళ్లపాటు ఆ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైతే తాము మూడేళ్లలో దానిని శరవేగంగా పూర్తి చేసే చర్యలు చేపట్టామని అన్నారు.

Pages