S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/30/2017 - 01:43

హైదరాబాద్, అక్టోబర్ 29: మిషన్ కాకతీయ అమలు చేయడం వల్ల రాష్ట్రంలో 51.5 శాతం సాగు వీస్తిర్ణం పెరిగింది. అలాగే భూ గర్భజలాల మట్టం పెరుగుదల, ఎండిపోయిన బోర్ల రీచార్జి, 39 శాతం చేపల ఉత్పత్తి పెరిగింది. మిషన్ కాకతీయ ప్రభావంపై నాబార్డుకు చెందిన న్యాబ్కమ్ జరిపిన అధ్యయన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. న్యాబ్కమ్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

10/30/2017 - 01:33

ఆత్మకూరు/ చంద్రగిరి, అక్టోబర్ 29: చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎర్రచందనం దొంగలు బరితెగించారు. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని మర్రిపాడు పోలీస్ స్టేషన్ మీదుగా నెల్లూరు- ముంబయి రహదారి మీదుగా ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. తరలిపోతున్న ఎర్రచందనం దుంగల వాహనాన్ని స్థానిక ఎస్సై అబ్దుల్ రజాక్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

10/30/2017 - 01:32

అమరావతి, అక్టోబర్ 29: వివిధ ప్రభుత్వ శాఖల నుంచి విడుదలయ్యే ప్రకటనలన్నీ ఒకే గొడుకు కిందికి తేవడం ద్వారా జవాబుదారీతనం పెంచాలన్న ముఖ్యమంత్రి సదుద్దేశం నెరవేరని పరిస్థితి నెలకొంది. సిఎం ఆదేశాలను మంత్రులు, అధికారులు బేఖాతరు చేయడంతో లక్ష్యానికి గండిపడింది. సమాచార శాఖ ద్వారానే అన్ని శాఖలు ప్రకటనలు ఇవ్వాలంటూ 45 రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వు చివరకు చెల్లని కాగితమైంది.

10/30/2017 - 01:20

అమరావతి, అక్టోబర్ 29: ‘నాకు అమరావతి ఎంత ముఖ్యమో అనంతపురం, అమలాపురమూ అంతే ముఖ్యం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి నిర్మాణం భారంకాదు, బాధ్యతన్నారు. ‘ప్రతి జిల్లా, గ్రామం అభివృద్ధి కావాలి. భావితరాల వారికి నేనిచ్చే కానుక అమరావతి. ప్రవాసాంధ్రులు మాతృభూమి అభివృద్ధికి సహకారం అందించడానికి సంసిద్ధులయ్యారు. అమరావతిలో జరిగే ప్రతి అభివృద్ధి పథకం ప్రజలకే అంకితం.

10/29/2017 - 03:41

హైదరాబాద్, అక్టోబర్ 28: నేషనల్ పోలీస్ అకాడమీలో 69వ, బ్యాచ్‌కు చెందిన 136 మంది ఐపిఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారని, ఇక ప్రజాసేవలో యువ ఐపిఎస్‌లు పాల్గొంటారని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ దూలె బర్మన్ తెలిపారు. పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా శనివారం పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

10/29/2017 - 03:29

హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, పార్టీకి, శాసనసభ్యత్వానికీ ఎ. రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీని కుదిపేసింది. చాలా రోజులుగా రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారన్న ఊహగానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇంత త్వరగా ఉండకపోవచ్చని, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చేందుకు సమయం ఇచ్చినప్పుడే, రేవంత్ చేరుతారని చాలా మంది భావించారు.

10/29/2017 - 03:21

హైదరాబాద్, అక్టోబర్ 28: వచ్చే శాసనసభ ఎన్నికలు-2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 6వ తేదీ నుంచి చేపట్టనున్న ప్రజాసంకల్ప పాదయాత్ర ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది.

10/29/2017 - 03:17

హైదరాబాద్, అక్టోబర్ 28: హైదరాబాద్‌లో రాజకీయ కార్యకలాపాలకు, పరిపాలనకు వేర్వేరుగా కార్యాలయాలను ప్రారంభించిన జనసేన ఇక జిల్లాల వారీ పార్టీ కార్యాలయాలను తెరిచేందుకు సిద్ధమవుతోంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలను విస్తృతం చేయనుంది. తెలంగాణకు హైదరాబాద్‌లోనూ, ఆంధ్రాకు అమరావతిలోనూ ప్రధాన కార్యాలయాలను ప్రారంభించింది.

10/29/2017 - 03:52

తిరుపతి, అక్టోబర్ 28: కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 12 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అర్చకస్వాములు వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది.

10/29/2017 - 03:47

హైదరాబాద్, అక్టోబర్ 28: ప్రతి ఇంట్లో పోగయ్యే చెత్తను తడి,పొడిగా వేర్వేరు చేసి ఆటో టిప్పర్ల సిబ్బంది అందించటంలో మెరుగైన ఫలితాలను సాధించే స్వచ్ఛ డివిజన్లకు రూ. 50లక్షల నగదు నజరానాను అందించనున్నట్లు మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శనివారం గ్రేటర్ కార్పొరేటర్లతో హోటల్ హరితప్లాజాలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Pages