S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/14/2019 - 00:41

విజయవాడ, ఆగస్టు 13: పులిచింతల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజి 70 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద మొత్తం 70 గేట్లను మూడు అడుగుల మేర పైకి ఎత్తి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలుతున్నారు.

08/14/2019 - 00:34

హైదరాబాద్, ఆగస్టు 13: రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం మంచిది కాదని, దీనివల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశం ఉందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

08/13/2019 - 06:25

విజయవాడ : విజయవాడ శివారు కొత్తూరు-తాడేపల్లి గోశాలలో 110 గోవులు మృత్యువాత పడటం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని హైదరాబాద్‌లోని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానం వ్యక్తం చేశారు. గోశాలలో గత శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 110 వరకు గోవులు మృతి చెందిన విషయం తెలిసిందే.

08/13/2019 - 06:08

విజయవాడ, ఆగస్టు 12: కృష్ణా జిల్లా మోటూరు, ఆకివీడు రైల్వే స్టేషన్ల మధ్య రెండో రైల్వే లైనును సోమవారం రైల్వే అధికారులు ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే గుడివాడ- భీమవరం సెక్షన్ పరిధిలోని ఈ రెండు స్టేషన్ల మధ్య రెండో లైను, విద్యుద్దీకరణ పనులు పూర్తి కావడంతో 17231 (నర్సాపురం-నాగర్‌సోల్) రైలును నడిపి ప్రారంభించారు.

08/13/2019 - 06:05

హైదరాబాద్, ఆగస్టు 12: దక్షణాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌కు వచ్చిపోయే కొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రయాణికుల కోసం ప్రతి రెండు గంటలకు ఒకసారి న్యూస్ బులిటెన్‌లను విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, ముంబయ వెలేల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తమిళనాడు, కేరళ వెళ్ళే రైళ్లను తాత్కాలింగా రద్దు చేశారు.

08/13/2019 - 05:59

వై.రామవరం, ఆగస్టు 12: తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలంలోని డొంకరాయి ఏపీ జెన్కో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పవర్ కెనాల్‌కు సోమవారం తెల్లవారుజామున భారీ గండి పడింది. డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనంతరం పవర్ కెనాల్ ద్వారా 4500 క్యూసెక్కుల నీరు పోర్‌బే రిజర్వాయరు ద్వారా పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి వెళ్లి, మరో 440 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

08/13/2019 - 05:57

శ్రీకాకుళం, ఆగస్టు 12: శాసన సభాపతిగా సమీక్షలు ఏలా చేస్తారంటూ కొంతమంది అజ్ఞానులకు సమాధానంగా తొలుత తాను ఆమదాలవలస నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యేనన్న విషయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం వారికి గుర్తుచేసారు. సోమవారం పొందూరు మండలంలో జరిగిన వలంటీర్ల అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

08/13/2019 - 05:55

ఒంగోలు అర్బన్, ఆగస్టు 12: ఒంగోలు నగరంలోని కొణిజేడు బస్టాండులో సోమవారం విద్యుత్‌శాఖ రెవెన్యూ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కార్యాలయంలోని ఫర్నిచర్‌తోపాటు కంప్యూటర్లు, కొన్ని రికార్డులు దగ్ధమయ్యాయి. దీంతో సుమారు 10లక్షల రూపాయలకు పైగా ఆస్తినష్టం జరిగిందని విద్యుత్‌శాఖ జిల్లా ఎస్‌ఈ ఎన్‌విఎస్‌ఎస్ సుబ్బరాజు విలేఖర్లకు తెలిపారు.

08/13/2019 - 05:55

కర్నూలు, ఆగస్టు 12: కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద పోటెత్తడంతో కర్నూలు నగరంలోని పాతపట్టణానికి ముంపు ముప్పు పొంచిఉంది. దీంతో అధికారయంత్రాంగం ప్రజలు అప్రమత్తం చేసింది. కృష్ణా, తుంగభద్ర నదులకు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం ఏమాత్రం సోమవారం సాయంత్రం వరకు ఏమాత్రం తగ్గలేదు. కృష్ణానది నుంచి 8,21,498 క్యూసెక్కులు, తుంగభద్రనది నుండి 2,08,363 క్యూసెక్కుల నీరు సంగమేశ్వరం వద్ద కలుస్తున్నాయి.

08/13/2019 - 05:51

వరంగల్, ఆగస్టు 12: దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమె ఆత్మహత్యకు కారకులైన నిందితులను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదని, వారికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా శిక్ష పడేలా చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీనిచ్చారు. సోమవారం హన్మకొండ సమ్మయ్య నగర్‌లోని బాలిక కుటుంబాన్ని మంత్రి దయాకర్‌రావు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పరామర్శించారు.

Pages