S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/23/2017 - 02:07

హైదరాబాద్, సెప్టెంబర్ 22: చెగూర్‌లో జరిగే అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమావేశానికి హాజరయ్యే ప్రయాణీకుల సౌకర్యార్థం షాద్‌నగర్, వికారాబాద్ స్టేషన్లలో కొన్ని రైళ్లకు తాత్కాలిక నిలుపుదల సౌకర్యాన్ని కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

09/23/2017 - 01:47

హైదరాబాద్, సెప్టెంబర్ 22: దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల భర్తీకి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. సూపర్ స్పెషాలిటీ సీట్ల భర్తీపై తెలంగాణ, ఎపి సహా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 23 మంది డాక్టర్లు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో గురువారం, శుక్రవారం విచారణ జరిగింది.

09/23/2017 - 01:28

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆరోగ్య శ్రీ పరిధిలో ఆయుష్ వైద్యాన్ని చేర్చాలని యోచిస్తున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి అన్నారు. అలోపతి వైద్యానికి ధీటుగా రాష్ట్రంలో ఆయుష్ వైద్య విధానాలను బలోపేతం చేయడానికి అనేక చర్యలు చేపట్టామన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో త్వరలో కొత్తగా ఐదు ఆయుష్ ఆస్పత్రులను ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు.

09/23/2017 - 01:26

హైదరాబాద్, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో ఇప్పటి వరకు లక్షా 860 మందికి 21,18,060 గొర్రెలను పంపిణీ చేయడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో గొర్రెల పంపిణీపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఇంత తక్కువ సమయంలో లక్షకు పైగా యూనిట్లకు 21 లక్షలకు పైగా గొర్రెలను పంపిణీ చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని ముఖ్యమంత్రి అన్నారు.

09/23/2017 - 01:25

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కాని భూ వివాదాలు కొలిక్కి వస్తుండటంతో రైతన్నలు ఊరట పొందుతున్నారని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి ప్రారంభమైన భూ రికార్డుల ప్రక్షాళన ఆశించిన లక్ష్యానికి అనుగుణంగా సాగుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు.

09/23/2017 - 01:11

విజయవాడ, సెప్టెంబర్ 22: రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలన్న లక్ష్యంతో సంపద సృష్టించేందుకు కష్టపడుతున్నా. ఇంటింటికీ తేదేపాతో సమస్యలు పరిష్కరిస్తామని సిఎం చంద్రబాబు వెల్లడించారు. గ్రామాల్లో ఏ సమస్యలు లేకుండా చేసినప్పుడు అక్కడ మరో పార్టీ ఉండాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. 2029 వరకూ తామే అధికారంలో ఉంటామన్న ధీమా వ్యక్తం చేశారు.

09/23/2017 - 01:09

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఏకీకృత సర్వీసుల విధానంపై స్టేటస్‌కో కొనసాగించాలని జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏకీకృత సర్వీసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.

09/23/2017 - 01:07

అమరావతి, సెప్టెంబర్ 22: ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకింగ్ రంగానిదే కీలకపాత్ర అని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం సచివాలయంలో రాష్టస్థ్రాయి ద్విశత (200వ) బ్యాంకర్ల సమావేశాన్ని ప్రారంభిస్తూ, బ్యాంకులు, ప్రభుత్వం మధ్య సమన్వయం అవసరమన్నారు.

09/23/2017 - 01:03

హైదరాబాద్, సెప్టెంబర్ 22: శ్రీశైలం ప్రాజెక్టునుంచి 22 టిఎంసి నీటిని కేవలం మంచి నీటి అవసరాల నిమిత్తం మాత్రమే ఉపయోగించుకోవాలని, ఈమేరకు ఆ పరిమాణంలో నీటిని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు విడుదల చేయాలని కృష్ణా నదీ జలాల బోర్డు నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

09/22/2017 - 23:09

విజయవాడ, సెప్టెంబర్ 22: రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆత్మీయత, స్నేహానురాగాలు, మంచి మనస్సుతో నదీ జలాలు, విద్యుత్, ఆర్థికపరమైన అంశాలపై సమన్వయంతో ముందుకు సాగాలని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు.

Pages