S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/22/2017 - 23:03

హైదరాబాద్, సెప్టెంబర్ 22: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల పంపకానికి సంబంధించి మరింత గడువు కావాలని ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు హైకోర్టును కోరాయి. తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన 1200 మంది ఆంధ్ర ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్ విచారించారు.

09/22/2017 - 04:13

ఖమ్మం, సెప్టెంబర్ 21: తెలంగాణలో టిఆర్‌ఎస్ కార్యకర్తలతో రైతు సమన్వయ సమితులను (ఆర్‌ఎస్‌ఎస్) ఏర్పాటు చేయడంతో అసలైన రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయనున్నట్లు ఏఐసిసి కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

09/22/2017 - 03:52

హైదరాబాద్, సెప్టెంబర్ 21: గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కార్టూనిస్టు మోహన్ (66) గురువారం ఉదయం 7 గంటలకు మృతి చెందారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, వైకాపా అధినేత వైఎస్ జగన్, తదితరులు మోహన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

09/22/2017 - 02:05

శ్రీశైలం, సెప్టెంబర్ 21: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. సుమారు 98 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా గురువారం 862.40 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 103.47 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

09/22/2017 - 01:50

హైదరాబాద్, సెప్టెంబర్ 21: హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో ఉగ్రవాద ఖైదీల హల్‌చల్ కలకలం రేపుతోంది. ఇటీవల జైలులో శిక్ష అనుభవిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు ములాఖత్ సందర్భంగా జైలు సిబ్బంది వార్డర్లపై దాడికి పాల్పడిన సంఘటన తెలిసిందే. గురువారం జైలులో బారికేడ్‌ల నుంచి ఉగ్రవాద ఖైదీలు తప్పించుకునేందుకు ప్రయత్నించారు.

09/22/2017 - 01:42

హైదరాబాద్, సెప్టెంబర్ 21: కాళేశ్వరం ప్రాజెక్టు 15,16 ప్యాకేజిలో భాగంగా కాలువల నిర్మాణం కోసం 8 వేల ఎకరాల భూ సేకరణను వేగవంతం చేయాలని నీటిపారుదవలశాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వచ్చే అక్టోబర్ చివరికల్లా కాలువల కోసం భూ సేకరణ పూర్తి అయ్యాక రిజర్వాయర్ నిర్మాణానికి భూ సేకరణ జరగాలని మంత్రి ఆదేశించారు. కాళేశ్వరం ప్యాకేజి 15,16 పనులపై గురువారం జలసౌధలో మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు.

09/22/2017 - 04:31

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఇతర నగరాల్లోని మెట్రోరైలు కన్నా హైదరాబాద్ మెట్రోరైలు భిన్నమైందని, ఈ ప్రాజెక్టును ప్రదాని నరేంద్రమోది సమయమిచ్చినపుడే మియాపూర్ యార్డులో ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఇందుకు అవసరమైతే నవంబర్ 28 ముహూర్తాన్ని మళ్లీ మార్చుతామని కూడా ఆయన స్పష్టం చేశారు. మెట్రోరైలు పనులను ఆయన గురువారం తనిఖీ చేశారు.

09/22/2017 - 01:35

హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలంగాణలో 2011 నోటిఫికేషన్ ఆధారంగా నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష ఫలితాల వెల్లడికి మార్గం సుగమం అయింది. జస్టిస్ ఎస్ వి భట్ గ్రూప్-1 ఫలితాలకు సంబంధించిన పిటీషన్ విచారిస్తూ గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను నిలిపివేశారు. గ్రూప్-1 పరీక్ష ఫలితాల్లో తమను అనర్హుడిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ పలువురు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు.

09/22/2017 - 01:34

హైదరాబాద్, సెప్టెంబర్ 21: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి 10 పంపు హౌజ్ పై కప్పు కూలిన ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నలుగురు అధికారులతో విచారణ కమిటీని నియమిస్తూ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఉత్తర్వులు జారీ చేశారు.

09/22/2017 - 01:33

హైదరాబాద్, సెప్టెంబర్ 21: అటవీ, పర్యావరణశాఖ అనుమతులు లేకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో నిలిచిపోయిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.

Pages