S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/22/2017 - 01:22

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 21: ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు ఈ ఎంపి పదవికి ఎందుకు, సేవ చేస్తారనే ప్రజలు ఎన్నికల్లో గెలిపించారు, అలాంటి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేనప్పుడు పదవి దండగ అని అనంతపురం లోక్‌సభ సభ్యుడు జెసి దివాకర్‌రెడ్డి అన్నారు. అందుకే ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

09/22/2017 - 01:15

హైదరాబాద్, సెప్టెంబర్ 21: శ్రీశైలంలో నీటి నిల్వ 113 టిఎంసికి చేరుకోవడంతో, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఈ ఏడాది నీటి వినియోగంపై కృష్ణా బోర్డు శుక్రవారం ఇక్కడ సమావేశమవుతోంది. రెండు రాష్ట్రాల్లో కృష్ణా నీటి పంపకాల రాజకీయాలు వేడెక్కాయి. ఈ సమావేశానికి ఆంధ్ర, తెలంగాణ భారీసాగునీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు, కృష్ణా బోర్డు కార్యదర్శి హాజరవుతున్నారు.

09/22/2017 - 01:13

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21: పర్యాటక శాఖ రాష్ట్రంలో బీచ్ పర్యాటకాన్ని విస్తరింపజేస్తోంది. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లాలో కొత్తగా మూడు బీచ్ పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్యాకేజీలు చేపట్టింది. దీంతో పర్యాటకులకు కొత్తగా మూడు బీచ్‌లు ఏర్పడనున్నాయి. ఇటు నేలపైనా అటు నదిలోనూ ప్రయాణించే యాంపీబియాస్ (ఉభయ చర) బస్సులను పర్యాటక శాఖ తొలిసారిగా గోదావరి నదిలో ప్రవేశ పెడుతోంది.

09/22/2017 - 01:10

విజయవాడ, సెప్టెంబర్ 21: ముస్సోరిలోని అఖిల భారత సర్వీసుల శిక్షణ సంస్థలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐఎఎస్‌ల నుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 25న ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పాలనా సంస్కరణలపై వారితో చర్చించనున్నారు. ఈ మేరకు ఆయన 25న బయలుదేరి వెళ్లనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

09/22/2017 - 01:08

గుంటూరు (పట్నంబజారు), సెప్టెంబర్ 21: గుంటూరు అడవితక్కెళ్లపాడులో వీధికుక్కలు స్వైరవిహారం చేసి ఓ బాలుడ్ని మట్టుపెట్టాయి. నల్లపాడు పోలీసుస్టేషన్ పరిధిలోని అడవి తక్కెళ్లపాడు నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఎల్‌కెజి చదువుతున్న తూపాటి ప్రేమ్‌కుమార్ (4) గురువారం మధ్యాహ్నం స్కూలు నుంచి ఇంటికి వచ్చి ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో నాలుగు వీధికుక్కలు ఒక్కసారిగా దాడిచేశాయి.

09/22/2017 - 01:06

తిరుపతి, సెప్టెంబర్ 21: తిరుమల క్షేత్రంలో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల కోసం సర్వం సిద్ధమైంది. ఈనెల 23వ తేదీ నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు తిలకించడానికి వచ్చే భక్తులు ఎక్కడా ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా టిటిడి అన్ని చర్యలు చేపట్టింది. తిరుమల మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు.

09/22/2017 - 01:04

అమరావతి, సెప్టెంబర్ 21:ప్రజాసమస్యల పరిష్కారంలో కీలకపాత్ర పోషించే కలెక్టర్లను కార్యోన్ముఖులను చేసి, వారిని ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండురోజులు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో తనకేం కావాలో దిశానిర్దేశం చేశారు. గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ప్రతి శాఖ పనితీరునూ క్షుణ్ణంగా పరిశీలించి, తగిన ఆదేశాలిచ్చారు.

09/21/2017 - 23:28

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ నియామకంపై కమిటీని నియమించినట్లు ఆంధ్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వచ్చే ఎనిమిది వారాల్లో (రెండు నెలల్లో) ఈ ప్రక్రియను ముగిస్తామని కోర్టుకు ఏపి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ తెలిపారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

09/21/2017 - 23:26

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు కొత్తగా న్యాయమూర్తులుగా నియమితులైన ఆరుగురు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

09/21/2017 - 23:24

హైదరాబాద్, సెప్టెంబర్ 21: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక బుల్లెట్ కలకలం సృష్టించింది. పాట్నా వెళ్తున్న ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో తనిఖీ అధికారులు తూటాను గుర్తించారు. ప్రయాణికుడు సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఇదిలావుండగా గత మూడు నెలల క్రితం ఓ ప్రయాణికుడి వద్ద రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Pages