S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/21/2017 - 22:19

హైదరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ట్రాక్) కదిలింది. రాష్ట్రంలో 31 జిల్లాలను అనుసంధానిస్త్తూ 5107 కి.మీ రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.20 వేల కోట్ల ఖర్చు అవుతుందని రోడ్లు, భవనాల శాఖ అంచనాలు సిద్ధం చేసింది. ఈ అంచనాలపై సిద్ధం చేసిన నివేదికను వారంలో ముఖ్యమంత్రికి అందచేయనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈమేరకు కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధమైనట్టు వెల్లడించారు.

09/21/2017 - 22:19

వికారాబాద్, సెప్టెంబర్ 20: దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోదీని రాష్ట్రాన్ని పాలిస్తున్న చోటా మోదీ (కెసిఆర్) అనుసరిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, ఏఐసిసి కార్యదర్శి రామచంద్ర కుంతియా విమర్శించారు.

09/21/2017 - 22:18

హైదరాబాద్, సెప్టెంబర్ 20: హైదరాబాద్ పాతబస్తీలో గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోన్న కాంట్రాక్ట్ పెళ్లిళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. పెళ్లిళ్ల పేరుతో అరబ్బు షేక్‌లకు అమాయక మైనర్‌లను ఎరవేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్న బ్రోకర్లతోపాటు ఎనిమిది మంది అర బ్బు షేక్‌లను, నలుగురు ముస్లిం పెద్దలను, ముగ్గురు లాడ్జి యజమానులను పోలీసులు అరెస్టు చేశారు.

09/21/2017 - 22:11

హైదరాబాద్, సెప్టెంబర్ 20: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.20కి పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రానున్న దసరా పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీకన్నా, వారి వెంటవచ్చి వెళ్లే వారి రద్దీ ఎక్కువ ఉంటున్నందున ఆ రద్దీని నియంత్రించేందుకు ప్లాట్‌ఫాం టికెట్ ధర పెంచుతున్నటు తెలిపింది.

09/21/2017 - 22:08

హైదరాబాద్, సెప్టెంబర్ 20: సింగరేణి బొగ్గు గని సంస్థలో పని చేస్తున్న కార్మికులు ఒక్కొక్కరికి రూ.25 వేలు దసరా అడ్వాన్స్, రూ.57 వేలు దీపావళి బోనస్ చెల్లించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ మేరకు రూ.456 కోట్లు ఖర్చు చేసేందుకు సింగరేణి సంస్థ నిర్ణయించింది.

09/21/2017 - 21:49

ఇంద్రకీలాద్రి (విజయవాడ), సెప్టెంబర్ 20: ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రభుత్వ పండువలా లాంఛనంగా మొదలయ్యాయ.

09/21/2017 - 21:47

విజయవాడ (ఎడ్యుకేషన్), సెప్టెంబర్ 20: ఉపాధ్యాయులు రెండు దశాబ్దాల నుండి ఎదురుచూస్తున్న ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కు సంబంధించి మూడు జీవోలను రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విజయవాడలో విడుదల చేశారు. జీవో 72లో రాష్టప్రతి ఉత్తర్వులు, 73లో గజిటెడ్ ఉద్యోగులకు, జీవో 74ను నాన్ గజిటెడ్ ఉద్యోగులకు సంబంధించి విడుదల చేశారు.

09/21/2017 - 21:46

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూప్ -2 రిక్రూట్‌మెంట్ పోస్టుల భర్తీని తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నిలుపుదల చేయాలని ఏపి ట్రిబ్యునల్ స్టే మంజూరు చేసింది. ట్రిబ్యునల్ సభ్యుడు విజయకుమార్ ఈ స్టేను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

09/21/2017 - 21:44

విశాఖపట్నం, సెప్టెంబర్ 20: విశాఖ రైల్వే స్టేషన్‌ను వంద శాతం డిజిటల్ పే స్టేషన్‌గా మార్చేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. రైల్వే డిఆర్‌ఎం ముకుల్ శరణ్ మాథుర్ నగదురహిత లావాదేవీలను బుధవారం విశాఖ రైల్వే స్టేషన్‌లో ప్రారంభించారు.

09/21/2017 - 22:17

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ‘బతుకమ్మ... బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ చిన్నలు, పెద్దలు, మహిళలు లయబద్ధంగా అలపించిన ఆట పాటలతో బుధవారం సాయంత్రం యావత్తు పల్లెలు, పట్టణాలు, నగరాలు పులకించిపోయాయి. ప్రపంచంలో మరెక్కడా లేని, తెలంగాణకే సొంతమైన బతుకమ్మ సంబరాలు బుధవారం నుంచి రాష్టవ్య్రాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Pages