S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/20/2017 - 01:46

హైదరాబాద్, సెప్టెంబర్ 19: మద్యం దుకాణాలకు రికార్డు స్థాయిలో గడువు ముగిసేసరికి సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా రూ.250 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచన వేయగా అంచనాలకు మించి రూ.300 కోట్ల ఆదాయం రావడం విశేషం.

09/20/2017 - 01:37

రేణిగుంట, సెప్టెంబర్ 19: తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది, శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూకు జాతీయ ఫుడ్ సేఫ్టీ నుంచి లైసెన్స్ లభించింది. ఈనేపథ్యంలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిటిడి అధికారులు, సిబ్బంది, కొంతమంది భక్తులు లైసెన్స్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంటే, శ్రీవారి ప్రసాదానికి లైసెన్స్‌లు ఏమిటంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.

09/20/2017 - 01:33

గుంటూరు, సెప్టెంబర్ 19: దేశవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనామ్ మార్కెటింగ్ ఆన్‌లైన్ విధానం మిర్చి రైతులకు శాపంగా పరిణమించింది. ఈనెల ఒకటో తేదీ నుండి 25 మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. అయితే దీనివల్ల రైతులకు జరిపే చెల్లింపులలో వ్యత్యాసం ఉంటుందనే వాదనతో వ్యాపారులు గుంటూరు మిర్చి యార్డులో కొనుగోళ్లను నిలిపివేశారు.

09/20/2017 - 01:29

కర్నూలు, సెప్టెంబర్ 19: ప్రపంచంలో చిన్నారులు అత్యధికంగా ఉన్న దేశం భారతదేశమని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే ప్రపంచాన్ని జయించగల శక్తి వారిలో ఉందని సిఎం చంద్రబాబు అన్నారు. సురక్షిత బాల్యం.. సురక్షిత భారతదేశం పేర నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి చేపట్టిన భారతయాత్ర మంగళవారం కర్నూలుకు చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలో నిర్వహించిన ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.

09/20/2017 - 01:27

హైదరాబాద్/ శ్రీశైలం, సెప్టెంబర్ 19: శ్రీశైలం నీటిపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య లడాయి మొదలైంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 100 టిఎంసికి చేరుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్లు తెరిచి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి విడుదల ప్రారంభించింది.

09/19/2017 - 01:57

హైదరాబాద్, సెప్టెంబర్ 18: హైదరాబాద్, బెంగుళూరు లక్ష్యంగా ఉగ్రదాడులు జరగొచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరించిన నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలు, జనకూడళ్ల వద్ద గట్టి నిఘా పెంచారు. విదేశీ రాయబార కార్యాలయాలను టార్గెట్ చేసుకున్న బంగ్లాదేశ్ ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయ.

09/19/2017 - 01:55

హైదరాబాద్, సెప్టెంబర్ 18: చిన్నపిల్లలపై లైంగికపరమైన వేధింపులకు సంబంధించిన సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఆ అంశంపై దృష్టిసారించింది. పిల్లలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులకు తెరదించే ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రదేశాల్లో పిల్లలపై జరుగుతున్న వేధింపులపై రహస్యంగా సమాచార సేకరణ ప్రారంభించింది. ఇందుకో వెబ్‌సైట్ పెట్టింది.

09/19/2017 - 01:53

సూర్యాపేట, సెప్టెంబర్ 18: పెద్దోడి వ్యాపార వ్యాపకం, చిన్నోడి ఉద్యోగ వ్యవహరం.. పచ్చని కుటుంబానికి చితి పేర్చింది. భరించలేని నష్టం, జీర్ణించుకోలేని మోసం ఆ కుటుంబ పెద్దను కుంగదీసింది. బాధను బంధువులతో పంచుకోలేక, ఒడ్డుకు చేరే ఒడుపు దొరకక కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. తల్లిని వేరేచోటికి పంపించి, అప్పులు కొన్ని చెల్లించి, కర్మఖండకు కావాల్సిన డబ్బు ముందే భద్రపర్చి..

09/19/2017 - 01:49

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పనున్న విద్యుత్ ప్రాజెక్టులకు 9.65 శాతం వడ్డీకి రూ.40 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పిఎఫ్‌సి), రూరల్ ఎలక్ట్ఫ్రికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసి) ముందుకొచ్చాయని జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు వెల్లడించారు.

09/19/2017 - 01:47

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలకు పాల్పడటం చూసాం కానీ మరీ చీరలను తగులబెట్టేంత కుసంస్కారానికి దిగజారి నీచ, నికృష్ట రాజకీయాలకు వడిగట్టడం దారుణమని చేనేతశాఖ మంత్రి కె తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pages