S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/18/2017 - 02:55

విశాఖపట్నం(కల్చరల్), సెప్టెంబర్ 17: విశాఖ నగరానికి సినీ పరిశ్రమను తీసుకువస్తానని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి స్పష్టంచేశారు.

09/18/2017 - 02:27

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఐటి పరిశ్రను ద్వితీయశ్రేణి నగరాలకు తీసుకువెళ్లాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఐటి టవర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం ఆదివారం నిజామాబాద్ పట్టణంలో కూడా ఐటి టవర్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈ ఐటి హబ్ కోసం మొదటి దశలో సుమారు రూ.25 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.

09/18/2017 - 02:26

హైదరాబాద్, సెప్టెంబర్ 17: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ‘బతుకమ్మ చీర‘ల పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. రాష్టవ్య్రాప్తంగా రూ. 222 కోట్ల విలువ చేయనున్న కోటి నాలుగు లక్షల చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి కె తారకరామారావు తెలిపారు. బతుకమ్మ కానుకగా సోదరీమణులు అందరికీ చీరలు పంపిణీ చేయడం తనకు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందని కెటిఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

09/18/2017 - 02:44

నిజామాబాద్, సెప్టెంబర్ 17: నవ భారత నిర్మాణమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం సాగుతోందని, తెలంగాణ ప్రజలు అందులో భాగస్వాములు కావాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. అప్పుడే తెలంగాణ విమోచన దినోత్సవానికి సార్థకత చేకూరుతుందన్నారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి గడిచిన మూడేళ్లలో సాధించిన విజయాలను రాజ్‌నాథ్ వివరించారు.

09/18/2017 - 02:23

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రాష్ట్రాన్ని క్షీర విప్లవం దిశగా తీసుకెళ్లడానికి పాడి రైతులకు ఒక కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గొర్రెల, చేపల పెంపకాలకు ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెట్టినట్టుగానే పాడి రైతుల కోసం వచ్చే నెలలో నిధులు సమకూర్చి రెండు నెలల్లో పథకాన్ని అమలు చేస్తామన్నారు. ప్రగతి భవన్‌లో ఆదివారం పాడి రైతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

09/18/2017 - 02:12

విజయవాడ, సెప్టెంబర్ 17: ‘ఇంటింటికీ తెలుగుదేశం ప్రతి ఎస్సీ, ఎస్టీ కాలనీలో నిర్వహించాలి. ప్రతి ఒక్క ఇంటి తలుపునూ తట్టాలి. వారి యోగక్షేమాలు విచారించాలి. బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించాలి. వారి అవసరాలను గుర్తించాలి. సమస్యలను నమోదు చేయాలి’ అని శ్రేణులకు తెదేపా జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

09/18/2017 - 02:10

సినీ కథా నాయక, మాజీ ఎంపీ జమున సినీ జీవిత వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని నవరస కళావాణి బిరుదుతో టి.సుబ్బరామిరెడ్డి ఘనంగా సత్కరించారు. విశాఖలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో లలితా కళాపరిషత్ ఆధ్వర్యంలో టిఎస్సార్ జన్మదినం సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు.

చిత్రం..జమున చేతికి కంకణం తొడుగుతున్న రాష్ట్ర మంత్రి శ్రీనివాసరావు

09/18/2017 - 02:28

హైదరాబాద్, సెప్టెంబర్ 17: మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ అవార్డును దర్శకుడు ఎస్‌ఎస్ రాజవౌళి అందుకున్నారు. హైదరాబాద్ శిల్ప కళావేదికలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, సిఎం కెసిఆర్ హాజరై అవార్డును రాజవౌళికి అందజేశారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

09/18/2017 - 02:02

విజయవాడ, సెప్టెంబర్ 17: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాని ప్రభావం వివిధ ప్రాజెక్టులపై పడుతోంది. నిధుల కొరత వల్ల అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే భూసేకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకూ 27 శాతం మేర భూసేకరణ మాత్రమే జరగడం గమనార్హం.

09/18/2017 - 02:38

విశాఖపట్నం, సెప్టెంబర్ 17: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి జీవనంలో భాగం కావాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా విశాఖలో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రాంతీయ సదస్సు ముగింపు సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా చంద్రబాబు మాట్లాడుతూ పర్యావరణం అంటే ఏదో సాంకేతిక అంశమని చాలామంది పట్టించుకోవడం లేదని అన్నారు.

Pages