S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/12/2017 - 00:48

కర్నూలు, సెప్టెంబర్ 11: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన తూనికలు, కొలతల శాఖ కర్నూలు జిల్లా ఇన్‌స్పెక్టర్ ఎన్ స్వామి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం ఏకకాలంలో దాడులు జరిపారు. సుమారు రూ.10 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. స్వామి కర్నూలు జిల్లా తూనికలు, కొలతలశాఖ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబం మొత్తం

09/12/2017 - 00:36

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో నూతన ఆవిష్కరణల (ఇన్నోవేషన్స్)ను ప్రోత్సహించేందుకు వంద కోట్లు కేటాయిస్తున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. ఏషియా పసిఫిక్ సెంటర్ ఫర్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ, ఏపి ఇన్నోవేషన్ సొసైటీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇనె్వస్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్-2017ను మూడు రోజులపాటు విశాఖలో నిర్వహించింది.

09/11/2017 - 22:42

హైదరాబాద్, సెప్టెంబర్ 11: కర్నూలు తూనికలు, కొలతల శాఖ ఇన్స్‌పెక్టర్ నాగోతు స్వామి హైదరాబాద్‌లోని నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నట్టు గుర్తించారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని స్వామి నివాసంతోపాటు అతని బావమరిది ఇంట్లోను ఏసిబి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు రూ. 10 కోట్లు విలువైన ఆస్తులను గుర్తించారు.

09/11/2017 - 21:53

ఆదోని, సెప్టెంబర్ 10: న్యాయస్థానంలో కేసు ఉన్నందు వల్లే రామమందిరం నిర్మాణంలో జాప్యం జరుగుతోందని కేంద్ర మాజీ మంత్రి, బిజె మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధ్రేశ్వరి తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఆదివారం ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రామమందిరం నిర్మాణంలో హిందువులను మోసగించలేదని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

09/11/2017 - 03:19

ఖమ్మం, సెప్టెంబర్ 10: రోగికి ఆపరేషన్ చేసి కుట్లు వేయకుండా ఇంటికి పంపిన సంఘటనను మరువకముందే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఘోరం జరిగింది. వైద్యులు, సిబ్బంది మానవత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించారంటూ దీనిపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామానికి చెందిన రాజయ్య సతీమణి నాగమణి పురిటినొప్పులతో శనివారం సాయంత్రం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి వచ్చింది.

09/11/2017 - 03:16

హైదరాబాద్, సెప్టెంబర్ 10:శ్రీశైలం ప్రాజెక్టు నీటిపై ఏపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. కనీసం రెండు టిఎంసి నీటిని ఇవ్వాలన్న తెలంగాణ కోరికను ఏపి తిరస్కరించడంతో, కరెంటును ఉత్పత్తి చేసి నీటిని విడుదల చేయడంపై తెలంగాణ దృష్టిని సారించింది. ఏపి ప్రభుత్వం శనివారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

09/11/2017 - 01:54

వరంగల్, సెస్టెంబర్ 10: స్వైన్‌ఫ్లూతో ఓ పోలీసు అధికారి మృతి చెందారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట పోలీస్ సబ్‌డివిజన్ ఏసిపి దుర్గయ్య యాదవ్ సైన్‌ఫ్లూ బారినపడి ఐదురోజులుగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. అతని పార్థివ దేహా న్ని వరంగల్‌లోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు.

09/11/2017 - 01:52

హైదరాబాద్, సెప్టెంబర్ 10: భూమిలేని దళితులకు ఉచితంగా మూడు ఎకరాల వ్యవసాయ భూమి పంపిణీ చేయడానికి భూ కొరత ఏర్పడింది. రాష్టవ్య్రాప్తంగా అసైన్డ్ ల్యాండ్ ఇంకా ఎంత మేరకు అందుబాటులో ఉందో లెక్క తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దళితులకు ఇప్పటికే పంపిణీ చేసిన అసైన్డ్‌ల్యాండ్ వినియోగం, నిరూపయోగంపై సర్వే చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఎస్‌సి సంక్షేమ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.

09/11/2017 - 01:48

హైదరాబాద్, సెప్టెంబర్ 10:రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. ప్రధాన రాజకీయ పక్షాలు ముందుగానే ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాయి. పథకాలే ఎన్నికల్లో గెలిపిస్తాయి అని అధికార పక్షం ధీమాగా ఉండగా, కాంగ్రెస్ జనంలోకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకున్నా ముందు చూపుతూ అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. టిఆర్‌ఎస్ తన పథకాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది.

09/11/2017 - 01:43

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, వౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి జిఎస్‌టి మినహాయింపుపై జిఎస్‌టి సమావేశంలో ఎటువంటి ఉపశమనం లభించలేదు. రాష్ట్రప్రభుత్వం ఈ మీటింగ్‌పై ఎన్నో ఆశలుపెట్టుకుంది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి జిఎస్‌టి అమలులోకి వచ్చింది.

Pages