S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/01/2017 - 01:53

హైదరాబాద్, జూలై 31: ట్రాన్స్‌కోలో శాశ్వత పోస్టుల్లో ఇతర ప్రాంతాల వారిని నియమించడానికి సంబంధించిన పిటీషన్‌ను మంగళవారం విచారించేందుకు హైకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ జె ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ శ్రవణ్ కుమార్ అనే నిరుద్యోగి దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన అనంతరం ఈ ఆదేశాలు ఇచ్చింది.
మూడేళ్ల లా గ్రాడ్యుయేట్లకు అవకాశం

08/01/2017 - 01:33

హైదరాబాద్, జూలై 31: రాష్ట్రంలో అన్ని గిరిజన ఆవాస ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించడానికి రూపొందించిన మూడేళ్ల ప్రణాళికను ఈ ఏడాది నుంచే అమలు చేయాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. గిరిజన ఆవాస ప్రాంతాలకు రోడ్ల పరిస్థితిపై సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డితో సోమవారం కెసిఆర్ చర్చించారు.

08/01/2017 - 01:31

హైదరాబాద్, జూలై 31: కాళేశ్వరం ప్రాజెక్టుపై విదేశీ కంపెనీల ప్రతినిధులతో నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు సోమవారం సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడు పంపుహౌజ్‌ల నిర్మాణం 2018 మార్చి చివరిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 2018 జూన్‌నాటికి మొత్తం పనులు పూర్తి చేయాలన్నారు. జలసౌధలో ప్రాజెక్టులపై మంత్రి సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

08/01/2017 - 01:25

హైదరాబాద్, జూలై 31: ట్రాన్స్‌జండర్ వర్గానికి విద్య, ఉపాథి రంగాల్లో రిజర్వేషన్ కోటా కల్పించే ప్రతిపాదన కేంద్రం పరిశీలిస్తోందని సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామదాస్ అతువాలె వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం సామాజిక, అణగారిన, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు కట్టుబడి ఉందన్నారు.

08/01/2017 - 01:24

హైదరాబాద్, జూలై 31: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అజయ్‌కుమార్ ఈమేరకు ఇరు రాష్ట్రా ల ఐటీ శాఖ మంత్రులకు సోమవారం సమాచారమిచ్చారు.

08/01/2017 - 01:20

అమరావతి, జూలై 31: ప్రజా సమస్యలను ఆకళింపు చేసుకోవడానికి అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోక వస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. సోమవారం విజయవాడలోని ఒక హోటల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యలపై సిఎం చంద్రబాబుతో జరిగిన భేటీ విశేషాలు వెల్లడించారు. ఈ సమస్యను రాజకీయాలకు అతీతంగా మానవతాకోణంలో చూడాలన్నారు.

08/01/2017 - 01:18

నంద్యాల, జూలై 31: నంద్యాల ఉప ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. గత కొంతకాలంగా చక్రపాణిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నంద్యాల నాయకులు సైతం ఆయనను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదు.

08/01/2017 - 01:13

అమరావతి, జూలై 31: ఉద్దానం కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారానికి ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యను ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రూ.15 కోట్ల తో శ్రీకాకుళంలో ప్రపంచస్థాయి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కేబినెట్ నిర్ణయించిందని గుర్తు చేశా రు.

08/01/2017 - 01:10

హైదరాబాద్, జూలై 31: దక్షిణ భారత్‌కు చెందిన రాష్ట్రాలు మిగులు విద్యుత్‌ను పొరుగు రాష్ట్రాలకు ఇచ్చేందుకు చరిత్రాత్మక అంగీకారం కుదిరింది. విద్యుత్ మిగులు, లోటు ఉన్న రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఒక అంగీకారానికి వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య సోమవారం సమగ్రంగా చర్చలు జరిగాయి.

07/31/2017 - 02:27

సామర్లకోట, జూలై 30: ఇంజనులో సాంకేతిక లోపం కారణంగా తిరుపతి నుండి విశాఖపట్నం వైపు వెడుతున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట సమీపంలో సుమారు రెండు గంటలు నిలిచిపోయింది. ఉదయం 9 గంటల సమయంలో సామర్లకోట రైల్వే స్టేషన్ దాటి నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత చంద్రంపాలెం సమీపంలో ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో సుమారు రెండు గంటలపాటు నిలిచిపోయింది.

Pages