S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/31/2017 - 02:25

రేణిగుంట, జూలై 30: తిరుపతి రూరల్ తిమ్మినాయుడు పాల్యెం పంచాయతీ పరిధిలోని రేణిగుంట మార్గంలోఉన్న ఓ బాణాసంచా గోడౌన్‌లో ఆదివారం సాయంత్రం 7.15 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బాలకార్మికులు మృతిచెందడంతో పాటు మరో మహిళ తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతోంది. బాణాసంచా తయారీ సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

07/31/2017 - 02:23

విజయవాడ, జూలై 30: సినీనటుడు పవన్‌కళ్యాణ్ రాజధానికి వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన రద్దయింది. ఆ జిల్లాల్లో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో సోమవారం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. కానీ పవన్‌తో భేటీ కారణంగా ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు. ఉదయం 9.30లకు గన్నవరం విమానాశ్రయానికి పవన్, హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు వస్తారు.

07/31/2017 - 02:21

విశాఖపట్నం, జూలై 30: ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల తరపున పోరాడుతున్న పవన్ కళ్యాణ్, సమస్య పరిష్కరించే వరకూ వెనక్కు తగ్గకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే, రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలు, నిబంధనలను ఏమా త్రం పట్టించుకోకుండా నెలకొల్పిన మద్యం దుకాణాలను తొలగించాలని రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహిళలు చేస్తున్న పోరాటాలకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలపనున్నారా?

07/31/2017 - 01:31

సిద్దిపేట, జూలై 30: సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. శాంతిభద్రత పర్యవేక్షణలో తనదైన ముద్ర వేసి సిద్దిపేటను ప్రశాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు.

07/31/2017 - 01:28

హైదరాబాద్, జూలై 30: జోనల్ వ్యవస్థ రద్దు ప్రక్రియ మరింత వేగవంతం అయింది. జిల్లా, జోనల్, రాష్ట్రం మూడంచెల వ్యవస్థలో జోనల్ వ్యవస్థను రద్దు చేయడం వల్ల తలెత్తబోయే ఉద్యోగుల విభజన, కేడర్, పదోన్నతుల అంశంపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌కు సమర్పించింది.

07/31/2017 - 01:21

అమరావతి, జూలై 30: డిజిటల్ పాలనలో ఒక కొత్త శకానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలకబోతోంది. ప్రభుత్వ శాఖల్లో సంక్లిష్టమైన విధానాలు, సుపరిపాలనకు అవరోధం కాకుండా సులభమైన తరహాలో ప్రజలకు సేవలందించే వ్యవస్థగా ఈ-ప్రగతి ఆవిర్భవించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐటీలో కొత్త ఆవిష్కరణలకు, వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తూ వస్తున్నారు.

07/31/2017 - 01:32

విశాఖపట్నం, జూలై 30: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిని అరికట్టేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కదలి, అండగా నిలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు నెఫ్రాలజీలో నిష్ణాతులైన డాక్టర్లను, హార్వర్డ్ ప్రొఫెసర్లను పవన్ కళ్యాణ్ ఇక్కడికి రప్పించారు. సుమారు 10 మందితో కూడిన బృందం శనివారం ఉద్దానం పర్యటించింది.

07/31/2017 - 01:13

హైదరాబాద్, జూలై 30: మాదకద్రవ్యాల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఎక్సైజ్ సిట్ నేతృత్వంలో కొనసాగుతోన్న దర్యాప్తులో ఇంకా కొందరు సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో రెండో జాబితాను సిట్ సిద్ధం చేసినట్టు తెలిసింది. దీంతో టాలీవుడ్‌లో ప్రకంపనలు రేగుతున్నాయి. సినీ ప్రముఖుల దర్యాప్తు చివరి దశకు చేరడంతో సిట్ అధికారులు రెండో జాబితాపైనే దృష్టి సారించారు.

07/31/2017 - 01:12

హైదరాబాద్, జూలై 30: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యల పరిష్కారం ఇప్పట్లో లభిస్తుందనే ఆశలు అడుగంటాయి. గవర్నర్ సమక్షంలో రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. రానున్న రోజుల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటారనే నమ్మకం సడలుతోంది.

07/30/2017 - 05:08

విజయవాడ, జూలై 29: రాజ్యాంగబద్ధమైన ఉప రాష్టప్రతి పదవి వల్ల క్రియాశీలక రాజకీయాలకు, సొంత అభిరుచులు, సన్నిహిత ప్రజలకు కాస్తంత దూరమైనప్పటికీ, పదవీ బాధ్యతలు క్షుణ్ణంగా అర్థం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం అర్థవంతంగా ఆ పదవిని వినియోగిస్తానంటూ ఎన్‌డిఏ ఉప రాష్టప్రతి అభ్యర్థి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు.

Pages