S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/09/2019 - 23:42

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణలో త్వరలో అమెరికా యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలని అమెరికాలోభారత రాయబారిని కోరినట్లు, ఈ విషయమై సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారు. ఆయన అమెరికాలో వాషింగ్టన్ డీసీలో అమెరికాలో భారత రాయబారి డిప్యూటీ చీఫ్ అమిత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

11/10/2019 - 06:46

హైదరాబాద్: అయోధ్య రామజన్మభూమి వివాదం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తనకు సంతృప్తిగాలేదని, కాని రాజ్యాంగం పట్ల తనకు నమ్మకం ఉందని ఎంఐఎం ఎంపీ, ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కోర్టు చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలన్నారు.

11/09/2019 - 01:06

తిరుపతి, నవంబర్ 8: రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు జగన్ అందించిన ప్రణాళికల్లేని పాలనతో రాష్ట్భ్రావృద్ధి 20 సంవత్సరాలు వెనెక్కి పోయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

11/09/2019 - 00:24

అమరావతి, నవంబర్ 8: మెరుగైన రాష్ట్రం కోసం.. ఎంతో కొంత మంచి చేసేందుకు ఖండాంతరాల్లో ఉన్న వారంతా కదలి రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. క్యాంప్ కార్యాలయంలో ‘కనెక్ట్ టు ఆంధ్ర’ వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు.

11/09/2019 - 00:13

హైదరాబాద్, నవంబర్ 8: తెలంగాణ ఆర్టీసీ బస్సు రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి చర్యలుగానీ, నిర్ణయాలుగానీ తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీ మునుపటి రీతిన ఉండబోదని, అసలు ఆ సంస్థే ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

11/08/2019 - 23:13

హైదరాబాద్, నవంబర్ 8: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’లో భాగంగా రాజ్యసభ సభ్యుడు జే.సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించిన వారి సంఖ్య దాదాపు మూడు కోట్లకు చేరుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఇచ్చిన ‘గ్రీన్ చాలెంజ్’ను సినీనటి జయసుధ స్వీకరించారు.

11/08/2019 - 22:45

హైదరాబాద్, నవంబర్ 8: విశాఖపట్నం నుంచి శబరిమలకు 20 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 24న, డిసెంబర్ 1, 8, 15, 22, 29వ తేదీ వరకు రైళ్లు నడుస్తాయి. విశాఖపట్నం-కొల్లాం-విశాఖపట్నం (08515-08516) మధ్య వచ్చీపోయే రైళ్ల వివరాలను అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నలో రాత్రి 11.50 గంటలకు బయలుదేరి మరుచటిరోజు సాయంత్రం 5.15 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

11/08/2019 - 22:43

హైదరాబాద్, నవంబర్ 8: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు డార్క్ వెబ్ అడ్డాగా మారిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి శుక్రవారం నాడు పేర్కొన్నారు. డార్క్‌వెబ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు భారత్ సైబర్ జాగ్రత్తలు తీసుకుంటోందని, క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చెయిన్ వినియోగించి కుట్రలను భగ్నం చేస్తోందని ఆయన చెప్పారు.

11/08/2019 - 22:14

హైదరాబాద్, నవంబర్ 8: ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద చేపట్టే కొత్త రోడ్ల నిర్మాణ వ్యయంలో అధిక భాగాన్ని కేంద్రం భరించాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. కేంద్రం 90 శాతం నిధులు, రాష్ట్రం 10 శాతం వ్యయాన్ని భరించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది.

11/08/2019 - 05:12

తిరుపతి: శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టీటీడీ సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా 12, 26వ తేదీల్లో మంగళవారం వయోవృద్ధులు (65 సంవత్సరాలు పైబడిన వారు), దివ్యాంగులకు నాలుగువేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది.

Pages