S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/22/2017 - 01:50

హైదరాబాద్, జూన్ 21: మూతపడిన పరిశ్రమల పునరుద్దరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆ శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. మూతపడిన పరిశ్రమలను పున:ప్రారంభించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఇప్పటికే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించామన్నారు. అలాగే భీమా సిమెంట్ ఫ్యాక్టరీ పున:ప్రారంభానికి అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో వివరించారు.

06/21/2017 - 02:07

హైదరాబాద్, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ డి సుభాకర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాధన్ వెల్లడించారు. డాక్టర్ సుభాకర్ వేలూరు విఐటి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా, డీన్ ఆఫ్ అకడమిక్స్‌గా వ్యవహరిస్తున్నారు.
రాజారామన్న ఫెలోషిప్

06/21/2017 - 01:33

హైదరాబాద్, జూన్ 20: కాళేశ్వరం పరిధిలోని బ్యారేజీలు, రిజర్వాయర్లు పూర్తికాకముందే ప్రాజెక్టు పరిధిలోని కాల్వల నిర్మాణం పూర్తిచేసి చెరువుల నింపి పొలాలకు సాగునీరు అందించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. గత ఏడాది శ్రీరామ్‌సాగర్ కాల్వల ద్వారా చెరువులు నింపడంవల్ల 9 లక్షల ఎకరాల్లో రూ.4,725 కోట్ల విలువ చేసే పంటలు పండాయన్నారు.

06/21/2017 - 01:32

సంగారెడ్డి, జూన్ 20: తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచి అధికారం అప్పగించిన రాష్ట్ర ప్రజలే ప్రభుత్వానికి బాసులు. ప్రజాశీస్సులు ఉన్నన్ని రోజులు ఎవరికి భయపడేది లేదు. బంగారు తెలంగాణ సాధనకు నిరంతరం కృషి చేస్తానని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఆర్థిక పరిపుష్టి ఎక్కడో ఉండదని, మానవ సంపదకు మించిన సంపద లేదన్నారు.

06/21/2017 - 01:24

హైదరాబాద్, జూన్ 20: రహేజా కేసులో ఎల్‌వి సుబ్రహ్మణ్యం, బిపి ఆచార్య, కె రత్నప్రభ సహా పలువురు ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. రహేజా మైండ్‌స్పేస్-ఎపి పారిశ్రామిక వౌలిక సదుపాయాల కల్పన కార్పొరేషన్ (ఏపిఐఐసి) జాయింట్ వెంచర్‌లో అక్రమాలకు పాల్పడినందుకు నిందితులైన ఐఏఎస్ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని గతంలో ఎసిబి ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది.

06/21/2017 - 01:24

విజయవాడ, జూన్ 20: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొదటి త్రైమాసికంలోనే దారుణంగా ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గత సంవత్సరానికి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు 10వేల కోట్ల రూపాయల వరకు ఉన్నాయని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆర్థికశాఖ అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు.

06/21/2017 - 01:21

హైదరాబాద్, జూన్ 20: ఏపీ సిఎం చంద్రబాబు అడిగివుంటే బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసేవాడినని ఉద్వాసనకు గురైన ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. మంగళవారం ఇక్కడి ప్రెస్‌క్లబ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఏపీ సిఎస్‌గా పనిచేసే అవకాశం సిఎం చంద్రబాబు తనకిచ్చారన్నారు.

06/21/2017 - 01:16

హైదరాబాద్, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఐవై ఆర్ కృష్ణారావుపై ప్రభుత్వం వేటు వేసింది. సామాజిక మాధ్యమం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో తెలుగుదేశం పార్టీ నేత అయిన వేమూరి ఆనందసూర్యను నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

06/20/2017 - 02:19

హైదరాబాద్, జూన్ 19: ప్రయాణికుల భద్రత ధ్యేయంగా సమయపాలనతోపాటు రేల్వే స్టేషన్లలో సౌకర్యాల మెరుగుపై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ సోమవారం సమీక్షించారు. సికిందరాబాద్ రైల్ నిలయంలో జరిగిన సమీక్షలో సికిందరాబాద్, హైదరాబద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందెడ్ డివిజన్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

06/20/2017 - 02:16

హైదరాబాద్, జూన్ 19: ఉభయ తెలుగురాష్ట్రాల్లో ప్రైవేటు బస్సులను అడ్డుకోవద్దని సేఫ్టీ జర్నీకి తోడ్పడాలని ప్రైవేటు బస్సు ఓనర్స్, ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది.

Pages