S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/20/2017 - 01:38

హైదరాబాద్, జూన్ 19: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పెంపకం పథకాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రారంభించనున్నారు. మత్స్య సంపద పెంపొందించడంతో పాటు, గొర్రెల పంపిణీ, గ్రామీణ కుల వృత్తులను పరిపుష్టం చేయటం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

06/20/2017 - 01:35

హైదరాబాద్, జూన్ 19: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన మియాపూర్ భూకుంభకోణం కేసు అట్టుడుకుతుండగానే, మరో భూకబ్జా వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హైటెక్‌సిటీ- మాదాపూర్ రెవెన్యూ గ్రామాల మధ్య గుట్టల బేగంపేట సర్వే నెంబర్ 63లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో కొందరు పాగా వేశారు.

06/20/2017 - 01:34

హైదరాబాద్, జూన్ 19: బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదించిన రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు తెరాస మద్దతు ప్రకటించింది. రామ్‌నాథ్‌ను ఎంపిక చేసిన విషయాన్ని సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సిఎం కెసిఆర్‌కు టెలిఫోన్‌లో తెలిపారు. తాము ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతివ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేయగానే, కెసిఆర్ సానుకూలంగా స్పందించారు.

06/20/2017 - 01:19

విజయవాడ, జూన్ 19: రాష్ట్రంలో ప్రతి పేదవానికి సొంతిల్లు కల నెరవేర్చి తద్వారా శాశ్వత చిరునామా కల్పిస్తానని సిఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. గడచిన పదేళ్లలో కాంగ్రెస్ పాలకులు పేదల ఇళ్ల నిర్మాణం పేరిట దాదాపు నాలుగు వేల కోట్లు దిగమింగారని నిప్పులు చెరిగారు. సకల సౌకర్యాలతో పేదలకు ఇళ్లు అందించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు.

06/20/2017 - 01:16

హైదరాబాద్, జూన్ 19: రెండు తెలుగు రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ టీచర్లకు సంబంధించి గత 15 ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న ఏకీకృత సర్వీసు రూల్స్ దస్త్రం ఎట్టకేలకు ప్రధాని వద్దకు చేరింది. ప్రధాని ఆ దస్త్రంపై సంతకం చేయగానే అందుకు సంబంధించిన చర్యలను హోంశాఖ తీసుకోనుంది. అనంతరం అది రాష్టప్రతి భవన్‌కు వెళ్తుంది.

06/20/2017 - 01:15

అమరావతి, జూన్ 19: ఎన్డీయే రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని సిఎం చంద్రబాబు వెల్లడించారు. ‘అత్యున్నత పదవికి జరిగిన అత్యుత్తమ ఎంపిక ఇది’ అని ప్రధాని మోదీతో అన్నారు. సోమవారం మధ్యాహ్నం సిఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్రమోదీ నుంచి ఫోన్ వచ్చింది.

06/20/2017 - 01:10

అమరావతి, జూన్ 19: నీటి భద్రత కల్పిస్తే 90శాతం సమస్యలు పరిష్కారమవుతాని, వృద్ధిరేటులో సుస్థిరత సాధించగలుగుతామని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం తన నివాసం నుంచి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడటంపట్ల సిఎం సంతోషం వ్యక్తం చేశారు.

06/20/2017 - 01:59

హైదరాబాద్, జూన్ 19: డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్ల ద్వారా సీట్ల ఖరారు ప్రక్రియపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు రెండు వారాల పాటు స్టే విధించింది. డిగ్రీ కాలేజీల యజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ ఈ స్టే విధించారు. కేసు తదుపరి విచారణ గురువారం జరగనుంది.
జస్టిస్ భగవతికి నివాళులు

06/19/2017 - 04:23

విజయవాడ (క్రైం), జూన్ 18: నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తీవ్ర మనస్తాపంతో ఓ కుటుంబం బలిదానానికి ఒడిగట్టింది. కృష్ణలంకలో నివాసముంటున్న బొత్స సురేష్ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిపి విషం తాగారు. వీరిలో ముగ్గురు చనిపోగా, ఇద్దరు ఆడపిల్లలు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కుటుంబపరమైన ఆర్థిక ఇబ్బందులే ఈ స్థితికి దారితీశాయని పోలీసులు అంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం..

06/19/2017 - 02:19

హైదరాబాద్, జూన్ 18: ముస్లిం, మైనార్టీలకు విద్యా ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పునరుద్ఘటించారు. మైనార్టీలకు రిజర్వేషన్లను పెంచే అంశాన్ని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో తాను భేటీ అయిన సందర్భంగా ప్రస్తావించినపుడు సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు.

Pages