S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/13/2016 - 02:20

హైదరాబాద్, జూన్ 12:సచివాలయం తరలింపునకు రంగం సిద్ధమైంది. ఫైళ్లు, ఫర్నిచర్, ఇతర సామగ్రి తరలింపునకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆరంచెల విధానాన్ని ఖరారు చేసింది. మరోవైపు సచివాలయంలో ఏపి ఉద్యోగులను ఎవర్ని కదిలించినా, రేపో మాపో తరలిపోక తప్పదనేట్టే మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌కు వీడ్కోలు పలుకుతున్నామనే భావన వారి మాటల్లో కనిపిస్తోంది.

06/13/2016 - 02:17

విశాఖపట్నం, జూన్ 12: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ ఎంతమాత్రం తగదని మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు ఫీజుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్టడీ మెటీరియల్, తదితర ఫీజులతో దోచుకుంటున్నాయన్నారు. ఇక మీదట ప్రైవేటు పాఠశాలల్లో ఏ తరగతికి ఎంత వసూలు చేస్తున్నదీ ఫీజుల వివరాలను వెబ్‌సైట్లో పెట్టాలని ఆదేశించారు.

06/13/2016 - 02:14

రాజమహేంద్రవరం, జూన్ 12: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోంది. తక్షణం వైద్యం అందించాల్సి ఉందని, కానీ అందుకు ముద్రగడ అంగీకరించడం లేదని ఆదివారం హెల్త్ బులిటిన్‌లో వైద్యులు తెలిపారు. ముద్రగడ దంపతులు, కొడుకు గిరి, భార్య సిరి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. గత రాత్రి ముద్రగడ భార్య పద్మావతి, కోడలికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

,
06/13/2016 - 02:09

హైదరాబాద్, జూన్ 12: జేఈఈ అడ్వాన్స్డ్-2016 పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. మిగతా జాతీయ స్థాయి పరీక్షల్లో మాదిరిగానే ఇందులో కూడా తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 100 ర్యాంకుల్లో 30 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉండడం గమనార్హం.

06/13/2016 - 02:01

హైదరాబాద్, జూన్ 12: అమరావతిలో రాజధానిని వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ఇకపై అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలు ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో మూడేళ్ల ముందుగానే ఎన్నికల ప్రచారానికి తెరలేపనున్నారు. అందులో భాగంగానే గడప గడపకూ వైఎస్సార్‌కాంగ్రెస్ నినాదాన్ని అందుకుంటున్నారు.

,
06/12/2016 - 06:50

హైదరాబాద్, జూన్ 11: ఆంధ్రప్రదేశ్‌ను అతలాకులతలం చేస్తున్న కాపు ఆందోళనలో అదే సామాజివర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపి చిరంజీవి, ఆయన తమ్ముడయిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భాగస్వాములు కాకుండా తప్పించుకుని తిరుగుతుండటాన్ని కాపు వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

06/12/2016 - 06:11

హైదరాబాద్, జూన్ 11: దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్‌కౌంటర్ కేసులో తుది నివేదికను జూలై 8వ తేదీలోపల సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం (సిట్)ను ఆదేశించింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన కూలీలు మరణించిన విషయం విదితమే.

06/12/2016 - 06:10

హైదరాబాద్, జూన్ 11: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం రాత్రి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ దాదాపు అర్ధగంటకు పైగా సాగింది. రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు కూడా చంద్రబాబు వెంట ఉన్నట్టు తెలిసింది.

06/12/2016 - 06:09

కర్నూలు, జూన్ 11: పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఫలాలను ఈఏడాది రాయలసీమకు అందజేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనపై సీమరైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు అందించి ఆ ప్రాంతానికి చేరాల్సిన కృష్ణా జలాలను శ్రీశైలంలో నిల్వ చేస్తామని, ఆ తరువాత వాటిని కరవు ప్రాంతాలకు అందిస్తామని సిఎం ప్రకటించారు.

06/12/2016 - 06:09

న్యూఢిల్లీ, జూన్ 11: తెలుగుదేశం ప్రభుత్వం కాపులను దెబ్బతీస్తుంటే సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ ముందుకువచ్చి ఎందుకు వారిని ఆదుకోవటం లేదని సిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ ప్రశ్నించారు. శనివారం విలేఖరులతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ముందుకు వచ్చి హితవులు చెప్పిపోతుంటారని, కాపుల ప్రయోజనాలు కాపాడాలనుకుంటే ఇప్పుడు వారి పక్షాన పోరాడాలని నారాయణ హితవు చెప్పారు.

Pages