S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/16/2017 - 01:38

హైదరాబాద్, జూన్ 15: జాగీర్ భూముల అన్యాక్రాంతంపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. జాగీర్ భూముల క్రయ, విక్రయాలను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్‌ను శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టడానికి వీలుగా ఆర్డినెన్స్‌ను తక్షణం రూపొందించాల్సిందిగా రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గురువారం ఆదేశించారు.

06/16/2017 - 01:36

హైదరాబాద్, జూన్ 15: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు మరో షాక్ తగిలింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు విశ్వవిద్యాలయాలు భారీగా కోత విధించాయి. ఎఐసిటిఇ 250కాలేజీల్లో 1,26,315సీట్లకు అనుమతి ఇవ్వగా, రాష్ట్రంలోని నాలుగు విశ్వవిద్యాలయాలు మాత్రం 192 కాలేజీలకే అనుబంధ గుర్తింపునిచ్చాయి.

06/16/2017 - 01:32

విశాఖపట్నం, జూన్ 15: తెలుగుదేశం ఎంపి జెసి దివాకరరెడ్డిపై ఎయిర్ ఇండియా సహా పలు దేశీయ విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. గురువారం విశాఖ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినందుకు ఆ సంస్థతో పాటుగా ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. జెసి దివాకర్ రెడ్డి గురువారం ఉదయం విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో వెళ్లాల్సి ఉంది.

06/16/2017 - 01:27

అమరావతి, జూన్ 15: తెలుగుదేశం పార్టీలో రోజురోజుకూ పెరుగుతున్న సమన్వయ లోపంపై అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత అజెండాలతో కొందరు నేతలు పార్టీని బజారున పడేస్తున్నారని, ఇకపై ఇలాంటివి సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించేవారిపై ముందుగా చర్యలు తీసుకుని ఆ తరువాత విచారణ చేపడతామని ఆయన అన్నారు.

06/16/2017 - 01:24

విజయవాడ (రైల్వే), జూన్ 15: ప్రతిష్ఠాత్మకమైన 10 రైల్వే ప్రాజెక్టులను ఒకేసారి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించటం హర్షించదగ్గ విషయమని, వీలైనంత త్వరలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను కూడా ప్రకటించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సీఎం చంద్రబాబునాయుడు రైల్వే మంత్రి సురేష్ ప్రభును కోరారు.

06/16/2017 - 01:20

విజయవాడ, జూన్ 15: ఆంధ్రప్రదేశ్ రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయటానికి భారతీయ రైల్వేలతో జాయింట్ వెంచర్ నెరపేందుకు ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో కొత్త రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్‌ల నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు ఈ కార్పొరేషన్ చర్యలు చేపడుతుంది.

06/15/2017 - 02:31

హైదరాబాద్/సిద్దిపేట, జూన్ 14: సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్‌రెడ్డి బుధవారం తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపింది.

06/15/2017 - 02:28

హైదరాబాద్, జూన్ 14: కవిరాజు అమరపురికి తరలివెళ్లిపోయాడు. దివిజకవివరులను అలరించేందుకు మహాకవి దివికేగిపోయాడు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వీయ పర్యవేక్షణలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ఘనంగా జరిగాయి.

06/15/2017 - 02:52

హైదరాబాద్, జూన్ 14: వివాదాస్పద జాగీర్ భూముల కొనుగోలు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలు అక్రమంగా కాజేశారని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన వివాదాస్పద భూముల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు టిఆర్‌ఎస్ ముఖ్యనేత, ఎంపి కేశవరావు ప్రకటించారు.

06/15/2017 - 04:34

అమరావతి, జూన్ 14: రాష్ట్రంలో రైతులపై పెట్టుబడి భారం లేకుండా ప్రకృతి సేద్యం ద్వారా నాణ్యమైన, ఆరోగ్యవంతమైన, వ్యవసాయ దిగుబడులు అధికంగా సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ విధానాలను విస్తృత స్థాయిలో అమలు పరచాలని నిర్ణయించారు.

Pages