S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/13/2017 - 04:02

హైదరాబాద్, జూన్ 12: డాక్టర్ సినారె అధ్యాపకుడిగా, బహుభాషావేత్తగా, కవిగా, సినీ రచయితగా, ఎంపీగా పనిచేశారు. తెలుగు యూనివర్శిటీకి, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా వ్యవహరించారు. ఏ బాధ్యత తీసుకున్నా ఆ పదవికి వనె్న తెచ్చే రీతిలో వ్యవహరించారు.

06/13/2017 - 03:58

హైదరాబాద్, జూన్ 12: సినారె కన్నుమూశారన్న వార్తకు ప్రనుఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.. సినారె పార్థివదేహానికి మాజీ గవర్నర్ కె రోశయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

06/13/2017 - 03:55

వేములవాడరూరల్, జూన్ 12: తాను ఎంత పెద్దస్థాయిలో ఉన్నా కన్నఊరు మాత్రం మరువలేదు..సింగిరెడ్డి నారాయణరెడ్డి. అంచలంచెలుగా ఎదిగి ..హైదరాబాద్‌లో స్థిరపడిన ..గ్రామ ప్రజలపై మమకారం మాత్రం మార్చిపోలేదు. తన స్వంత ఇంటిని గ్రామానికి ధారాదత్తం చేశారు. ఇంటిని గ్రంథాలయంగా మార్చి అప్పటి సర్పంచ్ తీగల రవీందర్‌గౌడ్‌కు అప్పగించారు రెండు వ్యానుల పుస్తకాలను గ్రామ గ్రంథాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంచారు.

06/13/2017 - 03:52

సిరిసిల్ల, జూన్ 12: సిరిసిల్ల గడ్డపై పురుడు పోసుకుని జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించి, పుట్టిన ఊరుకు, నీడ నిచ్చిన ప్రాంతానికి పేరు తీసుకవచ్చిన సింగిరెడ్డి సత్యనారాయణరెడ్డి కళ్ళు మూసిన వార్త..సిరిసిల్ల పూర్వ పాత తాలూకా నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకాన్ని దుఃఖ సాగరంలో ముంచెత్తింది. సాహితీ లోకం పెద్ద దిక్కును కోల్పోయింది. అతడి అడుగు జాడల్లో పయనిస్తూ..

06/13/2017 - 03:48

ఖమ్మం/హైదరాబాద్, జూన్ 12: పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్యగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య సోమవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు తీసుకున్న ఆయనకు ఆదివారం రాత్రి తీవ్ర గుండెపోటు రావటంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

06/13/2017 - 02:33

హైదరాబాద్, జూన్ 12: శ్రీమంతుడు సినిమా కథ వివాదానికి సంబంధించిన కేసులో నటుడు మహేష్‌బాబు వ్యక్తిగతంగా హాజరుకావల్సిందేనని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. తాను రాసిన చచ్చేంత ప్రేమ నవల కాపీ చేసి శ్రీమంతుడు సినిమా తీశారంటూ రచయిత శరత్‌చంద్ర గతంలో నాంపల్లి కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు.

06/13/2017 - 02:32

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణలో గ్రూప్-2 నియామక ప్రక్రియపై హైకోర్టు సోమవారం నాడు స్టే విధించింది. మూడు వారాల వరకూ నియామక ప్రక్రియ చేపట్టవద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైట్‌నర్‌తో దిద్దిన జవాబుపత్రాలను పరిగణనలోకి తీసుకున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ విచారణ చేపట్టింది.

06/13/2017 - 01:50

హైదరాబాద్, జూన్ 12: మెడికల్, డెంటల్ కోర్సుల్లో చేరేందుకు సిబిఎస్‌ఇ నిర్వహించిన (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్టు) -నీట్ 2017 ఫలితాలు విడుదల చేసేందుకు మార్గం సుగమమైంది. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 12 లక్షల మంది అభ్యర్ధులకు ఊరటనిస్తూ సుప్రీంకోర్టు జస్టిస్ పిసి పంత్, జస్టిస్ దీపక్ గుప్తలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది.

06/13/2017 - 01:49

విజయవాడ, జూన్ 12: విశాఖపట్నం భూకుంభకోణంపై సిఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల ఆక్రమణలపై సోమవారం రాత్రి జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రెవెన్యూ, పోలీసు, న్యాయ నిపుణులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

06/13/2017 - 01:43

సాహితీరంగంలో సినారె చేసిన కృషి మర్చిపోలేనిది. ఆధ్యాపకుడిగా, సాహితీవేత్తగా, కవిగా, గేయ రచయితగా, రాజ్యసభ సభ్యుడిగా ఆయన కృషి బహుముఖం. జ్ఞానపీఠ్‌కే ఒక గౌరవం తెచ్చిన తెలంగాణ బిడ్డ సినారె.
-సిఎం కెసిఆర్

Pages