S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/11/2017 - 03:05

హైదరాబాద్, జూన్ 10: ధాన్యం సేకరణకు ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని, ఎప్పటికప్పుడు రైతులకు చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ధాన్యం సేకరణకు నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు. మరో వెయ్యి కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

06/11/2017 - 02:45

హైదరాబాద్, జూన్ 10: ఎన్నికల కేబినెట్ విస్తరణలోనైనా తమకు స్థానం దొరుకుతుందేమోనని పలువురు తెరాస ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా 21 నెలల గడువుంది. మూడేళ్ల క్రితం ఏర్పడిన మంత్రివర్గంలో పెద్దగా మార్పులు లేకుండా కొనసాగిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను తొలగించి కడియం శ్రీహరికి ఆ స్థానమివ్వడం మినహా ఎలాంటి మార్పులూ లేవు.

06/11/2017 - 02:41

విజయవాడ, జూన్ 10: గుంటూరు ట్రెజరీలో బయటపడిన స్కాలర్‌షిప్‌ల కుంభకోణం తాలూకు ప్రకంపనలు ఇతర జిల్లాలకూ వ్యాపించాయి. పశ్చిమగోదావరి, నెల్లూరు, విజయనగరం తదితర జిల్లాల ట్రెజరీల్లో స్కాలర్‌షిప్‌ల కుంభకోణం జరిగినట్టు సమాచారం రావటంతో విచారణకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలో కమిటీలు ఏర్పాటు చేసి కుంభకోణాలపై విచారణ జరపనున్నట్టు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.

06/11/2017 - 02:40

విశాఖపట్నం, జూన్ 10: రేషనలైజేషన్ పేరిట పాఠశాలల మూసివేత, ఉపాధ్యాయ బదిలీల్లో ఆన్‌లైన్ విధానం రద్దు అంశాలపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని శనివారం ముట్టడించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉపాధ్యాయుల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.

06/11/2017 - 02:39

విజయవాడ, జూన్ 10: ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని పరికిస్తే, రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలల్లో తెలుగుమీడియం ఎత్తివేసినట్లుగానే కనిపిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి తెలుగు మీడియం పుస్తకాల కోసం అసలు ఇండెంటే పెట్టకపోవడంతో ఇక మున్సిపల్ పాఠశాలల్లో తెలుగుమీడియం నిలిపివేసినట్టుగానే భావించవచ్చు.

06/11/2017 - 02:37

విజయవాడ, జూన్ 10: రాజధానిలో నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్, సబ్ ఆర్టేరియల్ రోడ్ల నిర్మాణంలో జాప్యాన్ని ఇక ఏ మాత్రం సహించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పనులు నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తిచేసేలా నిర్మాణ సంస్థలకు అల్టిమేటం ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. చెప్పిన సమయంలోగా పనులు పూర్తిచేయని నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.

06/11/2017 - 02:35

హిందూపురం, జూన్ 10: ఇకపై టెట్రాప్యాక్‌లలో మద్యం విక్రయిస్తామని, దీని వల్ల కల్తీకి ఆస్కారం ఉండదని ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్ అన్నారు. అక్రమ, కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్ పేర్కొన్నారు. సిఎం చంద్రబాబు కూడా ఈ విషయమై కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు.

06/11/2017 - 02:30

హైదరాబాద్, జూన్ 10: అనుకున్నట్లుగానే ఆంధ్ర, తెలంగాణ మధ్య విద్యుత్ సరఫరా బంద్ అయింది. ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చే 1200 మెగావాట్ల విద్యుత్‌ను నిలిపివేస్తున్నట్లు ఏపి ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఈ విషయమై పునస్సమీక్షించే ప్రసక్తిలేదన్నారు. తమకు రావాల్సిన రూ.4500 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంపై ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

06/11/2017 - 02:27

హైదరాబాద్, జూన్ 10: అప్పులు తీరలేదు. చర్చల్లో పరిష్కారం లభించలేదు. రెండు రాష్ట్రాలు ఢిల్లీ జోక్యం చేసుకుని అప్పుల సమస్యను తీరుస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదం హాట్ హాట్‌గా నడుస్తోంది. 11వ తేదీ నుంచి విద్యుత్‌ను తెలంగాణకు నిలుపుదల చేస్తామని ఆంధ్ర ప్రకటిస్తే, తమ నుంచి ఆంధ్రాకు వెళ్లే విద్యుత్‌ను బంద్‌చేస్తామని తెలంగాణ ప్రకటించింది.

06/10/2017 - 02:35

హైదరాబాద్, జూన్ 9: గోవులు, పశుగణాలను వధించినా, గాయపరిచినా నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసే విధంగా ఐపిసి సెక్షన్ 429కు సవరణలు చేయాలని హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. ఐపిసి సెక్షన్‌కు సవరణలు చేసే విధంగా ఒక నెల రోజులు గడువు ఇచ్చింది. జూలై 7వ తేదీలోగా రెండు రాష్ట్రాలు తమ ఆదేశాలను పాటించాలని కోరింది.

Pages