S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/08/2017 - 02:40

విజయవాడ, జూన్ 7: శాసనసభా భవనంపై ఏసీ పైప్ కట్ చేయడం వల్లే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఛాంబర్‌లోకి వర్షపు నీరు చేరినట్టు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్థారించారు. వెలగపూడిలోని శాసనసభా భవనంపైన ఏసీ పైప్ కట్ చేసిన ప్రాంతాన్ని బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధులకు స్పీకర్ చూపించారు. సంఘటనపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. పైప్‌లైన్‌ని ఎవరో కావాలనే కట్ చేసినట్టు కనిపిస్తోందన్నారు.

06/08/2017 - 02:37

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణ రాష్ట్రంలో బిఇడి, డిఇడి కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థుల కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. టెట్ నిర్వహణ, తర్వాత డిఎస్‌సి నిర్వహణకు సంబంధించి విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

06/08/2017 - 02:36

హైదరాబాద్, జూన్ 7: ఫార్మా రంగంలోనే నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన హైదరాబాద్ సిగలో ఇదే రంగానికి చెందిన మరో కలికితురాయి చేరబోతుంది. దేశ విదేశాలకు ఇక్కడ తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్స్ (ఔషధ ఉత్పత్తులు) ఎగుమతి అవుతున్నప్పటికీ, వైద్య పరికరాలను మాత్రం విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది.

06/07/2017 - 03:21

హైదరాబాద్, జూన్ 6: రెండవ తరగతి నుంచే పాఠ్య పుస్తకాల్లో పర్యావరణం అంశాన్ని చేర్చి విద్యార్థులకు బోధిస్తున్నట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు హైదరాబాద్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చాయి. పర్యావరణంపై తప్పనిసరిగా బోధించాల్సి ఉండగా, ఉభయ రాష్ట్రాలు బోధించడం లేదని టి ధన్‌గోపాల్‌రావు పిటిషన్ దాఖలు చేశారు.

06/07/2017 - 03:19

హైదరాబాద్, జూన్ 6: పర్యావరణ పరిరక్షణకు జీవో 111ను ప్రభుత్వం విడుదల చేసినా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి 10 కి.మీ పరిధిలో భారీ నిర్మాణాలు ఎలా వచ్చాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్వాలిటీ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది. నిషేధిత ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీల భవనాలు వెలిశాయంటూ పిల్ దాఖలైంది.

06/07/2017 - 02:58

రాష్టవ్య్రాప్తంగా గత కొంతకాలంగా ప్లాస్టిక్ బియ్యంపై కలకలం రేగుతోంది. అదే తరహలో కోడి గుడ్లు, మిర్చి, క్యాబేజీపైనా ప్లాస్టిక్ అనుమానాలు రేకెత్తుతున్నాయి. హైదరాబాద్ మీర్‌పేట్‌లోని నందనవనంలో మంగళవారం ప్లాస్టిక్ బియ్యం విక్రయాలు బయటపడడంతో నగర వాసులు వామ్మో.. ప్లాస్టిక్ బియ్యమా? అంటూ బెంబేలెత్తిపోతున్నారు. అశోక్ అనే వ్యక్తి ఫిర్యాదుమేరకు అధికారులు స్పందించారు.

06/07/2017 - 02:57

హైదరాబాద్, జూన్ 6: ‘కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నా ప్రాజెక్టుల నిర్మాణం ఎట్టి పరిస్థితులలో ఆగదు’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సుందిళ్ల బ్యారేజీ పనుల నిలిపివేతకు సుప్రీంకోర్టు స్టే నిరాకరించడం ప్రగతి నిరోధకులకు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు.

06/07/2017 - 02:40

హైదరాబాద్, జూన్ 6: భూకబ్జా కేసులో తెలుగు దేశం ఏపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి సహకరించిన న్యాయవాదిని, మరో బ్రోకర్‌నూ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లో విలువైన భూమిని కబ్జా చేసినట్టు ఆ భూమి యజమాని లోగడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సిసిఎస్ పోలీసులు ఇదివరకే ఆయనకు నోటీసు పంపించినప్పటికీ, స్పందించలేదని తెలిసింది.

06/07/2017 - 02:37

విశాఖపట్నం, జూన్ 6: గిరిజనుల సమగ్రాభివృద్ధికి గిరిజన సంస్కరణ కొలబద్ద (ట్రై) పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖ ఏజెన్సీ పెదలబుడు పంచాయతీని సిఎం చంద్రబాబు దత్తత తీసుకున్నారు. ఆ పంచాయతీలో మంగళవారం ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. భారీవర్షాల కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన హాజరు కాలేకపోయారు.

06/07/2017 - 02:34

విజయవాడ, జూన్ 6: రాష్టవ్య్రాప్తంగా గత నెల రోజులుగా ఎంతో ఉత్కంఠకు గురిచేసిన ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి ఆర్‌సి నెం190తో మంగళవారం విడుదల చేశారు. ప్రక్రియ ఈనెల 9న ప్రారంభమై 30తో ముగుస్తుంది. బదిలీ అయిన టీచర్లు జూలై 1నాటికి కొత్త పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది.

Pages