S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/07/2017 - 02:33

హైదరాబాద్, జూన్ 6: ఆంధ్ర, తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిల రగడ రాజుకుంది. రూ.3100 కోట్లు బకాయిలను తెలంగాణ జెన్కో తక్షణం చెల్లించని పక్షంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ జెన్కో నోటీసులు జారీ చేసింది. ఈ సమస్యను సామరస్య పూర్వకంగా చర్చించి పరిష్కరించేందుకు సిద్ధమని తెలంగాణ విద్యుత్ శాఖ ప్రకటించింది.

06/07/2017 - 02:31

అమరావతి, జూన్ 6: రాజుల సొమ్ము రాళ్లపాలయినట్టు, జనం సొమ్ము బడా కంపెనీల పాలవుతోంది. అతి తక్కువ కాలంలోనే తాత్కాలిక సచివాలయం, శాసనసభ నిర్మాణం జరిపామని ప్రచారం చేసుకున్న ప్రభుత్వం డొల్లతనాన్ని భారీ వర్షం బయటపెట్టింది.

06/07/2017 - 02:27

హైదరాబాద్, జూన్ 6: నైరుతీ రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. మంగళవారం కేరళ, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. గత మూడురోజుల్లో పెద్దగా కదలికలేని రుతుపవనాల్లో మళ్లీ కదలిక మొదలైంది.

06/06/2017 - 01:35

న్యూఢిల్లీ, జూన్ 5: పార్లమెంటు, శాసనసభలు, తదితర చట్ట సభల్లో బిసిలకు యాభై శాతం సీట్లు రిజర్వు చేసేందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు సహకరించాలని జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య 18 రాజకీయ పార్టీల నాయకులను కోరారు. కృష్ణయ్య నాయకత్వంలో బిసి సంఘం నాయకులు సోమవారం ఢిల్లీలో 18 రాజకీయ పార్టీల నాయకులను కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు.

06/06/2017 - 01:33

న్యూఢిల్లీ, జూన్ 5: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌజ్ నిర్మాణ పనులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జూలై రెండోవారానికి వాయిదా వేస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. గతంలో సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌజ్ నిర్మాణ పనులను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.

06/06/2017 - 01:32

హైదరాబాద్, జూన్ 5: నియోజకవర్గ ప్రజలు వద్దంటే ఆయా ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వొద్దన్న ఆలోచనలో తెరాస కనిపిస్తోంది. విజయం దక్కాలంటే జనంమాటే పార్టీ పాటగా ముందుకెళ్లాలన్న యోచనతో అడుగులేస్తోంది. ఈ ప్రాతిపదికన దాదాపు 20 నుంచి 30మంది ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో మార్చే అవకాశం ఉందని అంటున్నారు.

06/06/2017 - 01:30

అమరావతి, జూన్ 5: టిడిపి జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు మళ్లీ పాత ధోరణిలోనే వెళ్తున్నారన్న అసంతృప్తి శ్రేణుల్లో పెరుగుతోంది. గతంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికే ప్రాధాన్యం ఇచ్చి, పార్టీని పట్టించుకోని కారణంగా ఎదురైన చేదు ఫలితాలను వారు గుర్తు చేస్తున్నారు.

06/06/2017 - 01:29

అమరావతి, జూన్ 5: హత్య చేసినోళ్లే పూలదండలతో వస్తున్నారని అంటూ, ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని తెదేపా జాతీయాధ్యక్షుడు, సిఎం చంద్రబాబు పార్టీ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. సోమవారం తన నివాసం నుంచి పార్టీ నేతలు, మండల, జిల్లా, రాష్ట్ర పార్టీ బాధ్యులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైకాపా బలహీనపడటంతో కాంగ్రెస్ బలపడాలని చూస్తోందని రాహుల్‌గాంధీ సభను ఉద్దేశించి అన్నారు.

06/05/2017 - 04:14

హైదరాబాద్, జూన్ 4: వైద్యులు సేవాదృక్పథంతో పని చేయాలని కేం ద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. స్వర్ణ భారతి ట్రస్టు ఆదివారం ఏర్పా టు చేసిన మెగా వైద్య శిబిరాన్ని వెంక్య్య నాయుడు ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సేవాధృక్ఫథంతోనే రోగులకు సేవలందించాలని అన్నారు.

06/05/2017 - 04:10

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణలో రైతులంతా నాట్లు వేయటానికి సిద్ధమైపోయారు. ఎప్పుడెప్పుడు వానలు వస్తా యా అని ఎదురుచూస్తున్నారు. నైరుతీ రుతుపవనాలు రాగానే వర్షాలు ప్రారం భం అవుతాయని, వెంటనే విత్తనాలు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. అనుకున్న ప్రకారం జూన్ ఏడోతేదీ లోగా వర్షాలు వస్తే తక్షణమే విత్తనాలు వేసే అవకాశం ఉంది. మే 25 న ప్రారంభమైన రోహిణీ కార్తె జూన్ 7 వరకు ఉంటుంది.

Pages