S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/16/2017 - 23:38

హైదరాబాద్, మే 15: తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో పంటలకు వర్షపునీటిని అందించే నైరుతీరుతుపవనాలు ఒకటి రెండు రోజులు ఇటుఅటుగా జూన్ 10 న ఎపిలోని అనంతపురం, తెలంగాణలోని జోగులాంబ, మహబూబ్‌నగర్ జిల్లాలను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (హైదరాబాద్ కేంద్రం) అంచనావేస్తోంది. ఉభయ రాష్ట్రాల్లో ప్రవేశించిన తర్వాత మూడు, నాలుగు రోజుల్లో ఇవి రెండు రాష్ట్రాల్లోనూ విస్తరించే అవకాశాలు ఉన్నాయి.

05/16/2017 - 02:23

హైదరాబాద్, మే 15: రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో సిటిజన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయాలని, వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు అధికారులనుఆదేశించారు. సిఎండిఎలో రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ కమిషనర్లతో కెటిఆర్ సోమవారం సమావేశమయ్యారు.

05/16/2017 - 02:21

హైదరాబాద్, మే 15: ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నా చౌక్ తరలింపు చిన్న విషయమే అయినా, ప్రభుత్వాన్ని బదనామ్ చేయడమే పనిగా పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా వామపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సిఎం కెసిఆర్ గవర్నర్ నరసింహన్‌కు వివరించారు.

05/16/2017 - 02:19

హైదరాబాద్, మే 15: ధర్నాచౌక్ దద్దరిల్లింది. ధర్నాచౌక్ ఆక్రమణకు ర్యాలీగా తరలివచ్చిన వామపక్షాలు స్థానికులు అడ్డుకోవడంతో ఇందిరాపార్క్ ప్రాంతం అట్టుడికింది. రెండు వర్గాలూ పోటాపోటీగా నినాదాలు, నిరసనలకు దిగడంతో కొద్దిసేపు గందరగోళం తలెత్తింది. రెండువర్గాలు బాహాబాహీకి దిగటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోటాపోటీ ఆందోళనలతో ధర్నాచౌక్ సోమవారం అట్టుడికింది.

05/16/2017 - 01:47

విశాఖపట్నం, మే 15: వెయ్యి కోట్ల రూపాయల హవాలా కేసును నగర పోలీసులు సిఐడికి అప్పగించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వడ్డి మహేష్‌ను సోమవారం నాలుగో అదనపుప్రధాన మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. అలాగే ఆదాయ పన్ను శాఖ తయారు చేసిన రికార్డులను కూడా కోర్టుకు సమర్పించారు. వెంటనే ఈ కేసును సిఐడికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నగరానికి చేరుకున్న అమిత్‌గార్గ్

05/16/2017 - 01:47

విజయవాడ, మే 15: ఆంధ్రప్రదేశ్ వస్తు సేవల పన్ను (జిఎస్టీ) ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఒప్పంద ఉద్యోగుల వేతనాన్ని 50 శాతం పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అసెంబ్లీలో జిఎస్టీ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో లాంఛనంగా కేబినెట్‌లో పెట్టి ఆమోదం తెలిపారు.

05/16/2017 - 01:44

విజయవాడ, మే 15: సింగపూర్ ప్రభుత్వంతో కలిసి అమరావతిని ప్రజా రాజధానిగా మారుద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి.. సింగపూర్‌లా ఉండాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కన్సార్టియంతో విజయవాడలో సోమవారం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.

05/16/2017 - 01:38

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 15: ఉపాధ్యాయ బదిలీలు, హేతుబద్ధీకరణ అంశాలపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నతాధికారులతో సమీక్షించారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సుదీర్ఘ సమీక్ష జరిగింది. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్‌పై 17న ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు సమావేశమై కేంద్రాన్ని కలవనున్నట్లు మంత్రి ఈసందర్భంగా తెలిపారు.

05/16/2017 - 01:38

విజయవాడ, మే 15: దేశం అంతటా ఒకే పన్నుల విధానం అమలుల్లోకి తీసుకువచ్చే చర్యల్లో భాగంగా పార్లమెంట్ ఆమోదించిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో చర్చించనున్నారు. ఈ బిల్లుపై చర్చించి, అమోదించేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి మంగళవారం సమావేశం కానున్నాయి. జిఎస్‌టికి సంబంధించిన నాలుగు అంశాలపై చర్చిస్తారు. ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది.

05/16/2017 - 02:26

అమరావతి, మే 15: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిల మధ్య ఇటీవల జరిగిన భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. మోదీని కలిసిన సందర్భంలో జగన్ ఇచ్చారని భావిస్తున్న వినతిపత్రం ఒక పత్రిక-చానెల్‌కు లీకు కావడం పెను దుమారానికి దారి తీసింది. రాష్ట్ర సమస్యల పరిష్కారం పేరుతో మోదీని ఈనెల 10న ప్రధానిని కలిసిన జగన్..

Pages