S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/23/2017 - 08:47

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ రాష్ట్రానికి అప్పులు పెరుగుతున్నాయి గాని ఆస్తులు పెరగడం లేదని టిటిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. 2014 జూన్ నాటికి రూ.79,880 కోట్ల అప్పులు ఉంటే 2017 నాటికి లక్షా 37 వేల కోట్లకు పెరిగాయని, అదేస్థాయిలో ఆస్తులు మాత్రం పెరగలేదని అన్నారు.

03/23/2017 - 08:39

విజయవాడ(బెంజిసర్కిల్), మర్చి 22: బాలకృష్ణ ఎంతో మంచోడు అంటూ..ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కితాబిచ్చారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం ఎదురుపడిన తెదేపా ఎమ్మెల్యే కదిరి బాబూరావు, జగన్‌ల మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. తెదేపా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంచోడని జగన్ కొనియాడడంతో నిజమే అని బాబూరావు సమాధానం చెప్పారు.

03/23/2017 - 08:38

హైదరాబాద్, మార్చి 22: ప్రజల డిపాజిట్లను స్వాహా చేసిన అక్షయ గోల్డ్ కంపెనీ వ్యవస్థాపక డైరెక్టర్లను ఎందుకు అరెస్టు చేయలేదని, ఈ వ్యవహారంపై వచ్చే సోమవారంలోగా హైకోర్టుకు పూర్తి సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆంధ్ర సిఐడి అధికారులను ఆదేశించింది. కర్నూలుకు చెందిన రామ మాదయ్య, గుంటూరుకు చెందిన పూర్ణచంద్రరావు దాఖలు చేసిన రెండు వేరువేరు పిల్స్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

03/22/2017 - 02:39

హైదరాబాద్, మార్చి 21: గోల్కొండ వద్ద గోల్ఫ్‌కోర్స్‌కు అనుమతి ఇవ్వడంపై హైదరాబాద్ హైకోర్టులో మంగళవారం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ శమీమ్ అఖ్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ డాక్టర్ లుబ్న సర్వత్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది.

03/22/2017 - 02:06

హైదరాబాద్/ ఖైరతాబాద్, మార్చి 21: ఐఏఎస్ అధికారి ఇంటి డ్రైవర్ నాగరాజు హత్య కేసులో చిక్కుముడి వీడింది. నాగరాజు హత్యపై రెండు రోజులపాటు విచారణ కొనసాగింది. ఎట్టకేలకు డ్రైవర్ నాగరాజును ఐఏఎస్ అధికారి కొడుకు వెంకట్ సుక్రునాయక్ హత్య చేసినట్టు పోలీసులు నిర్థారించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో ఐఏఎస్ అధికారి ధరావత్ వెంకటేశ్వర్లు ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

03/22/2017 - 02:04

హైదరాబాద్, మార్చి 21: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్ర బడ్జెట్ నిర్మాణం మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప ప్రణాళిక పద్దును బడ్జెట్ ప్రతిపాదనల నుంచి తొలగించారు. దీంతో ఉప ప్రణాళికకు కేటాయించే నిధులు ఇకనుంచి ప్రత్యేక నిధి కింద కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం బిల్లు రూపొందించింది.

03/22/2017 - 02:01

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులను అడ్డుకోవద్దంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు కోరారు. రాష్ట్ర శాసనసభలో నీటిపారుదల ప్రాజెక్టులపై సోమవారం జరిగిన చర్చలో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కేవలం శంకుస్థాపనలకే ప్రాజెక్టులను పరిమితం చేశారని ఆరోపించారు.

03/22/2017 - 02:00

విజయవాడ (పటమట) మార్చి 21: అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం టిడిపి, వైకాపా మహిళా ఎమ్మెల్యేలు తోపులాటకు దిగి రగడ సృష్టించారు. మహిళా సమస్యలను టిడిపి ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తోందంటూ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యేలు అనిత, మీసాల గీత, తంగిరాల సౌమ్య మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతుండగా వైకాపా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కళావతి, పుష్ప శ్రీవాణి, రాజేశ్వరి అక్కడికి చేరుకున్నారు.

03/22/2017 - 01:54

తిరుపతి, మార్చి 21: శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు నకిలీ విఐపి టికెట్లు అందించి అడ్డదారుల్లో కోట్లు దండుకున్న వారి పాపం పండింది. తిరుమల వన్‌టౌన్ సిఐ వెంకటరవి ఈ దళారీల ముఠా గుట్టు రట్టు చేశారు. తొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. వీరికి అన్ని రకాలుగా సహకరించిన టిటిడిలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ధర్మయ్య పరారీలో ఉన్నాడు.

03/22/2017 - 01:51

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 20: ఇటీవల మండలికి స్థానిక సంస్థల నియోజకవర్గాలనుంచి జరిగిన ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఫలితాలపై కాలు దువ్వుకుంటున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పరస్పరం విమర్శల పదును పెంచిన క్రమంలో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.ప్రస్తుతం ఇదే విషయంపై జరిగిన మాటల యుద్ధం సభాహక్కుల సంఘం చెంతకు చేరింది.

Pages