S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/22/2017 - 01:19

గుంటూరు, మార్చి 21: శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన సభలోకి ప్రవేశించిన సమయంలో ‘అవినీతిలో నెంబర్ వన్’.. అంటూ వైసిపి సభ్యులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాబు ఆగ్రహిస్తూ సభలో నేరస్థులు ప్రవేశించటం దురదృష్టకరమన్నారు. రౌడీయిజం తనదగ్గర సాగదని ఆయన హెచ్చరించారు.

03/22/2017 - 00:15

విజయవాడ, మార్చి 21: రెండు రోజులుగా నవ్యాంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీల్లో సర్వర్లు పనిచేయకపోవటంతో ప్రజానీకం ఇబ్బందుల పాలైంది. నిజానికి నాలుగు రోజులుగా తరచూ సర్వర్లు పనిచేయలేదు. అయితే సోమవారం ఉదయం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తిగా పనిచేయలేదు. దీనివల్ల వెబ్ చలానాలు వెళ్లక ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

03/22/2017 - 00:14

హైదరాబాద్/చాంద్రాయణగుట్ట, మార్చి 21: కోలిండియా వేతనాలు, బోనస్, కార్మికుల చట్టాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 15 నుండి చేపట్టిన సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మెలో జోక్యం చేసుకోవాలని సెంట్రల్ అండ్ స్టేట్ కార్మిక సంఘాలు రీజినల్ లేబర్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశాయ.

03/21/2017 - 03:11

ఖమ్మం, మార్చి 20: తమ గ్రామం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, నీరులేక అల్లాడుతున్నా స్పందించడంలేదంటూ ఓ రైతు గ్రామంలోని చెరువులోనే సోమవారం దీక్ష చేపట్టాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బస్వాపురం గ్రామానికి చెందిన కొండల్‌రావు తమ గ్రామంలోని చెరువుకు నీరు విడుదల చేయడం లేదని, పంటలు ఎండిపోతున్నా స్పందించడం లేదని అధికారుల తీరుపై మండిపడ్డాడు.

03/21/2017 - 01:43

హైదరాబాద్, మార్చి 20: దేశంలో అసలైన కమ్యూనిస్టు నాయకుడు కెసిఆర్ అని ఐటి మంత్రి కె తారక రామారావు వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లాకు చెందిన సిపిఎం నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తెలంగాణ భవన్‌లో సోమవారం తెరాస పార్టీలో చేరారు. సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి, బహిరంగ సభ నిర్వహించిన మరుసటి రోజే సిపిఎం శ్రేణులు తెరాసలో చేరడం విశేషం.

03/21/2017 - 01:41

హైదరాబాద్, మార్చి 20: రాష్ట్రంలో ఇంకా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేని గ్రామాలు 13 వందల వరకూ ఉన్నాయని అసెంబ్లీలో రవాణా మంత్రి పి మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఆయా గ్రామాలకు త్వరలోనే బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు ప్రకటించారు. పెద్ద సంఖ్యలో కొత్త బస్సులు ఉన్నాయని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాటిని ఇంకా ప్రారంభించలేదని వెల్లడించారు.

03/21/2017 - 01:40

హైదరాబాద్, మార్చి 20: ఐఏఎస్ అధికారి ఇంటి డ్రైవర్ నాగరాజు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించి డ్రైవర్ నాగరాజును హత్య చేసింది ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు కొడుకేనని గుర్తించారు. యూసుఫ్‌గూడలోని సాయికళ్యాణ్ అపార్టుమెంట్‌లో ఈనెల 17న డ్రైవర్ నాగరాజు హత్యకు గురైన సంగతి తెలిసిందే.

03/21/2017 - 01:38

హైదరాబాద్, మార్చి 20:తెలంగాణ ఆవిర్భావం , టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఎన్నికల్లోనూ పార్టీకి ఎదురు లేకుండా పోయింది. అయితే కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థుల పనితీరు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉండడంతో దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి సారించారు.

03/21/2017 - 01:31

విజయవాడ, మార్చి 20: విజయవాడ పరిధిలో ఇళ్ల అద్దెలు భరించలేనంతగా ఉంటున్నాయని, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పలువులు ఎమ్మెల్సీలు కోరారు. కిందిస్థాయి ఉద్యోగులు అద్దెలు భరించలేక, చెల్లించలేక ఏడుస్తున్నారంటూ మండలి చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. శాసనమండలిలో సోమవారం నాటి ప్రశ్నోత్తరాల సమయంలో విజయవాడలో ఇళ్ల అద్దెల గురించి ఎమ్మెల్సీ జి తిప్పేస్వామి ప్రస్తావించారు.

03/21/2017 - 01:27

విజయవాడ, మార్చి 20: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ స్థానాలు మూడింటిలోనూ టిడిపి కైవసం చేసుకుంది. అయితే ఉపాధ్యాయులు, పట్ట్భద్రుల నియోజకవర్గాల్లో అధికారపక్షానికి ఎదురుగాలి వీస్తోంది. ఇక్కడ ప్రతిపక్ష అభ్యర్థులు విజయపథంవైపు దూసుకెళుతున్నారు. అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Pages