S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/16/2016 - 02:42

హైదరాబాద్, ఫిబ్రవరి 15: విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ నియమాకానికి సంబంధించి ఎపి ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటో చెప్పాలని హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ భోసలే, జస్టిస్ నవీన్‌రావులతో కూడిన బెంచ్ ఆదేశించింది.

02/16/2016 - 02:42

హైదరాబాద్, ఫిబ్రవరి 15 : విశాఖపట్నంలో కనె్వన్షన్ సెంటర్ నిర్మించేందుకు సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయానికి చెందిన 10 ఎకరాల భూమిని లీజుపై ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఏటా 96,80,000 రూపాయల అద్దె చెల్లించే ప్రాతిపదికపై ఎపిఐఐసి (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కి భూమిని అందచేసేందుకు వీలుగా దేవాదాయ కమిషనర్‌కు ప్రభుత్వం అధికారం కల్పించింది.

02/16/2016 - 02:16

గుంటూరు, ఫిబ్రవరి 15: ఆసియా ఖండంలోనే పెద్దదైన గుంటూరు మిర్చియార్డుకు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు భారీ ఎత్తున మిర్చిబస్తాలను తీసుకొచ్చారు. సోమవారం ఒక్కరోజే లక్షా 21వేల 254 బస్తాలను రైతులు యార్డుకు తరలించారు. మిర్చి ధర ఆశాజనకంగా ఉండటంతో కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచిన మిర్చిని రైతులు అమ్మకానికి పెద్దఎత్తున యార్డుకు తీసుకొచ్చారు.

02/16/2016 - 02:15

గుంటూరు, ఫిబ్రవరి 15: జాలర్లు ఆధునికతను సంతరించుకుని అభివృద్ధి బాటలో పయనించాలని అఖిల భారత క్షత్రియ సంఘం అధ్యక్షుడు డా. గజేంద్ర భాన్జీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సోమవారం పర్యటించిన జాలర్ల కుటుంబాలను కలిశారు. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో జాలర్లతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల నిధులను జాలర్ల అభివృద్ధికి కేటాయించిందని తెలిపారు.

02/16/2016 - 01:20

హైదరాబాద్/కర్నూలు, ఫిబ్రవరి 15: సియాచిన్ మంచుకొండల ప్రమాదంలో అమరుడైన వీర సైనికుడు ముస్తాఖ్ అహ్మద్ భౌతికకాయం సోమవారం అర్థరాత్రి ఆయన స్వగ్రామమైన కర్నూలు జిల్లా పార్నపల్లికి చేరుకుంది. అహ్మద్ భౌతికకాయానికి మంగళవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. తొలుత వీర జవాన్ భౌతిక కాయం ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది.

02/16/2016 - 01:20

హైదరాబాద్, ఫిబ్రవరి 15: హైదరాబాద్ నగరంలో ఎన్‌ఆర్‌ఐల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులోని ఎల్‌బినగర్‌లో శ్రవణ్ కుమార్ అనే యువకుడు మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా సంప్రదించి వరంగల్‌కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు కట్నకానులతో ఘనంగా వివాహం జరిపించారు.

02/16/2016 - 01:19

సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ హామీ

02/16/2016 - 01:19

శ్రీకాకుళం, ఫిబ్రవరి 15: కాయకష్టంతో రోజంతా పనిచేసి సంపాదించుకున్న మొత్తాన్ని మద్యం కోసం ఖర్చు చేసి కుటుంబాలను పేదరికంలోకి నెట్టేసే తాగుబోతులను గిరిజన గ్రామాల నుంచి బహిష్కరించాలంటూ రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరిసింహన్ అన్నారు. ప్రతీ కుటుంబంలో యజమాని తప్పనిసరిగా పనిచేయాలన్నారు.

02/16/2016 - 01:18

హైదరాబాద్, ఫిబ్రవరి 15: హైదరాబాద్ కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఇంటర్నేషనల్ వాయిస్ కాల్ రాకెట్‌ను సిసిఎస్ పోలీసులు రట్టు చేశారు. వాయిస్ కాల్ రాకెట్‌కు హబ్‌గా మారిన హైదరాబాద్‌లో ఇటీవల ఇద్దరు యువకులను అరెస్టు చేసి విచారించగా గుట్టు రట్టయింది. లోకల్ కాల్ ఛార్జీలతో ఇంటర్నేషనల్ వాయిస్ కాల్ నడుస్తున్నందున ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు గండి పడుతోంది.

02/16/2016 - 01:17

విజయవాడ, ఫిబ్రవరి 15: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామ సమీపంలో ప్రతిపాదిత తాత్కాలిక సచివాలయం, ఇతర ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ, ఎంవోఇఎఫ్ అండ్ సీసీ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖల నుంచి ఈ నెల 9న అన్నిరకాల అనుమతులు లభించినట్లు సిఆర్‌డిఏ అధికారులు సోమవారం నాడిక్కడ తెలిపారు.

Pages