S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/19/2017 - 03:43

హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ విద్యుత్ సంస్ధల నుంచి రిలీవ్ అయిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమస్యలకు ఈ నెల 26వ తేదీన గవర్నర్ సమక్షంలో చర్చల్లో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఏపి ట్రాన్స్‌కో జెఎండి దినేష్ పరుచూరి తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం 40 రోజుల నుంచి విద్యుత్ సౌధలో దీక్ష చేస్తు న్న 1,259 మంది ఏపి స్థానికత ఉద్యోగుల తో ఆయన ఆందోళనను విరమింపజేశారు.

03/19/2017 - 03:25

హైదరాబాద్, మార్చి 18: నల్లమార్కెట్ నిరోధక చటాన్ని అమలు చేసే విషయమై తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు శనివారం ఏపి, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. నల్లమార్కెట్లోకి నిత్యావసర వస్తువులను ఎక్కువ ధరలకు అమ్మకాలను నిరోధించడంలో రెండు రాష్ట్రప్రభుత్వాలు విఫలమయ్యాయని నగరానికి చెందిన టి ధనగోపాలరావు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

03/19/2017 - 01:54

హైదరాబాద్, మార్చి 18: కోర్టు ధిక్కారణ కేసులో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ మాజీ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌కు హైదరాబాద్ హైకోర్టు నెల రోజుల సాధారణ జైలు శిక్ష లేదా 1500 రూపాయల జరిమానా విధించింది. నాలుగు వారాల్లోగా 1500 రూపాయల జరిమానా చెల్లించాలని, లేదా 30 రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని జస్టిస్ రామచంద్ర రావు ఆదేశిస్తూనే జైలు శిక్ష అమలును నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది.

03/19/2017 - 01:38

హైదరాబాద్/ చార్మినార్, మార్చి 18: తెరాస ప్రభుత్వం ఇదివరకే ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు 2018నాటికి వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి నీళ్లివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగేది లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మరోసారి శాసన మండలిలో స్పష్టం చేశారు.

03/19/2017 - 01:36

హైదరాబాద్, మార్చి 18: ఉగాది పండుగ ఈనెల 29నే నిర్వహిస్తామని, అందులో ఎలాంటి మార్పూలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కెవి రమణాచారి ఈ విషయం స్పష్టం చేశారు. తెలంగాణ విద్వత్సభ ప్రతినిధుల బృందం శనివారం రమణాచారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇదే వినతిపత్రాన్ని సిఎం కెసిఆర్‌కూ పంపించారు.

03/19/2017 - 01:35

హైదరాబాద్, మార్చి 18: పంట రుణాల మాఫీ యుపికి మాత్రమే పరిమితమని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నట్టు పిటిఐ సంస్థ తెలిపింది. ఎన్నికల్లో యుపిలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటుందని వెంకయ్యనాయుడు చెప్పారు. ఇది కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, జాతీయ విధానం కాదని స్పష్టం చేశారు. లోక్‌సభలో ఈ అంశంపై విపక్షాలు నిలదీసిన మీదట మంత్రి స్పష్టత ఇచ్చారు.

03/19/2017 - 01:27

నరసరావుపేట, మార్చి 18: అందరికీ ఆరోగ్యం ప్రభుత్వం తన బాధ్యతగా భావించి, ఆ దిశగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామంలో కస్తూరిబా బాలికల పాఠశాలలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావులతో కలిసి ఆరోగ్యరక్ష కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.

03/19/2017 - 01:24

అమరావతి, మార్చి 18: తెలుగు ప్రాధికార సంస్థ అధ్యక్షుడిగా యువనేత లోకేష్‌కు సలహాదారుగా ఉన్న నాటక రచయిత పెద్ది రామారావు నియమితులు కానున్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ తెలుగుభాష, సంస్కతి, కళల అభివృద్ధి, విస్తృతికి కృషి చేయనుంది. ఇప్పటివరకూ ఉన్న అధికార భాషా సంఘం స్థానంలో ఇది ఏర్పాటుకానుంది.

03/19/2017 - 01:22

అమరావతి, మార్చి 18: మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముహూర్తం నిర్ణయించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే నెల 6న విస్తరణ ఉండవచ్చని తెలుస్తోంది. ఆరోజు దశమి, పైగా గురువారం కూడా కావడంతో ముహూర్త బలం బాగుంటుందని పండితులు కూడా సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ కోసం 6, 7, 8 తేదీలను పరిశీలించారు.

03/18/2017 - 04:54

వరంగల్, మార్చి 17: ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా విస్తృత చర్యలు తీసుకోవాలని ఈ మధ్యకాలంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వైద్యాధికారులను ఆదేశించటం షరామామూలు వ్యవహారంగా కొనసాగుతోంది. కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధిగానీ, అధికారులుగానీ తమ కుటుంబ సభ్యుల, తమ పిల్లల ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరిపించిన దాఖలాలు లేవు. కానీ మాటలకే కాదు..

Pages