S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/17/2017 - 02:49

హైదరాబాద్, మార్చి 16:ఇంజనీరింగ్ విద్యలో భారీ ప్రక్షాళనకు కేంద్రం నడుం బిగించింది. అందులో భాగంగా వచ్చే ఏడాది (2018) నుండి జెఇఇ మెయిన్స్ పరీక్షను రద్దు చేయనుంది. ప్రస్తుతం జెఇఇ మెయిన్స్‌కు 13 లక్షల మంది హాజరవుతున్నారు. అఖిల భారత ఇంజనీరింగ్ కాలేజీల అడ్మిషన్ల పరీక్షగా దీని పేరును వచ్చే ఏడాది మార్చనున్నారు.

03/17/2017 - 02:11

హైదరాబాద్, మార్చి 16: జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. శాసనసభలో గురువారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో పాలకపక్ష సభ్యులు గాదరి కిషోర్, కల్వకుంట విద్యాసాగర్‌రావు అడిగిన ప్రశ్నకు మంత్రి కడియం సమాధానమిస్తూ ఇంటర్మీడియట్ వరకు ఫీజు రద్దు చేయడంతోపాటు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేస్తున్నామన్నారు.

03/17/2017 - 02:09

మణుగూరు, మార్చి 16: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు, పినపాక మండలాల సరిహద్దులో నిర్మించ తలపెట్టిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఏడాదిన్నర కాలంగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న బిటిపిఎస్‌కు కేంద్ర పర్యావరణ శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బుధవారం కేంద్రంనుంచి ఉత్తర్వులు అందాయి.

03/17/2017 - 02:08

హైదరాబాద్, మార్చి 16:సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టులో అపీలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సింగరేణి కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.

03/17/2017 - 02:07

హైదరాబాద్, మార్చి 16: విద్యుత్ రంగంలో ప్రస్తుతానికి కోతలు లేకున్నా, భవిష్యత్‌లో వాతలు పెట్టేలా సంక్షోభం ముంచుకు రానున్నదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం నాడు ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మిగులు విద్యుత్‌కు వచ్చినట్టు ప్రభుత్వం చెబుతోందని, రెండున్నరేళ్లలో ఇదంతా సాధించారా?

03/17/2017 - 02:01

హైదరాబాద్, మార్చి 16:సింగరేణిలో వారసత్వ ఉద్యోగ నియామకాలపై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసేందుకు ఉద్దేశించిన పథకాన్ని, అలా రిటైరైన వారి స్థానంలో వారి పిల్లల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు వీలు కల్పించే నోటిఫికేషన్‌ను జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ జె ఉమాదేవిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం రద్దు చేసింది.

03/17/2017 - 01:56

అమరావతి, మార్చి 16: వైసీపీ సభ్యురాలు రోజాను మరో ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని గొల్లపల్లి సూర్యారావు సారథ్యంలోని ప్రివిలేజ్ కమిటీ శాసనసభకు సిఫార్సు చేసింది. ఈ మేరకు గురువారం కమిటీ తన సిఫార్సును స్పీకర్‌కు అందజేసింది.

03/17/2017 - 01:53

గుంటూరు, మార్చి 16: ‘పోలవరం ప్రాజెక్టు ఆయన చిరకాల స్వప్నం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో అధికారంలో ఉన్న 9 ఏళ్ల కాలంలో ఇదే పెద్దమనిషి రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నార’ని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. దివంగత వైఎస్ హయాంలోనే కుడి, ఎడమ కాల్వలకు పనులు జరిగాయన్నారు.

03/17/2017 - 01:33

గుంటూరు, మార్చి 16:పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు పుట్టగతులుండవనే భయంతోనే రాద్ధాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రాష్ట్రానికి గత యుపిఏ ప్రభుత్వం అన్యాయం చేసిన మాట వాస్తవంకాదా?. ప్రస్తుతం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారంటే ఆనందించాల్సింది పోయి సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. పద్ధతి లేని రాజకీయాలు చేస్తున్నారు.

03/17/2017 - 01:30

గుంటూరు, మార్చి 16: విశాఖపట్నంలోనే ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కూడా పూర్తి కావచ్చిందని, త్వరలో ఏపికి 225 శాసనసభ స్థానాలు ప్రకటిస్తారని సిఎం చెప్పారు. కడపలో స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం నౌకాశ్రయాల అడ్డంకులు కూడా తొలగి పోతాయన్నారు.

Pages