S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/16/2017 - 08:26

వేములవాడ, మార్చి 15: కరీంనగర్ జిల్లా వేములవాడ లో బుధవారం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల దివ్యకల్యా ణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అభిజిత్‌లగ్న సుముహూర్తాన బుధవారం ఉదయం 10.30గంటలకు కళ్యాణతంతును ఆలయ అర్చకులు ప్రారంభించారు. పార్వతీదేవి నొసటన కల్యాణ బొట్టును,బుగ్గన కాసింత దిష్టిచుక్కను పెట్టకొని ఆలయ అధికారులు సమర్పించిన పట్టువస్త్రాలను ధరించి పార్వతీదేవి పెళ్లికూతురయ్యింది.

03/16/2017 - 07:55

న్యూఢిల్లీ, మార్చి 15: కోల్‌మైన్ ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) రీజనల్ కార్యాలయాన్ని హైదారాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు సంబంధించిన ఈ రీజనల్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.

03/15/2017 - 03:41

విశాఖపట్నం, మార్చి 14: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డిసిఐ) ప్రైవేటుపరం చేయద్దంటూ ఆ సంస్థ ఉద్యోగులు మంగళవారం డిసిఐ చైర్మన్ రాజేష్ త్రిపాఠిని కలిశారు. దీనిపై చైర్మన్ త్రిపాఠి మాట్లాడుతూ డిసిఐ షేర్ల అమ్మకంపై అధికారికంగా తనకు ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. తాను సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరలో సమాచారాన్ని అందిస్తానని చైర్మన్ చెప్పారు.

03/15/2017 - 01:48

హైదరాబాద్, మార్చి 14: ఏ రాష్టమ్రైనా అప్పు తీసుకొస్తే దాన్ని అభివృద్ధికి వినియోగిస్తే సత్ఫలితాలు వస్తాయని, అదేవిధంగా తెరాస ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పు అభివృద్ధి పనులకే వినియోగిస్తున్నట్టు రాష్ట్ర పరిశ్రమల మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు.

03/15/2017 - 01:44

హైదరాబాద్, మార్చి 14: ప్రతి నియోజకవర్గంలో వెయ్యి డబుల్ బెడ్‌రూంల నిర్మాణానికి అవసరమైన, అనువైన స్థలాలు ఎంపిక చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే ఎంపిక చేసిన 72,963 గృహాల నిర్మాణానికి టెండర్లు పిలిచారని, వీటికి ఒప్పందాలు పూర్తి చేసుకుని వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

03/15/2017 - 01:43

హైదరాబాద్, మార్చి 14: ‘ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో బతికే తెలంగాణ కావాలన్నది నా ఆకాంక్ష. ఈ తెలంగాణలో ఉండే ప్రతి కులం, ప్రతి మనిషి చిరునవ్వుతో, గర్వంతో కాలర్ ఎగరేసేలా బతకాలి. ఉన్న వనరులు, వసతులు సద్వినియోగం కావాలి. దాన్ని నూటికి నూరుశాతం సాధించి తీరుతాం’ అని సిఎం కె చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ‘ఆదాయ వృద్ధిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది.

03/15/2017 - 01:22

విజయవాడ, మార్చి 14: రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న పేదల స్థలాల క్రమబద్ధీకరణకు సమగ్రమైన ఒకే జీవోను త్వరలో జారీ చేయాలని మంత్రుల బృందం నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కెఇ కృష్ణమూర్తి అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశం మంగళవారం జరిగింది.

03/15/2017 - 01:20

అమరావతి, మార్చి 14: ‘ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? మొన్ననే కదా మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడా. మళ్లీ రోడ్డెక్కి పార్టీని బజార్నపడేస్తారా.. ఇదే ధోరణి కొనసాగితే ఇక సహించేది లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలను హెచ్చరించారు. మంగళవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో క్రమశిక్షణ తప్పుతున్న ఎమ్మెల్యేలు, ముఠా తగాదాలపై చంద్రబాబు మండిపడ్డారు.

03/15/2017 - 01:16

విజయవాడ, మార్చి 14: నంద్యాల సీటు సాంకేతికంగా తమదేనని, అక్కడ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలిపారు. భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ నాగిరెడ్డి చనిపోయిన విషయం తెలిసిన వెంటనే ఆయన కుమార్తె అఖిలప్రియతో మాట్లాడానని తెలిపారు.

03/15/2017 - 01:13

విజయవాడ, మార్చి 14: అకాల మరణానికి గురైన నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి మానవతావాది. ప్రత్యర్థుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన సోదరుల పిల్లలను సైతం తన సొంత పిల్లలతో సమానంగా చూస్తూ, వారికోసం పాటుబడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. మధ్యలో స్వల్ప విభేదాలు చోటుచేసుకున్నా భూమా, ఎస్వీ సుబ్బారెడ్డి కుటుంబాలు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూవచ్చాయన్నారు.

Pages