S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/19/2016 - 05:18

భద్రాచలం, డిసెంబర్ 18: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మరణించాడు. ఎస్పీ కెఎల్ ధృవ్ తెలిపిన వివరాల ప్రకారం... మిర్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని హక్వా అటవీ ప్రాంతంలోని హల్లూరు వద్ద 199 సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ జవాన్లు, మిర్తూరు పోలీసులు సంయుక్తంగా గస్తీ తిరుగుతూ శనివారం హల్లూరు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు.

12/19/2016 - 05:17

విశాఖపట్నం, డిసెంబర్ 18: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎక్సైజ్ శాఖ అదనపుకమిషనర్ కె.లక్ష్మణ భాస్కర్ సహా, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆదివారం రెండో రోజూ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు కొనసాగించారు. సోదాల్లో ఇప్పటి వరకూ 3.5 కోట్ల మేర అక్రమాస్తులు గుర్తించినట్టు ఎసిబి డిఎస్పీ (విశాఖ అర్బన్) కె.రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. వీటి మార్కెట్ విలువ సుమారు 50 కోట్ల వరకూ ఉంటుందని పేర్కొన్నారు.

12/19/2016 - 05:17

హైదరాబాద్, డిసెంబర్ 18: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డికి ఆంధ్రా, తెలంగాణ ఇరు రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు సంఘీభావం తెలిపాయి. జస్టిస్ నాగార్జునరెడ్డిపై సస్పెండైన న్యాయాధికారి రామకృష్ణ చేసిన అభియోగాలను ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు తీవ్రంగా ఖండించాయి.

12/19/2016 - 04:56

భద్రాచలం, డిసెంబర్ 18: బాలల సంబురం భద్రాద్రి బాలోత్సవ్ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని బంగారు తెలంగాణ తల్లి ప్రాంగణంలో నేత్రపర్వంగా ప్రారంభమైంది. జాతీయస్థాయి ఈ బాలోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు తమ తమ ప్రతిభ విశేషంగా ప్రదర్శించారు.

12/19/2016 - 04:45

హైదరాబాద్, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ (ఎబిసి)ని మరింత సమర్థవంతంగా నడిపించేందుకు ప్రముఖులు సహకారం అందించాలని ఎబిసి చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు కోరారు. ఎబిసి ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని మేరీగోల్డ్ హోటల్‌లో ఆదివారం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

12/19/2016 - 03:39

హైదరాబాద్, డిసెంబర్ 18:తెలంగాణను నగదు రహిత లావాదేవీల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నా అది కార్యరూపం దాల్చడం అంత సులువుగా జరిగే పని కాదు. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలలో కూడా నూటికి నూరు శాతం నగదు రహిత లావాదేవీలు జరగడం లేదు.

12/19/2016 - 03:36

హైదరాబాద్, డిసెంబర్ 18:ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఓట్ల వర్షం కురిపించిన ‘డబుల్ బెడ్‌రూమ్’ ఇళ్ల నిర్మాణ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఎన్నికల ప్రణాళిక రూపొందించే సమయంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి నాలుగైదు లక్షల రూపాయలు అవుతాయని భావించారు. చివరకు అది ఏడు లక్షల రూపాయల ధరకు చేరుకుంది. ఎప్పటికప్పుడు టెండర్లు పిలవడమే కానీ పనులు సాగడం లేదు.

12/19/2016 - 03:33

శామీర్‌పేట, డిసెంబర్ 18: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు యువకులు మృతి చెందారు. ఆదివారం రాత్రి శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

12/19/2016 - 03:21

విజయవాడ, డిసెంబర్ 18: అట్టడుగున ఉన్నవారికి ఫలితాలు అందేలా దేశ భవిష్యత్తు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దు చేయడం జరిగిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కాన్సర్ నయం కావడానికి కీమోథెరపీ ఏ విధంగా అవసరమో, అదేవిధంగా అవినీతి, నల్లధన నిర్మూలనకు కూడా కీమోథెరపీ అవసరమని, ఈ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు సహజమని, మన భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఈ ఇబ్బందులు ఓర్చుకోక తప్పదన్నారు.

12/19/2016 - 03:06

కూచిపూడి, డిసెంబర్ 18: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన తెలుగుదేశంలో చేరేందుకు ముహూర్తం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం జరిగింది. వైసిపి కేంద్ర కమిటీ సభ్యురాలిగా, శాసనసభ ఫ్లోర్‌లీడర్‌గా బాధ్యత నిర్వహిస్తున్న కల్పన కొన్ని నెలలుగా టిడిపిలో చేరతారన్న ప్రచారం జరుగుతున్నా ఆమె వాటిని కొట్టిపారేశారు.

Pages