S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/13/2016 - 01:57

అమరావతి, డిసెంబర్ 12:పెద్దనోట్ల రద్దు తర్వాత భారీ మొత్తంలో పట్టుబడుతున్న 2 వేల నోట్లపై సీబీఐ సీరియస్‌గా దృష్టి సారించింది. ఏయే మార్గాల ద్వారా వాటిని సేకరిస్తున్నారన్న అంశంపై లోతుగా విచారించనుంది. అందులోభాగంగా మొదట ఆదాయపన్ను శాఖపై మరిన్ని దాడులు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.

12/13/2016 - 01:42

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాకాథంలో ఏర్పడిన వార్ధా తుపాను సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు తీరాన్ని దాటే సమయానికి పెను తుపాను నుంచి సాధారణ తుపానుగా మారిందని, మరో ఆరుగంటల అనంతరం తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమదిశగా పయనిస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది.

12/13/2016 - 01:41

నెల్లూరు/చిత్తూరు/ఒంగోలు, డిసెంబర్ 12: వార్ధా తుపాను రాష్ట్రాన్ని కనికరించింది. పెను ముప్పు తప్పింది. అయితే నెల్లూరు సరిహద్దు మండలాల్లో కొన్ని చోట్ల భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు జిల్లాలో నాయుడుపేట, సూళ్లూరు పేట, తడ, దొరవారి సత్రం మండలాల గ్రామాల్లో వార్ధా తన ప్రతాపం చూపించింది. జిల్లాలో గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

12/12/2016 - 06:02

హైదరాబాద్, డిసెంబర్ 11: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా త్వరలో 5కోట్ల మందికి ఉద్యోగాలు కల్లించనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తద్వారా రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో లక్ష మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు.

12/12/2016 - 05:57

హైదరాబాద్, డిసెంబర్ 11: ఈ నెల 16నుంచి అపారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు అధికార విపక్షాలు అప్పుడే సన్నద్ధం అవుతున్నాయి. ఈసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శల మధ్య వాడి, వేడిగా సమావేశాలు జరుగనున్నాయి.

12/12/2016 - 05:50

తిరుపతి, డిసెంబర్ 11: తిరుమలలోని అత్యంత ప్రముఖమైన చక్రతీర్ధ ముక్కోటి ఆదివారం వైభవంగా జరిగింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల గిరులలోని దక్షిణ భాగంలో మహాపవిత్ర తీర్ధమైన చక్రతీర్ధ వెలసింది. ప్రతి సంవత్సరం వృశ్చికమాసం శుద్ధ ద్వాదశినాడు ఈ చక్రతీర్థ ముక్కోటి నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున, మధ్యాహ్నం ఆరాధనలతో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

12/12/2016 - 05:47

భీమవరం, డిసెంబర్ 11: ఈ ఏడాది గోదావరి జిల్లాల సంక్రాంతి కోడిపందాల బరిలో విదేశీ కోడిపుంజులు కదం తొక్కనున్నాయి. తైవాన్, మెక్సికో, దక్షిణాఫ్రికా, జర్మనీ దేశాలకు చెందిన జాతుల కోడిపుంజులు ప్రస్తుతం పందాలకు సిద్ధమవుతున్నాయి. కొంద రు పెంపకందార్లు ఈ పుంజులను సేకరించి, పెంచుతున్నారు. వివరాల్లోకి వెళితే... సంక్రాంతి కోడిపందాలకు గోదావరి జిల్లాలు ప్రసిద్ధి అనే సంగతి అందరికీ తెలిసిందే.

12/12/2016 - 05:45

బాపట్ల, డిసెంబర్ 11: భారతీయ పౌర సమాజంలో మార్పు వచ్చినప్పుడే సీమాంతర ఉగ్రవాదాన్ని అంతమొందించడం సాధ్యమవుతుందని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల రసరంజని సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎంవిఆర్ కల్యాణ మండపం ఆవరణలో ఆదివారం సాయంత్రం ‘ఉగ్రవాదంపై రాజ్యం వైఖరి నాడు-నేడు’ అనే అంశంపై ఆయన ప్రధాన ప్రసంగం చేశారు.

12/12/2016 - 05:37

హైదరాబాద్, డిసెంబర్ 11: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కేను టార్గెట్‌గా చేసుకుని దండకారణ్యంలో ‘ఆపరేషన్ ఆలౌట్’ పేరుతో భారీ కూంబింగ్ సాగుతోంది. అక్టోబర్ 24న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో గాయపడి తప్పించుకున్న ఆర్కేను పట్టుకోవడానికి గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

12/12/2016 - 05:36

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 11: హైదరాబాద్ నగర శివారు లోని నానాక్‌రాంగూడలో ఆరంతస్తుల భవనం కూలిన ఘటనలో గచ్చిబౌలి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.

Pages