S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/10/2016 - 05:09

న్యూఢిల్లీ,డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పదవీకాలం పొడిగించాలని ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.

12/10/2016 - 05:08

హైదరాబాద్, డిసెంబర్ 9: భవనం కూలిన ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర చీఫ్ లేబర్ కమిషనర్ అనిల్ కుమార్ నాయక్‌ను కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ డాక్టర్ జనార్ధన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నర్ తదితరులతో టెలిఫోన్‌లో ఆయన సమీక్షించారు.

12/10/2016 - 05:08

హైదరాబాద్, డిసెంబర్ 9: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్నారు. ఢిల్లీ నుంచే ఇక్కడి నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనపై అధికారులను ముఖ్యమంత్రి ఫోన్లో అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్‌తో అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడారు.

12/10/2016 - 05:07

హైదరాబాద్, డిసెంబర్ 9: కేంద్ర ప్రభుత్వం పాత రూ.500, 1000 నోట్లను రద్దు చేయడంతో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసి బస్సుల్లో గత నెల రోజులు అనుమతించారు. ఈ నెల 9వ తేదీ అర్ధ రాత్రి నుంచి పాత పెద్దనోట్లను అనుమతించమని టిఎస్‌ఆర్‌టిసి ఎండి జివి రమణారావు తెలిపారు.

12/10/2016 - 05:06

హైదరాబాద్, డిసెంబర్ 9: పోస్టల్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబును సిబిఐ అధికారులు శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. ఈనెల 23 వరకు కోర్టు రిమాండ్ విధించింది. హిమాయత్‌నగర్, కార్వాన్, గోల్కొండ పోస్ట్ఫాసుల్లో సుధీర్‌బాబు ఆదేశాలతో రూ. 3కోట్ల పెద్దనోట్లు మార్చినట్లు సిబిఐ మూడు కేసులు నమోదు చేసింది. మధ్యవర్తులుగా వ్యవహరించిన నితిన్, నర్సింహారెడ్డి అనే వ్యక్తులను అరెస్టు చేశారు.

12/10/2016 - 05:05

హైదరాబాద్, డిసెంబర్ 9: నిజామాబాద్ జిల్లా సారంగాపూర్‌లోని సహకార చక్కెర ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

12/10/2016 - 02:57

తిరుపతి, డిసెంబర్ 9: న్యూఢిల్లీకి చెందిన ఎంఎస్ పద్మనాభన్ అనే భక్తుడు శుక్రవారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. ఒక కోటి 11వేలు విరాళంగా అందించారు.
తిరుమలలోని జెఇఓ క్యాంపు కార్యాలయంలో జెఇఓ శ్రీనివాసరాజుకు ఈ మేరకు విరాళం డిడిని అందజేశారు.

చిత్రం..తిరుమలలో విరాళం చెక్కును జెఇఓకు అందజేస్తున్న పద్మనాభన్

12/10/2016 - 02:50

హైదరాబాద్, డిసెంబర్ 9: వరుసగా బ్యాంకులకు మూడు రోజుల పాటు సెలవులు. రెండవ శనివారం, ఆదివారం, సోమవారం మిలాద్ ఉన్ నబీ బ్యాంకులకు సెలవు. దీంతో పరిస్థితి మరింత దిగజారనుంది. ఎటిఎంలలో నగదు లేక, బ్యాంకుల్లో డబ్బు లేక జనం కటకటలాడిపోతున్నారు.

12/10/2016 - 02:25

హైదరాబాద్, గచ్చిబౌలి, డిసెంబర్ 9: నానక్‌రాంగూడ ప్రమాద ఘటనకు కారణమైన బాధ్యులను వదిలేది లేదని మున్సిపల్ మంత్రి కె తారకరామారావు ప్రకటించారు. శుక్రవారం ఉదయమే ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని అభిప్రాయపడ్డారు.

12/10/2016 - 02:16

ఆదిలాబాద్, డిసెంబర్ 9: కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా అంటాడో సినీ కవి. ఆ మాటను ఓ విదేశీ అమ్మ నిజం చేస్తోంది. పేగు తెంచుకుని బిడ్డకు జన్మనిచ్చిన మాతృమూర్తి ఏ కారణం చేతనో పసిగుడ్డును కుప్పతొట్లో వదిలేస్తే, మాతృదేశానికి ఏమాత్రం సంబంధంలేని మహాతల్లి మాత్రం ఆ బిడ్డను భుజానికెత్తుకుంది. అనాధ అన్న ముద్రపడకముందే అక్కున చేర్చుకోవాలని ఐదు రోజులుగా తపన పడుతోంది.

Pages