S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/28/2016 - 05:09

రేణిగుంట, జనవరి 27 : భవిష్యత్తు శాస్త్ర సాంకేతిక రంగాలదేనని, ఆ దిశగా విద్యార్థులు దృష్టి సారించి దేశాన్ని ప్రపంచస్థాయిలో అగ్రస్థానానికి తీసుకెళ్ళాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం తొలిసారిగా తిరుపతిలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ అకాడమీని ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు.

01/27/2016 - 07:58

విశాఖపట్నం, జనవరి 26: విశాఖలో వచ్చే నెల నాలుగో తేదీ నుంచి జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్)కి సంబంధించి బుధవారం నుంచి రిహార్సల్స్ ప్రారంభమవుతున్నాయి. మూడు రోజులపాటు ఈ రిహార్సల్స్ జరగనున్నాయి. 30వ తేదీ నుంచి విశాఖలోని ఆర్‌కె బీచ్ రోడ్డు పూర్తిగా నేవీ అధీనంలోకి వెళ్లిపోనుంది. ఫ్లీట్ రివ్యూకి సంబంధించి ఏర్పాట్లు చాలా వరకూ పూర్తయ్యాయి.

01/27/2016 - 07:39

విజయవాడ, జనవరి 26: 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకేరోజు రెండు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రసంగాలు చేసిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ రికార్డు సృష్టించారు.

01/27/2016 - 07:21

హైదరాబాద్, జనవరి 26: అమెరికా చదువులకు పెద్ద సంఖ్యలో వెళ్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్ధుల్లో కొంత మంది తిరిగి వెనక్కు రావడం అందరినీ కలవరపరుస్తోంది. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది ? మన విద్యార్ధులు ఎందుకు వెనక్కు వస్తున్నారు? ఎఫ్-1 వీసా పొందిన వారు కూడా ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

01/27/2016 - 02:24

విజయవాడ, జనవరి 26: చదువుల్లో ఎంతో ఉన్నతంగా రాణిస్తున్న తన కుమారుడు రోహిత్‌ను ఉద్దేశపూర్వకంగా ఎవరో హతమార్చి ఉరివేసి ఉంటారని తండ్రి, గుంటూరు జిల్లాకు చెందిన వేముల మణికుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకంపనాలు సృష్టిస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్ మృతిపై స్వయంగా తండ్రి పలు అనుమానాలు రేకెత్తించడంతో వ్యవహారం మరో మలుపు తిరిగింది.

01/27/2016 - 02:21

కాకినాడ, జనవరి 26: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతుల ఆత్మహత్యలులేని రాష్ట్రంగా మార్చాలనేది ధ్యేయమని సిఎం చంద్రబాబు పేర్కోన్నారు. రైతులకు అండగా ఉంటానని భరోసాయిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ‘పెట్టుబడి లేని సహజ ప్రకృతి వ్యవసాయం’పై రైతులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి మంగళవారం సిఎం హాజరయ్యారు.

01/27/2016 - 08:04

విజయవాడ, జనవరి 26: కేవలం 19నెలల కాలంలోనే ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అద్భుతమైన, ప్రశంసనీయమైన ప్రగతిని సాధించిందని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. అనతి కాలంలోనే వ్యాపార, వాణిజ్య పరంగా అంతర్జాతీయ దృష్టినీ ఆకర్షించిందన్నారు.

01/27/2016 - 02:16

సూళ్లూరుపేట, జనవరి 26: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ ఏడాది మరో ఆరు రాకెట్ ప్రయోగాలు చేపడుతున్నట్లు షార్ డైరెక్టర్ కె కున్హికృష్ణన్ తెలిపారు. మంగళవారం ఆయన షార్‌లోని కల్పన అంతరిక్ష భవనంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ 2018లో చంద్రయాన్-2 ప్రయోగానికి సన్నాహం చేస్తున్నట్లు చెప్పారు.

01/26/2016 - 01:12

హైదరాబాద్, జనవరి 25: సినీనటి కల్పనారంజని సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 51 సంవత్సరాలు. నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రలుగా నిర్మిస్తున్న ‘ఊపిరి’ చిత్రంలో నటిస్తున్న కల్పన షూటింగ్‌కోసం హైదరాబాద్ వచ్చారు. ఆమె బసచేసిన హోటల్ రూమ్‌లో తెల్లవారుజామున అపస్మారక స్థితిలో ఉండగా గమనించిన సిబ్బంది ఆమెను అపోలో ఆస్ప్రత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.

01/26/2016 - 01:09

హైదరాబాద్, జనవరి 25-ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో ‘బాహుబలి’ పంట పండింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఆధ్వర్యంలో తొలిసారిగా దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రతిభ చూపిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమానికి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా మారింది.

Pages