S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/18/2016 - 04:24

హైదరాబాద్, నవంబర్ 17: ఈనెల 23న నిర్వహించతలపెట్టిన ఆలిండియా కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ సమ్మె వాయిదా పడినట్టు తెలంగాణ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకటపతి తెలిపారు.

11/18/2016 - 04:20

హైదరాబాద్, నవంబర్ 17: నల్లధనంపై ప్రధానమంత్రి నరేంద్రమోది యుద్దం చేస్తున్నారని ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ విసి ప్రొఫెసర్ టి.తిరుపతిరావు పేర్కొన్నారు. అవేర్‌నెస్ ఇన్ ఇండియా, హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం రాత్రి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘నల్లదనం నిర్మూలన-నరేంద్రమోదీ’ అంశంపై సదస్సు జరిగింది.

11/18/2016 - 04:12

హైదరాబాద్, నవంబర్ 17: ఓటుకు నోటు కేసులో పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాల్సిందిగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడును హైకోర్టు ఆదేశించింది. గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి ఆదేశించారు.

11/18/2016 - 04:09

హైదరాబాద్, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని జైళ్లలో బాల నేరస్తులు, మహిళా ఖైదీల స్థితిగతులు, జైళ్లలో వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని లీగల్ సర్వీసుల అధికారులను గురువారం హైకోర్టు ఆదేశించింది. ఏపి లీగల్ సర్వీసుల అథారిటీ సభ్యులు పంపిన లేఖను పిల్‌గా హైకోర్టు స్వీకరించింది.

11/18/2016 - 03:32

విశాఖ: విశాఖ క్రికెట్ స్టేడియంలో గురువారం మాజీ క్రికెటర్లు గవాస్కర్, రవిశాస్ర్తీ, మంజ్రేకర్, నాసిర్ హుసేన్, ఎంఎస్‌కె ప్రసాద్‌లకు మెమెంటోలను అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

11/18/2016 - 03:26

హైదరాబాద్, నవంబర్ 17: పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దోహదపడే పక్షంలో ప్రధానికి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. సంస్కరణలు కొనసాగి తీరాలని, అవి ఉన్నతస్థాయిలో పురోగమించడానికి దోహదపడాలని ఆకాంక్షించారు. ఆలోచనాపరులు, మేధావులు కలిసి పనిచేస్తే ఏదైనా విజయవంతం అవుతుందన్నారు.

11/18/2016 - 03:22

హైదరాబాద్, నవంబర్ 17: పెద్దనోట్ల రద్దువల్ల దేశవ్యాప్తంగా ఉత్పన్నమైన పరిస్థితిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ వివరించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో అవలంబించాల్సిన వ్యూహాన్ని ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువెళ్లారు. దీనికి వెంటనే స్పందించిన ప్రధాని ‘మీ వద్ద ఉన్న ప్రతిపాదనలను లిఖితపూర్వకంగా తీసుకొని ఢిల్లీకి రండి చర్చిద్దాం’ అని కోరారు.

11/18/2016 - 03:21

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌తో పంచుకుంటే తమకు మిగిలేది ఏమీ ఉండదని సుప్రీంకోర్టు ఎదుట తెలంగాణ ప్రభుత్వం వాదించింది. కేసు తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 18కి వాయిదా వేసింది. కృష్ణా నదీ జలాల వివాదం కేసును గురువారం న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమితాబ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

11/18/2016 - 03:04

విశాఖపట్నం, నవంబర్ 17: నగదు రహిత లావాదేవీలు జరిగే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని, దీనికోసం ప్రతి ఒక్కరూ జన్‌ధన్ ఖాతాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విశాఖలో గురువారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కరెన్సీ ప్రమేయం లేకుండా ఆర్థిక కార్యకలాపాలు జరిగితే అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. బ్యాంకుల్లో ఖాతాలతో రూపీ కార్డ్ తీసుకుంటే కొనుగోళ్లకు నగదు ప్రమేయం ఉండదన్నారు.

11/18/2016 - 03:02

విశాఖపట్నం, నవంబర్ 17: ‘బాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందన్న టిడిపి ఎన్నికల నినాదాన్ని విస్మరించలేదు. బాబు అధికారంలోకి వచ్చాడు, ఇక జాబు తప్పకుండా వస్తుంది’ అని యువతకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. విశాఖ ఎయు గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించే విధంగా కొత్త పాలసీకి రూపకల్పన చేస్తున్నట్టు వెల్లడించారు.

Pages