S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/18/2016 - 02:48

విజయవాడ (క్రైం), నవంబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతమున్న సెక్యూరిటీ కన్నా భారీగా భద్రత సిబ్బందిని పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మావోయిస్టుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ముఖ్యమంత్రికి వారినుంచి ముప్పు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలకు సమాచారం అందింది. ముఖ్యమంత్రి సెక్యూరిటీ గ్రూప్‌లో కొత్తగా 290 మంది భద్రతా అధికారులు సిబ్బంది వచ్చి చేరారు.

11/18/2016 - 04:01

జహీరాబాద్, నవంబర్ 17: గత పది రోజులుగా ఎటిఎంల వద్దకు ప్రజలు పరుగులు పెడుతుంటే... గురువారం ఏకంగా ఎటిఎంలే జనం మధ్యకు వచ్చాయ. ఎస్‌బిఐ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బ్రాంచి అధికారులు గురువారం మొబైల్ ఎటిఎం సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. కార్డు ద్వారా డబ్బులు తీసుకునే వెసులుబాటును కల్పించారు.

11/18/2016 - 02:22

హైదరాబాద్, నవంబర్ 17: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కోట్లకు పడగలెత్తిన పలు కార్పొరేట్ ఆసుపత్రుల ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు దృష్టి సారించాయ. రద్దయిన పెద్ద నోట్లను భారీ సంఖ్యలో మార్పిడి చేసుకునేందుకు పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు కార్పొరేట్ ఆసుపత్రులను ఉపయోగించుకుంటున్నారనే సమాచారంతో ఆదాయంపన్ను శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజన్సీలు అప్రమత్తమయ్యాయి.

11/18/2016 - 01:07

కర్నూలు, నవంబర్ 17: రానున్న రోజుల్లో వ్యాపార లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారా నిర్వహించేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పట్టణాలు, గ్రామాల్లో స్వైపింగ్ మిషన్లు(పాయింట్ ఆఫ్ సేల్ మిషన్)ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీచేయనున్నారు.

11/18/2016 - 01:06

కాకినాడ, నవంబర్ 17: చిన్న మొత్తాలలో కరెన్సీ నోట్ల లభ్యత తగినంత అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, ఆ దిశగా తక్షణం ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

11/18/2016 - 01:04

విశాఖపట్నం(స్పోర్ట్స్), నవంబర్ 17: టెస్ట్‌మ్యాచ్ హోదా ద్వారా విశాఖ ఖ్యాతి ప్రపంచ దేశాల్లో మరింత ఇనుమడించనున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. భారత్-ఇంగ్లాండ్ టెస్టుమ్యాచ్ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆంధ్రా క్రికెట్ సంఘం ఎసిఎ-విడిసిఎ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు.

11/18/2016 - 01:02

విజయవాడ, నవంబర్ 17: ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ను పటిష్ఠంగా అమలుపర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్న రేషన్ డీలర్ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. డీలర్లకు ఆర్థిక పరిపుష్టి కలిగేలా చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు బియ్యం, గోధుమలపై భారీగా కమీషన్ పెంచింది. రేషన్ షాపులను మినీ ఏటిఎంలుగా మార్చేసి నగదు లావాదేవీల్లో కమిషన్ అందజేయాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 28,942 రేషన్ దుకాణాలు ఉన్నాయి.

11/18/2016 - 01:01

హైదరాబాద్, నవంబర్ 17: మనీ సర్క్యులేషన్ స్కాంలో నిందితుడిగా ఉన్న మైఖేల్‌ఫెరీరా మరో నలుగురిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను హైకోర్టు ధర్మాసనం గురువారం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం వద్ద పిటిషన్ దాఖలు చేసింది.

11/18/2016 - 01:00

చిత్తూరు, నవంబర్ 17 : చిత్తూరు ఎమ్మెల్యే డిఎ సత్యప్రభ గురువారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 9.30 గంటలకు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన దివంగత మేయర్ కఠారి అనురాధ దంపతుల విగ్రహాలను ఆవిష్కరించారు. కార్యక్రమానంతరం లక్ష్మినగర్ కాలనీలో ఉన్న తన నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అకస్మాత్తుగా షుగర్ లెవల్స్‌తో పాటు బిపి పెరిగిపోవడంతో ఇబ్బంది పాలయ్యారు.

11/18/2016 - 01:00

హైదరాబాద్, నవంబర్ 17: పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం తెల్లధనంగా మార్చుకోవడానికి ఎవరి మార్గాలు వాళ్లు వెతుక్కుంటున్నారు. కొంత మంది బంగారంపై దృష్టిసారించడంతో నల్లమార్కెట్‌లో బంగారం ధర అమాంతంగా 50వేలకు తులం పలుకుతోంది. ఈనెల ఎనిమిదిన ప్రధాన మంత్రి పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేయగానే అన్ని వ్యాపారుల మందగించగా ఒక్క బంగారం ధర మాత్రం నల్లమార్కెట్‌లో పెరిగిపోయింది.

Pages