S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/16/2016 - 03:06

భద్రాచలం, నవంబర్ 15: మావోల ఆర్థిక మూలాలపై దృష్టి సారించిన కేంద్ర హోంశాఖ పెద్ద నోట్ల రద్దు తర్వాత మరింత వేగంగా దూసుకు వెళ్తోంది. మావోయిస్టు పార్టీకి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు భారీగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. దండకారణ్యంలోని బస్తర్ రీజియన్‌లో మావోయిస్టులకు చెందిన రూ.7వేల కోట్లు పెద్ద నోట్లు ఉన్నాయని గుర్తించిన నిఘా వర్గాలు వాటి మార్పిడిపై దృష్టి సారించాయి.

11/16/2016 - 03:00

హైదరాబాద్, నవంబర్ 15: పెద్దనోట్ల రద్దు ప్రభావం ఉల్లిపై తీవ్రంగా పడబోతోంది. ఉల్లిపంట ఈసారి బాగానే ఉన్నా ఒక్కో లారీ ఉల్లికి దిగుమతి, రవాణా, హమాలీ చార్జీలు కలిపి 50వేల రూపాయల వరకు వ్యయం అవుతుంది. కానీ, నోట్లరద్దుతో నగదు చెలామణిలో లేకుండా పోవటంతో వ్యాపారానికి పెద్ద విఘాతం ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితిలో తాము ట్రేడింగ్ చేయలేమని వ్యాపారులు తేల్చి చెప్తున్నారు.

11/16/2016 - 02:50

గుంటూరు, నవంబర్ 15: గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాల గైనకాలజీ పిజి విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే ప్రధాన కారణంగా పోలీసులు ధ్రువీకరించారు.

11/16/2016 - 02:48

హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 15: దేశంలో కొద్దిసంఖ్యలో ఉన్న నల్లకుబేరుల కోసం యావత్ దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరైన నిర్ణయం కాదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లధనాన్ని నిరోధించే పేరుతో దేశాన్ని స్తంభింపచేయడం ఏమిటని ప్రశ్నించారు.

11/16/2016 - 02:45

హైదరాబాద్, నవంబర్ 15: మన దేశంలో కరెన్సీ నోట్ల ముద్రణకు ఉపయోగించే సిరా (ఇంక్), సిల్వర్ థ్రెడ్‌ను సరఫరా చేస్తున్న సంస్థే పాకిస్తాన్‌కూ సరఫరా చేస్తున్నదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని ఆయన మంగళవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రశ్నించారు.

11/16/2016 - 02:42

ప్రత్తిపాడు, నవంబర్ 15: సత్యాగ్రహ పాదయాత్రకు పూనుకున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని మంగళవారం పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో ఆయన పాదయాత్రను వాయిదా వేసుకుంటున్నానని, విడుదల తరువాత మళ్లీ ప్రారంభిస్తానని ప్రకటించారు. బ్రిటిష్ హయాంలోనూ లేనంత నిర్బంధకాండను ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు.

11/16/2016 - 05:32

నెల్లూరు, నవంబర్ 15: రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తాను దత్తత తీసుకున్న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పుట్టంరాజుకండ్రిగ గ్రామానికి బుధవారం వస్తున్నారు. 2014లో ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు సచిన్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అప్పటి వరకూ పక్క ప్రాంతాలకు కూడా సరిగా తెలియని ఈ గ్రామం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది.

11/16/2016 - 02:36

హైదరాబాద్, నవంబర్ 15: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో అవినీతి నిరోధక శాఖకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఫోన్‌కు హైదరాబాద్, సికింద్రాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి సగటున రోజూ 20 వరకు అవినీతిపై ఫిర్యాదులు వచ్చేవి. కాని ప్రధాని నరేంద్రమోదీ గత మంగళవారం పెద్దనోట్ల రద్దు ప్రకటనతో అవినీతిపై ఫిర్యాదులు తగ్గినట్లు ఏసిబి వర్గాలు తెలిపాయి.

11/16/2016 - 02:35

హైదరాబాద్, నవంబర్ 15: హైదరాబాద్ మారెడ్‌పల్లిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఓ రిటైర్డ్ ఉద్యోగి బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చి గుండెపోటుతో మృతి చెందాడు. అనంతపురంకు చెందిన లక్ష్మణ్‌రావు(78) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. గత కొనే్నళ్లుగా సికిందరాబాద్‌లోని రైల్వే కాలనీలో నివాసముంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం గం.

11/16/2016 - 02:33

హైదరాబాద్, నవంబర్ 15: కాపునేత ముద్రగడ పద్మనాభం 16వ తేదీ బుధవారం నుంచి తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రను నిలుపుదల చేసేందుకు ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి తన నిరసన తెలియచేసే హక్కు ఉందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

Pages