S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/14/2016 - 01:19

హైదరాబాద్, నవంబర్ 13: పెద్దనోట్ల చలామణిపై కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణలోని స్థానిక సంస్థలకు కాసులు కురిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు స్థానిక సంస్థల కార్యాలయాలకు పన్నుల రూపంలో కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి.

11/14/2016 - 01:34

ఖమ్మం, నవంబర్ 13: ఇచ్చిన మాట తప్పకుండా చెప్పినవన్నీ చేయడమే తమకు తెలుసని రాష్ట్ర మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖామంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు, పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా శ్రేయస్సే తమ ఎజెండా అంటూ భారతదేశం గర్వించదగ్గ రీతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

11/14/2016 - 01:06

విజయవాడ, నవంబర్ 13: గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సోమవారం సెలవు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బ్యాంకులు, పోస్టాఫీసులు పని చేస్తాయి. నగదు మార్పిడిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సోమవారం రాష్టవ్య్రాప్తంగా బ్యాంకులు పని చేస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

11/14/2016 - 01:00

విజయవాడ, నవంబర్ 13: రాష్ట్రంలో భారీ ఎత్తున ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 17 మంది ఐఎఎస్, 9 మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ ఠక్కర్ ఆదివారం ఉత్తుర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్-వైస్ చైర్మన్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి డిజి డాక్టర్ ఎం మాలకొండయ్య నియమితులయ్యారు.

11/14/2016 - 00:59

హైదరాబాద్, నవంబర్ 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగులు విద్యుత్తును సాధించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించేందుకు విద్యుత్ అధికారులు నిర్ణీత కాలపరిమితిలో లక్ష్యాలను పెట్టుకుని పనిచేయాలని సిఎం ఆదేశించారు. ఆదివారం ఆయన రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

11/14/2016 - 00:54

హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్‌తో తొలి ఆరు నెలల రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం దక్షిణాది రాష్ట్రాల్లోనే మొదటి స్థానంలో ఉంటే, మారిన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలు 31.21 శాతం గ్రోత్ రేటు సాధించింది. ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకన్నా తెలంగాణ చాలా ముందుంది.

11/14/2016 - 00:53

ఆత్మకూరు, నవంబర్ 13: కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయమై ఎలాంటి చట్టబద్ధత కల్పించ లేదన్నారు. అందువల్ల హోదా అంటూ రాబోదని, దానికి మించిన రీతిలో ప్యాకేజీలతో ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు.

11/13/2016 - 06:36

హైదరాబాద్, నవంబర్ 12: ప్రకృతి విపత్తులను ముందుగానే కనిపెట్టే సామర్ధ్యం భారత దేశానికి ఉందని ఎన్‌జిఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ వీరేందర్ ఎం.తివారి తెలిపారు. న్యూఢిల్లీలో 7వ తేదీన ప్రారంభమైన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌లో భాగంగా శనివారం ఎన్‌జిఆర్‌ఐలో అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

11/13/2016 - 06:36

అందుకే పెద్ద నోట్లు రద్దు ప్రజల్లో భయాందోళన అక్కర్లేదు
అంతా సహకరిస్తున్నారు సరిపడా నోట్లు అందుబాటులో ఉన్నాయి
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి

11/12/2016 - 08:14

హైదరాబాద్, నవంబర్ 11: రాష్టస్థ్రాయిలో అవినీతి నిరోధక శాఖ, జాతీయ స్ధాయిలో సిబిఐ పోలీసులు వివిధ సోదాలు, దాడుల నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న నగదు కోట్ల రూపాయల్లో ఉంటుంది. వీటిని కోర్టులోని చెస్ట్ లేదా కోర్టు ఆదేశాల మేరకు తమ కార్యాలయాల చెస్ట్‌ల్లో సిబిఐ, ఏసిబి అధికారులు భద్రపరుస్తుంటారు. సాధారణంగా స్వాధీనం చేసుకున్న నగదును కోర్టు భవనాల్లోని చెస్ట్‌ల్లో భద్రపరుస్తారు.

Pages