S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/10/2016 - 02:34

హైదరాబాద్, నవంబర్ 9: దేశీయంగానే అన్ని వస్తువులు తయారు చేసి భారతదేశ బ్రాండ్ ఇమేజిని పెంచేందుకు కేంద్రప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ పథకానికి విశేష స్పందన లభిస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.

11/10/2016 - 02:16

హైదరాబాద్, నవంబర్ 9: డిఎస్పీ పదోన్నతులపై నివేదిక ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. డైరెక్ట్‌గా, పదోన్నతులుగా డిఎస్పీలుగా నియమితులైన అధికారుల సీనియారిటీ జాబితాను రూపొందించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు రెండు రాష్ట్రాల డిజిపిలను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసును నవంబర్ 21వ తేదీకి వాయిదా వేశారు.

11/10/2016 - 02:10

హైదరాబాద్, నవంబర్ 9: దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్ పంపకాలపై కేంద్ర హోంశాఖ కసరత్తును ప్రారంభించింది. ఈ నెల 15న ఏపి భవన్‌పై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఢిల్లీకి రావాలని కేంద్రం ఆహ్వానించింది.

11/09/2016 - 07:57

హైదరాబాద్, నవంబర్ 8: రాష్ట్రంలో రైతుల నుండి సోయాబీన్ కొనుగోలు చేసేందుకు సెంట్రల్ మార్కెట్ ఫండ్ నుండి మూడుకోట్ల రూపాయలు ఆయిల్‌ఫెడ్‌కు (తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ ఆయిల్‌సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్) ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి పేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

11/09/2016 - 07:31

ఐదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ
తీసుకున్న నిర్ణయంపై వివిధ రాజకీయ పార్టీలు స్పందించాయి.

11/09/2016 - 07:25

హైదరాబాద్, నవంబర్ 8: భారత ఆర్ధిక వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నల్లధనం నిరోధం కోసం అనేక చర్యలు చేపట్టిన నేపథ్యంలో 500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లు మంగళవారం అర్ధరాత్రి నుండి రద్దు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించి అందరినీ దిగ్భ్రమకు గురిచేశారు. నిజానికి చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను రద్దు చేయడం ఇదే మొదటిసారి కాదు.

11/09/2016 - 07:23

హైదరాబాద్, నవంబర్ 8: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బిసి విద్యార్థులకు ప్రభుత్వం 20లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. మహాత్మా జ్యోతిబా ఫూలే బిసి ఓవర్‌సీస్ విద్యానిధి పథకం మార్గదర్శకాలను మంగళవారం జారీ చేశారు. 20 లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌ను రెండు విడతలుగా చెల్లిస్తారు.

11/09/2016 - 07:22

హైదరాబాద్, నవంబర్ 8: అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసును రద్దు చేయాలని, కొట్టి వేయాలన్న నిబంధన చట్టంలో లేదని ఓటుకు నోటు కేసులో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది పి సుధాకర్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. మంగళవారం హైకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. ఈ కేసును జస్టిస్ సునీల్ చౌదరి విచారించారు.

11/09/2016 - 02:34

వెంకటాపురం, నవంబర్ 8: ఇటీవలే కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురంలో మంగళవారం బన్ను ఆసుపత్రి ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్యశిబిరానికి పెద్దఎత్తున ప్రచారం చేయడంతో వందల సంఖ్యలో రోగులు తరలివచ్చారు. కాగా ఈ ఉచిత మెగా వైద్యశిబిరంలో నలుగురు ప్రత్యేక వైద్య నిపుణులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని ప్రకటించారు.

11/09/2016 - 02:50

కొత్తగూడెం, నవంబర్ 8: సింగరేణి కొత్తగూడెం ఏరియాపరిధిలో ఉన్న వికె-7 ఇంక్లైన్ భూగర్భగని వద్ద మంగళవారం గుర్తింపు సంఘమైన టిబిజికెఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, టిబిజికెఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.

Pages